ఉక్రెయిన్, తైవాన్‌లు తమ దేశ అంతర్భాగాలని రష్యా, చైనాలు వాదిస్తున్నాయి. సోవియట్ యూనియన్ విడిపోయి నప్పుడు ఉక్రెయిన్, చైనా నుంచి వేరు పడి నప్పుడు తైవాన్ స్వతంత్ర దేశాలుగా మనుగడ సాగి స్తున్నాయి. పొరుగు దేశాల భూభాగాలను కబళించా లన్న విషయంలో రష్యా, చైనా రెండూ ఒకే తీరులో వ్యవరిస్తున్నాయి. దాంతో తైవాన్‌లోని యువకులు ఎప్పటికైనా చైనా తమ దేశాన్ని కబళిస్తుందేమోనన్న భయంతో ఉన్నారు. ఉక్రెయిన్-రష్యాల మధ్య యుద్ధం లో రష్యా ఓడిపోవాలని కోరుకుంటున్నారు. ఉక్రెయిన్‌పై పదిమాసాలకు పైగా దాడులు జరుపుతున్న రష్యన్ సైనికులకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉక్రెయిన్ దళాలకు తోడ్పాటునందించేందుకు ముందుకు వస్తు న్నారు. ఇప్పటికే వేలాదిమంది ఉక్రెయిన్ సైన్యానికి బాసట నిలిచారు. వీరిలో పలువురు అసువులు బాసారు. ఉక్రెయిన్‌కి సైనికంగా తోడ్పాటునందిస్తున్న దేశాల్లో తైవాన్ సైనికులే ఎక్కువమంది ఉన్నారు. ఉక్రెయిన్ ప్రజల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన హీరోగా తైవాన్ కి చెందిన త్సెంగ్ జంగ్‌కి అశ్రు నివాళి అర్పించేందుకు ఇటీవల జరిగిన సమావేశానికి అతడి తల్లి కూడా హాజర య్యారు.
స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం పోరాడుతున్న ప్రజల కోసం తన కుమారుడు ప్రాణత్యాగం చేసినందుకు ఎంతో గర్విస్తున్నానంటూ ఆమె అతడి సమాధివద్ద అశ్రు నివాళిలర్పించారు. ఆమె మాత్రమే కాదు, ఎంతోమంది తైవాన్ మహిళలు చైనా దాష్టీకాలను నిరసిస్తూ తమ బిడ్డలను సైన్యంలో చేరాల్సిందిగా ప్రోత్సహిస్తున్నారు. మాతృదేశ రక్షణ కోసం ఉక్రెయిన్లు చేస్తున్నత్యాగాలను వారు చాలా ఘనంగా పేర్కొంటున్నారు. రష్యా మాదిరి గానే చైనాకూడా తమ దేశంపై విరుచుకుని పడుతుం దేమోనన్న బెదురు, భయం తైవాన్ ప్రజల్లో ఉంది. రష్యాకు చైనా అన్ని విధాలా సాయపడుతున్న సంగతి బహిరంగ రహస్యమే. ఉక్రెయిన్‌ని రష్యా సొంతం చేసు కుంటే తదుపరి చర్యగా, చైనా తైవాన్‌ని ఆక్రమిం చుకోవడానికి ప్రయత్నించవచ్చు. అప్పుడు చైనాకు రష్యా అన్ని విధాల సాయపడవచ్చు. దీనిపై చైనీస్ నాయకులు ఇప్పటికే బహిరంగ ప్రకటనలు చేశారు. చేస్తున్నారు. సోవియట్ యూనియన్ విడిపోవడంలో ఉక్రెయిన్ ప్రజల పాత్ర ఏమీ లేదు. దాని మాదిరిగా ఇంకా చాలా ప్రాంతాలు స్వతంత్ర రి పబ్లిక్‌లుగా ఏర్పడ్డా యి. వాటిలో కొన్ని రష్యాకు దాసోహమయ్యాయి. ఉక్రెయిన్ మాత్రం రష్యాకు లొంగకపోవడమే కాకుం డా, నాటో కూటమిలో చేరేందుకు ప్రయత్నాలు జరుపు తోంది.
తమ దేశం ప్రాదేశిక భద్రతను కాపాడుకునేందుకే నాటో కూటమిలో చేరాలనుకుంటున్నట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెనిస్కీ చాలాసార్లు ప్రకటించారు. నాటో కూటమి అమెరికా నేతృత్వంలో పనిచేస్తోంది కావున, అమెరికాయే ఉక్రెయిన్‌ను తమ దేశం నుండి వేరు చేయాలని చూస్తోందని రష్యా ఆరోపణ. తమ శత్రువు పంచన చేరి తమ దేశంపై కవ్వింపులకు పాల్పడుతు న్నందునే ఉక్రెయిన్‌పై దాడి చేయాల్సి వచ్చినట్టు రష్యా చాలా సందర్భాల్లో ప్రకటించింది. ఉక్రెయిన్ మాదిరిగా తోక జాడించడానికి సిద్ధంగా ఉన్న దేశాల పని పడతా మని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పటికే ప్రకటిం చారు. అమెరికా, దాని మిత్ర దేశాల అండ లేకపోతే ఉక్రెయిన్ తమదేశంతో తలపడలేదన్న విషయం రష్యాకు తెలుసు. అలాగే, ఉక్రెయిన్‌ని నిలువరించ లేకపోతే రష్యా మరింతగా రెచ్చిపోతుందేమోనని అమె రికా అనుమానిస్తోంది. ఉక్రెయిన్-రష్యాల మధ్య పర స్పరం దాడులుగా ప్రారంభమైన ఈ యుద్ధం వల్ల ఇప్ప టికే ప్రపంచంలోని పలు దేశాలు ఆర్థిక, చమురు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. రష్యాకి చెక్ పెట్టేందుకు నాటో దేశాలు, రష్యా వ్యతి రేక దేశాలు జతకట్టాయి. ఈ నేపథ్యంలో చిన్న దేశాలు నలిగి పోతున్నాయి. ఈ యుద్ధంలో చైనా చాలా దుష్టమైన పాత్ర వహిస్తోంది.
పనిలో పనిగా తైవాన్‌ని కబళించేందుకు ఇప్పటికే పలు చర్యలు తీసుకుంది. దీనిని గ్రహించే అమెరికా చట్టసభ అధ్యక్షురాలు న్యాన్సీ పెలోసీ ఆమధ్య తైవాన్‌ని సందర్శించారు. ఆమె వచ్చి వెళ్ళిన తర్వాత తైవాన్ జల సంధిలో చైనా యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తోంది. చైనా తో ప్రచ్ఛన్న యుద్ధానికి తలపడడం తమ అభిమతం కాదని అమెరికా అధ్యక్షుడు బిడెన్ ప్రకటిస్తూనే ఉక్రెయిన్‌కి సాయమందించే దేశాలకు తమ దేశం అండగా ఉంటుందని ప్రకటించారు. అంటే తైవాన్‌పై ఈగ వాలినా సహించబోమని ఆయన చెప్పకనే చెప్పా రు. అమెరికా హెచ్చరికలను పరిగణనలోకి తీసుకున్న చైనా తైవాన్‌పైకి హెలికాప్టర్లనూ, డ్రోన్లను పంపిస్తోంది. అమెరికా అండ ఉంది కనుకనే తైవాన్ చైనాని ఎదిరించగలుగుతోంది.