తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకె అధినేత్రి జయలలిత మరణానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు జరిపిన జస్టిస్ ఆర్ముగం కమిషన్ నివేదికపై అనే క సందేహాలు ఉన్నాయి. ఈ నివేదికను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంగళవారంనాడు అసెంబ్లిలో ప్రవేశపెట్టారు. 2017లో ఈ కమిషన్‌ని రాష్ట్ర ప్రభు త్వం నియమించింది. 2016లో చెన్నై అపోలో ఆస్పత్రి లో జయలలితకు చికిత్స ప్రారంభమైనప్పటి నుంచి ఆమె మరణించిన తేదీ వరకూ చోటు చేసుకున్న పరిణా మాలపై జస్టిస్ ఆర్ముగ స్వామి పూస గుచ్చినట్టు వివరిం చారు. అయితే, ఇందుకు సంబంధించి శశికళ, ఆనాటి రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాథాకృష్ణన్, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్, సంబంధిత అధికారుల పాత్రపై దర్యాప్తు జరిపించాలని ఆర్ముగం కమిషన్ సిఫా ర్సు చేసింది. అయితే, జయలలితకు అపోలో ఆస్పత్రిపై అందించిన చికిత్సపై ఢిల్లిలోని అఖిల భారత వైద్యశాస్త్ర పరిశోధనా సంస్థ (ఎయిమ్స్) వైద్యుల బృందం నివేది కను జస్టిస్ ఆర్ముగ స్వామి కమిషన్ ఉద్దేశ్య పూర్వకంగానే విస్మరించినట్టు కనిపిస్తోంది. ఈ వైద్య బృందం సుప్రీం కోర్టు ఆదేశాలపై ఏర్పాటైంది. ఆ బృందం అపోలో ఆస్పత్రిలో జయలలితకు అందిస్తున్న వైద్యచికిత్స తీరును సమర్ధించింది. అంత ప్రాముఖ్యం ఉన్న వైద్య బృందం నివేదికను జస్టిస్ ఆర్ముగ స్వామి ఎలా విస్మరించారో అర్థం కావడం లేదు. అంతేకాక, జయలలితకు ఆంజియో ప్లాస్ట్ జరపాలన్న వైద్యుల బృందం సూచనలు ఎందుకు అమలు కాలేదో తెలియజేయలేదు. జయలలితకు అపోలో ఆస్పత్రిలో చికిత్స అంతా ఆమె ఇష్టసఖి, సన్నిహితురాలు శశికళ ఆదేశాల ప్రకారమే జరిగిందన్న విషయాన్ని ఎవరూ కాదనడం లేదు.
జయకు ఆంజి యోప్లాస్ట్ అవసరం లేదని శశికళే స్పష్టం చేసినట్టు చెబుతున్నారు. ఆర్ముగ స్వామి తన నివేదికలో ఆనాటి పరిస్థి తులనూ, రాజకీయ కోణాలను మాత్రమే ఎత్తి చూపారు. ఆయన న్యాయవాది వృత్తి నుంచి అంచలంచెలుగా ఎదిగిన వారు. ఆయనకు వైద్య శాస్త్ర అంశాలపై పరిచ యం, అవగాహన తక్కువ. కనుక ఆయన చేసిన సిఫా ర్సులను ఎంత వరకూ వాస్తవమని భావించాలో అర్థం కావడం లేదని నిపుణులు అంటున్నారు. అపోలో ఆస్పత్రి వైద్యులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తు న్నారు. అలాగే, జయను విదేశాల్లో చికిత్సకు తీసుకుని వెళ్ళాలన్న సిఫార్సును ఎందుకు అమలు జరపలేదో తెలి యదు. ఆ విషయం కూడా జస్టిస్ ఆర్ముగ స్వామి కమిషన్ ప్రస్తావించలేదు.ఈ కమిషన్ ముందు సాక్ష్యాలు ఇచ్చిన వారిలో కొందరు ఎదురు తిరిగిన మాట నిజమే. ఆనాటి ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం జయకు జరుగుతున్న చికిత్స గురించి శశికళ తనకు ఏనాడూ తెలియజేయలేదనీ, వైద్యుల బృందం నివేదికల గురించి ఎప్పుడూ చెప్పలేదని వాంగ్మూలం ఇచ్చారు. అంతేకాక, జయలలిత బెడ్ వద్దకు తనను వెళ్ళనీయలేదనీ, ఇన్‌ఫెక్షన్ పెరుగుతుందంటూ తనను అడ్డుకున్నారని పన్నీరు సెల్వం అప్పట్లో ఆరోపించారు. అయితే, రాజకీ య పరిణామాల ప్రభావంతో ఆ తర్వాత ఆయన మాట మార్చారు. జస్టిస్ ఆర్ముగ స్వామి కమిషన్ అతి ముఖ్యమై న విషయాలను ప్రస్తావించకుండా శశికళ బృందం పాత్ర పై దర్యాప్తు జరపాలని సిఫార్సు చేస్తూ నివేదిక సమర్పిం చింది.
జయకు అందించిన చికిత్స గురించి శశికళ స్వయంగా ఆదేశాలు జారీ చేసేవారనీ, ఈ విషయంలో ఇతరులు ఎవరూ నోరు మెదిపేవారు కాదని ఆమె మేన ల్లుడు కూడా అంగీకరించారు. శశికళ సమీప బంధువు డాక్టర్ శివకుమార్‌కి ఒక్కరికి మాత్రమే చికిత్స వివరాలు తెలిసేవనీ, వైద్యులు సైతం శశికళను మాత్రమే సంప్రదిం చేవారని పన్నీర్ సెల్వం స్పష్టం చేసినట్టు ఆర్ముగ స్వామి కమిషన్ నివేదిక పేర్కొంది. అలాగే, విదేశాల్లో జయకు చికిత్స చేయించాలన్న ఢిల్లి వైద్య బృందం సిఫార్సులను అపోలో ఆస్పత్రి బృదం తిరస్కరించినట్టు ఆర్ముగ స్వామి తన నివేదికలో పేర్కొన్నారు. ఆ జస్టిస్ ఆర్ముగ స్వామి దర్యాప్తు చేసిన అంశాలు వైద్య శాస్త్ర పరిధిలోనివి కావు. అందువల్ల ఈ నివేదకలోని అంశాలను ఆధారం గా చేసుకుని తదుపరి దర్యాప్తునకు ఎలా ఆదేశిస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా జయలలిత ఎప్పుడు మరణించారనే దానిపై వైద్యులు చెప్పినదాని కీ, శశికళ ద్వారా తెలిసిన సమాచారానికీ తేడా ఉంది. అందువల్ల చికిత్స అందించిన వైద్యులను పక్కన పెట్టి కేవలం శశికళ నోటి ద్వారా వచ్చిన అంశాలనే పరిగణన లోకి తీసుకోవడమేమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. జయ ను ఆస్పత్రిలో చేర్పించిన నాటి నుంచి అక్కడ జరిగిన సంఘటనలు, పరిణామాల గురించి శశికళ చాలా గోప్యంగా ఉంచారనీ, దీంతో అనుమానాలు మరింతగా పెరుగుతున్నాయని కమిషన్ పేర్కొన్న అంశాన్ని తోసి పుచ్చలేం. అయితే, జయ మరణం అసాధారణమైనద న్న పన్నీర్ సెల్వం ఆ తర్వాత మాటమార్చారు.