Tuesday, November 26, 2024

జీఎస్టీలో పెద్దల వాటా పెరగాలి!

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ఆదాయం గత సంవత్స రం కన్నా 16.6 శాతం పెరిగింది.అక్టోబర్‌లో జీఎస్టీ ద్వారా లక్షా 51వేల కోట్ల రూపాయిల ఆదాయం లభించి నట్టు ప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో 1.30 లక్షల కోట్ల రూపాయిల ఆదాయం లభించింది. జీఎస్టీ ద్వారా ఆదాయంలో అధిక భాగం సేవల రూపం లో వసూలు అయినదే. అలాగే, జీఎస్టీ ఆదాయం పెరుగుదల దేనికి సూచిక? జీఎస్టీ పరిధిలోకి మరిన్ని వస్తువులను తీసుకుని రావడం వల్ల ఆదాయం పెరిగింద న్నదనేది కాదనలేని వాస్తవం. అంటే, పేదల నుంచి వచ్చే పన్నుల ద్వారానే జీఎస్టీ ఆదాయం పెరిగినట్టు భావించ వచ్చు. గత ఏప్రిల్‌లో జీఎస్టీ ఆదాయం గరిష్ఠంగా రూ. 1.67 లక్షల కోట్లు వసూలు అయ్యాయి. రూ. 1.45 లక్షల కోట్లు పైగా వ సూలు కావడం ఇది ఎనిమిదివసారి.

జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత ఇది తొమ్మిదవసారి. జీఎస్టీ ని ప్రవేశపెట్టినప్పుడు చాలా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీనివల్ల ప్రభుత్వానికి ఆశించిన రాబడి రాద న్న అనుమానాలను కొన్ని వర్గాలు వ్యక్తం చేయగా, ఎగవేతలు పెరుగుతాయని మరికొన్ని వర్గాలు పేర్కొన్నా యి. అయితే, జీఎస్టీ ఆదాయం నెలనెలా పెరుగుతుండ టంతో ఆ అనుమానాలు ఆధారాలు లేనివని స్పష్టం అయింది. రాష్ట్రాలవారీగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో ఇదే నెలలో 2,879 కోట్ల రూపాయిల ఆదాయం లభిం చగా, ఈ ఏడాది 3,854 కోట్ల రూపాయిలు లభించింది. అయితే, కట్టేవారు ఎప్పుడూ కడుతూనే ఉన్నారు, ఎగవేసేవారు ఎప్పుడూ ఎగవేస్తూనే ఉన్నారన్న సామెత చందంగానే జీఎస్టీ వసూళ్ళు జరుగుతున్నట్టు స్పష్టం అవుతోంది. కేంద్రం మాత్రం జీఎస్టీని ప్రవేశపెట్టిన తర్వా త పన్ను కట్టేవారి సంఖ్య పెరిగిందంటూ పదే పదే ప్రకటి స్తోంది.

అది నిజమే కావచ్చు. పాలు, పెరుగు, మందుల వంటి నిత్యావసరాలపై జీఎస్టీ విధించడం వల్లనే దీని ద్వారా ఆదాయం పెరిగిందన్న వాదన అవాస్తవం కాకపోవచ్చు.ఈ విషయంలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్ర రూ. 23,037 లక్షల కోట్ల ఆదాయం సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది.ప్రభుత్వానికి ఇతర పన్నుల రూపంలో కూడా ఆదాయం బాగానే వస్తున్నా, పేదలు, మధ్యతరగతి వర్గాలపై ప్రభుత్వం భారాన్ని మోపుతూనే ఉంది. కేంద్రానికీ, రాష్ట్రాలకు జీఎస్టీ ప్రధాన ఆదాయ వనరుగా పరిగ ణించబడుతోంది. జీఎస్టీ పన్ను రేట్లను తగ్గించాలని మొదటి నుంచి రాష్ట్రాలు కేంద్రాన్ని పదే పదే కోరుతుండటం, వీలునుబట్టి కేంద్రం తగ్గిస్తూ ఉండటం జరుగుతోంది. అలాగే జీఎస్టీ పరిహారం చెల్లింపులో కూడా తమకు న్యాయం జరగడం లేదని కొన్ని రాష్ట్రాలు తరచూ ఫిర్యాదు చేస్తున్నాయి.

- Advertisement -

అలాగే కొన్ని వస్తువులపై జీఎస్టీని ఎత్తివేయాలని కూడా కోరుతున్నాయి. ఉదాహ రణకు చేనేతపై జీఎస్టీని విధించడం వల్ల బడుగు, బలహీ న వర్గాల వారి బతుకులు ఛిద్రం అవుతా యని చేనేత వర్గా లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అలాగే, చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు ఉత్పత్తి చేసే వస్తువులపై జీఎస్టీ విధించాలన్న ఆలోచనల ను మానుకోవాలని ఆ పరిశ్రమల ద్వారా ఉపాధి పొందుతున్న వారు డిమాండ్‌ చేస్తున్నారు. పన్ను ఎగ్గొట్టాలనే భావన ఎవరికీ ఉండదు. అవి మోయగల భారంగా ఉన్నప్పుడే చెల్లింపుదారులు నిజాయితీగా పన్నులు కడుతుంటారు. భారం పెరిగితే దాని నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు.

ఇది సహజమే కావచ్చు కానీ, పన్ను చెల్లింపు వారికి ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహకాలు లభించి నప్పుడే చెల్లింపు దారుల్లో శ్రద్ధ పెరుగుతుంది, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పలు సందర్భాల్లో ఈ విషయం స్పష్టం చేశారు. పన్ను చెల్లింపుదారులను గౌరవించాల నీ, వారిని అను మానించకూడదని ఆయన తరచూ సూచిస్తున్నారు. అలాగే, పన్నుల భారాన్ని తగ్గించమని అడిగేవారిని న్యూనతా భావంతో చూడరాదని కూడా ప్రధాని స్పష్టం చేశారు. జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్‌, డీజిల్‌ వంటి వస్తువు లను తేవాలన్న డిమాండ్‌ చాలాకాలంగా ఉంది. కానీ,ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవడం లేదు. గృహ అవసరాలకు సరఫరా చేసే గ్యాస్‌ సిలిండర్ల ధరను అదే పనిగా కేంద్రం పెంచే స్తోంది.

అదే సందర్భంలో వాణిజ్య అవసరాలకు విని యోగించే సిలిండర్ల ధరను తగ్గిస్తూ వస్తోంది. దీంతో ఈ ప్రభుత్వం పెద్ద వర్గాలకు మాత్రమే ప్రయోజనకారిగా ఉందనే అభిప్రాయం బలపడుతోంది. జీఎస్టీ వసూళ్ళ లో పెద్ద వ్యాపార స్తులకు కల్పించే వెసులుబాటు తమకు కల్పించడం లేదని చిన్న వ్యాపారులు వాపోతున్నారు. ఇటువంటి తేడాలు లేకుండా చేస్తే ఆదాయం ఇంకా పెరుగుతుంది. జీఎస్టీ లో సేవల ద్వారా వచ్చే ఆదాయమే సింహభాగంగా ఉంటోంది. వస్తువులపై ఆదాయం కూడా పెరిగితే దీనిపై ఇంకా ఉన్న అనుమానాలు తొలగి పోతాయి. జీఎస్టీ వ్యవస్థను ప్రభుత్వం అమలులోకి తెచ్చిన తర్వాత చాలా వరకూ మార్పులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement