Tuesday, November 26, 2024

నీతి ఆయోగ్‌ నీడలు తొలగినట్టేనా!

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రణాళికా సంఘం పనిచేసేది. నరేంద్రమోడీఅధికారంలోకి వచ్చిన తర్వాత దాని స్థానే నీతి ఆయోగ్‌ అనే సంస్థను ఏర్పాటు చేశారు.ఆ పేరు వినగానే ఈ సంస్థ ప్రణాళికా సంఘం పాత్రను ఎంత వరకూ ఇది నిర్వహించగలదా అన్న సంశయాలు వచ్చాయి. దానికి తగ్గట్టుగానే అది ఏర్పాటైన నాటి నుంచిరాష్ట్రాల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. పూర్వపు ప్రణాళికా సంఘం రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకుని అందుకు అనుగుణంగా ఏయే రాష్ట్రాల్లో అమలులో ఉన్న పథకాలకు ఎంతెంత కేటాయించాలో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కేంద్రానికి సిఫార్సులు చేసేది.ఇప్పుడునీతి ఆయోగ్‌ కూడా అదే మాదిరిగా పరిశీలన జరిపి కేంద్రానికి సిఫా ర్సులు చేస్తున్నా, కేంద్రం నుంచి సానుకూలమైన స్పంద న రావడం లేదన్నది రాష్ట్రాల ఫిర్యాదు. ప్రణాళిక రచన లో పేరొందిన అధికారులు ఈ సంస్థలో ప్రముఖమైన స్థానాల్లో ఉన్నారు. వారు ఆయా రాష్ట్రాల్లో పర్యటించి క్షేత్ర స్థాయిలో వివిధ పథకాల అమలు తీరును తెలుసు కుని వాటికి ఏమేరకు కేంద్రం సాయం అందించాలో సిఫార్సుచేస్తున్నారు. ఆ పథకాలను మెచ్చుకుంటున్నా రు కూడాఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలను నీతి ఆయోగ్‌ అధికారులు స్వయంగాపరిశీలించి మెచ్చుకు న్నారనీ, కానీ, వాటికి కేంద్రం ఎటువంటి నిధులు విదల్చ లేదని తెలంగాణ ప్రభుత్వం వాపోతోంది.అలాగే, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అభ్యర్ధనలూ, విజ్ఞప్తులు వచ్చా యి.

నీతి ఆయోగ్‌ పనితీరులో ప్రశంసలు ఉన్నట్టే, విమ ర్శలూ ఉన్నాయి. కేంద్రానికీ, రాష్ట్రాలకూ మధ్య వారథి గా పని చేయాల్సిన ఈ సంస్థ పనితీరు తప్పు పట్టేందు కు ఏమీ లేకపోయినా, కొంత గ్యాప్‌ వస్తోంది.దాని వల్లనే రాష్ట్రాలు ఈ సంస్థ వల్ల తమకేమీ ప్రయోజనం లేదని వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే, వెనుకటి ప్రణాళికా సంఘం జరిపించిన అధ్యయనాల్లో కూడాఇలాంటి విమర్శలు వచ్చాయి. ఉదాహరణకు దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న వారు అనే అంశంపై నిర్వచనానికి నాటి ప్రణాళికా సంఘం పట్టణాలు, నగరాల్లో ఉన్న వారికీ, పల్లె లలో ఉన్న వారికీ మధ్య ఆదాయం శాతాల్లో తేడా చూపింది. దానిపై విమర్శలు వెల్లువెత్తాయి. గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు కోసం ఈ ఆదాయ శాతా లను పరిగణనలోకి తీసుకోవాలన్న ఆనాటిప్రణాళిక సంఘం నియమించిన టెండూల్కర్‌ నివేదిక వాస్తవాల కు దూరంగా ఉందని ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ విమర్శించింది. కనుక, ఏ ప్రభుత్వంలోనైనా ప్రణాళికా రచయితలు చేసే సిఫార్సులు అన్నీ ఆమోదయోగ్యం అవుతాయని ఖండితంగా చెప్పలేం. ఆ సిఫార్సులే అంతి మం కాదు కనుక, రాష్ట్రాలూ కేంద్రంతో సంప్రదింపులు జరుపుకోవాలి, తమ వాదాన్ని గట్టిగా వినిపించుకోవాలి. ఆదివారం జరిగిన నీతిఆయోగ్‌ సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాష్ట్ర విభజన తర్వాత తమ రాష్ట్రం పూర్తిగా వ్యవసాయాధారితం అయినందు వల్ల వ్యవసాయ రంగానికి ఎక్కువ కేటాయింపులు చేయాలని కోరడం సమంజసమే.

రాష్ట్రంలో అమలులో ఉన్న ఇరిగేషన్‌ పథకాలకు మరిన్ని నిధులు కేటాయించా లన్నది ఆయన ఉద్దేశ్యం.ప్రధానమంత్రి మోడీ వాణి జ్యం, టూరిజం,టెక్నాలజీ (త్రిబుల్‌ టీ) ద్వారా అభివృద్ధి సాధించాలని సూచించారు.ఈ మూడింటి విషయంలో తెలుగు రాష్ట్రాలు ఇప్పటికే ముందున్నాయి. తెలంగాణ సాంకేతికంగా దూసుకుని పోతోంది.సాంకేతిక రంగానికి చెందిన ముఖ్యమైన అంశాలకు కేంద్రంగా ఉంది. వ్యవసాయ రంగంలో ఎనిమిదేళ్లలో ఎంతో పురోగతిని సాధించి ధాన్యం ఎగుమతులలో ముందంజ వేస్తోంది. పర్యాటకంగా హైదరాబాద్‌బాగా అభివృద్ధి చెందింది. అందువల్ల ప్రధాని సూచించిన మూడు టీలలో తెలుగు రాష్ట్రాలు శరవేగంగా దూసుకుని పోతున్నాయని చెప్ప వచ్చు. అయితే, వనరుల సమీకరణకు కేంద్రం చేయూత నిస్తే ఇంకా అభివృద్ధిని సాధించేందుకు అవకాశం ఉంది. పాలనా పరమైన విభాగాల మధ్య సమాచార లోపం లేకుండా చూసుకుంటే అదేమీ కష్టం కాదు.నీతిఆయోగ్‌ అనేది కొత్త ప్రయోగం కావడం వల్ల కొన్ని లోపాలు ఉండవచ్చు. వాటిని సరిదిద్దుకుంటే అంతా మంచే జరుగుతుంది. ఏడేళ్ళ అనుభవం స్వల్పమేమీ కాదు. అలాగే, ఏ వ్యవస్థపైనైనా ముందుగా ఒక నిశ్చితాభిప్రా యానికి రావడమూ సమంజసం కాదు. నీతి ఆయోగ్‌ లో రూపొందిస్తున్న పథకాలు, ప్రణాళికల ద్వారా 2047 నాటికి ఉత్తమ ఫలాలను అందుకోవడం ఖాయమన్న భరోసాను ప్రధాని వ్యక్తం చేశారు. సమాఖ్య స్ఫూర్తిని కేంద్రం పాటిస్తోందనడానికి కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ యే నిదర్శనమని ఆయన అన్నారు. నీతి ఆయోగ్‌ భేటీపై అనుమానాలు సంశయాలు వ్యక్తమైనా మొత్తం మీద అజెండా ప్రకారం అన్ని విషయాలనూ చర్చించింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement