Saturday, November 23, 2024

మళ్లీ కోరలుచాచిన కోవిడ్‌

కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ చేయించుకున్నాం కనుక, ఇక మనకి ఎటువంటి భయం లేదని ధీమాగా ఉండొద్దని కేంద్రమూ, వ్యాక్సిన్‌ తయారు చేసిన సంస్థలూ హెచ్చరిస్తున్నాయి. ఇప్పుడు బిఎఫ్‌-7 రూపంలో ముంచుకొస్తున్న కరోనా వల్ల మళ్ళీ ఆనాటి మృత్యు ఘంటికలు తప్పవని అంటున్నారు. ఇందుకు చైనాలో కుప్పతెప్పలుగా పేరు కునిపోయిన శవాల గుట్టలే ఉదాహరణ. మన దేశంలోకి ఈ కొత్త వేరియంట్‌ అక్టోబర్‌లో గుజరాత్‌లో ప్రవేశించింది. గుజరాత్‌లో మూడు కేసులు నమోదు అయ్యాయి. గుజరాత్‌లోని బయోటెక్నాలజీ లేబొరేటరీలోనూ, విడిగా మరో చోట ఈ వేరియంట్‌ వ్యాపించింది. ఒడిశాలో ఒక కేసు నమోదు అయింది. దీనిపై కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మనసుఖ్‌ మాండవీయ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. ప్రజల్లో ధైర్యం చెప్పేందుకు ఇది ప్రాణాంతకం కాదని వైద్య శాఖ మంత్రి, వ్యాక్సిన్‌ ఉత్పత్తి సంస్థలు చెబుతున్నప్పటికీ చైనాలో పరిస్థితి చూస్తుంటే నమ్మకంగా కనిపించడం లేదు. భారత్‌లో వ్యాపిస్తున్న బిఎఫ్‌-7 వేరియంట్‌ ఒమిక్రాన్‌కి సబ్‌ వేరియంట్‌ అని శాస్త్రవేత్తలు గుర్తించారు. కరోనా మాదిరిగానే జ్వరం రావడం, ఒళ్ళు నొప్పులు, తలతిరగడం వంటి లక్షణాలు ఈ వ్యాధి సోకిన వారిలో కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.

కరోనా అనేది దీర్ఘ కాలికమైన వేరియంట్‌ అని ఆనాడే వైద్యులు స్పష్టం చేశారు. అయితే, వ్యాక్సిన్‌ తీసుకుంటే ఎటువంటి ప్రమాదం లేదని ఇటు ప్రభుత్వమూ, అటు వైద్య సంస్థలూ భ్రమలు కల్పించాయి. ఆరోగ్యం గురించి ఎవరెన్ని జాగ్రత్తలు చెప్పినా, వ్యక్తుల్లో తగిన శ్రద్ధ లేక పోతే ఇలాంటి వేరియంట్లు తిరిగి విజృంభించే ప్రమాదం ఉందని ఇప్పుడు బీఎఫ్‌-7 వేరియంట్‌ తెలియజేస్తోంది. చైనాలో కొవిడ్‌ పూర్తిగా విరగడ అవలేదని గ్రహించడం వల్లనే చైనీస్‌ ప్రభుత్వం మళ్ళీ లాక్‌డౌన్‌లను ప్రవేశపెట్టింది. నిజానికిది అక్కడ రాజకీయ సమస్యగా తయారవడంతో లాక్‌డౌన్‌లపై దేశవ్యాప్త ఆందోళనలు ఉధృత మయ్యాయి. చైనాలో పౌరుల సాధారణ జీవనాన్ని లాక్‌డౌన్‌లు అతలాకుతలం చేయడంతో వాటికి వ్యతిరే కంగా ప్రజలు ఉద్యమించారు. దాంతో ప్రభుత్వం దిగి వచ్చింది. అయితే, దాని ప్రభావం ఇప్పుడు కొత్త వేరి యంట్ల వ్యాప్తిలో కనిపిస్తోంది. లాక్‌డౌన్‌లను పూర్తిగా ఎత్తివేస్తే మరణాల సంఖ్య లక్షల్లో ఉంటుందని అక్కడి వైద్య నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

బిఎఫ్‌-7 కేసులు మన దేశంలోనే కాకుండా, అమెరికా, బ్రిటన్‌, బెల్జియం, జర్మ నీ, ఫ్రాన్స్‌, డెన్మార్క్‌ తదితర దేశాల్లో విస్తరించాయి. బీఎఫ్‌-7కు తిరిగి ఇన్‌ఫెక్షన్‌ కలిగించే శక్తి ఉంది కనుక, ఇలాంటి అనుమానాలు ఏవైనా కలిగితే వైద్యులను సంప్రదించి పరీక్షలు జరిపించుకోవాలని కేంద్రం సూచించింది. ప్రజల్లో నిర్లిప్తత పెరగడ ం వల్లనే ఈ కొత్త వేరియంట్‌ వ్యాపిస్తోంది. మన దేశంలోనే కాదు, ఏ దేశంలోనైనా నిర్బంధాలు ఉంటే వాటిని తొలగించాలని ఆందోళన జరుపుతారు. అవి ఎత్తేస్తే అరమరికలు లేకుండా కలివిడిగా జనం తిరుగుతారు. మామూలు రోజుల్లో కూడా ప్రజలు ఒకరికొకరు రాసుకుని తిరగడం వల్ల ప్రమాదాలు ఉన్నాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు. వీధిలోంచి వచ్చిన వెంటనే ఆరోగ్య పరమైన సూత్రాలను పాటించాలని పెద్దలుబోధించేది ఇందుకోసమే. అయితే, పెద్ద వారంతా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారనీ, తామే ప్రగతి పథంలో సాగుతున్నామని గొప్పలు చెప్పుకోవడం అలవాటైంది. రోడ్డు మీద ఉమ్మి వేయడం ఎంతో ప్రమాదం. ఈ విషయాన్ని గట్టిగా హెచ్చరిస్తే వ్యాధి సోకిన వారూ, ఇతరులూ కూడా పోట్లా టకు వస్తారు. పౌరస్మృతిని గతంలో నీతి శాస్త్రంగా బోధించేవారు. ఇప్పటి చదువులలో ఏ విధమైన స్మృతులు లేవు.

అందుకే, సమాజంలో అశాంతి, అలజడి పెరిగి పోతోంది. కాళ్ళు, చేతులు, వేళ్ళకు దుమ్ము, ధూళి అంట కుండా పరిశుభ్రతను పాటించాలన్నది మన పెద్దల సూచించే ఆరోగ్య సూత్రాల్లో ఒకటి. వీధిలోంచి వచ్చి కాళ్లు,చేతులు కడుగు కోవాలన్నది ఆరోగ్య సూత్రాలలో భాగం. అయితే, దానికి కూడా ఏదో కారణం చెప్పి, అలాంటి సూచనలు చేసే వారి నోళ్ళు మూయించేందుకు ప్రయత్నిస్తారు. అభ్యుదయం అనేది భావాల్లో ఉండాలే కానీ, శారీరక పరిశుభ్రతను చేటు చేసే విషయాల్లో కాదు. కొవిడ్‌ కాలంలో సామాజిక దూరాన్ని పాటించాలన్న సూచనపై విమర్శలు చేసినవారున్నారు. ఎదుటిమనిషి భుజంపై చేతులు వేయనిదే మాట్లాడలేరా? ఇది కూడా ముఖ్యమైన ప్రశ్నే. అలాగే, పారిశుద్ధ్య ప్రమాణాలను పాటించమనే ప్రభుత్వాలు ప్రభుత్వ కార్యాలయాల్లో, సినిమా థియేటర్లలో తగినన్ని వాష్‌ రూమ్‌లు ఉండేట్టు చర్యలు తీసుకోవడం లేదు. పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేటు కార్యాలయాల్లో ఇదే పద్ధతి ఇలాంటి ఆరోగ్య సూత్రాలు తీసుకోకపోవడం వల్ల కొవిడ్‌ తరహా వేరియం ట్లు త్వరితంగా వ్యాపిస్తున్నాయి. వేరియంట్లు వ్యాపించి నప్పుడే కాదు, మామూలు రోజుల్లో జాగ్రత్తలు పాటించ డం ఆరోగ్యదాయకం.

Advertisement

తాజా వార్తలు

Advertisement