Saturday, November 23, 2024

గుజరాత్‌లో వెూడీ ప్రభంజనం

గుజరాత్‌ అసెంబ్లి ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయం ముమ్మాటికీ ప్రధాని నరేంద్రమోడీ సాధించిన అపూర్వ విజయమే. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా మూడు సార్లు కొనసాగి ఆ రాష్ట్రాభివృద్ధికి బలమైన పునాదులు వేశారు. ప్రజల్లో చెక్కుచెదరని విశ్వాసాన్ని కలిగించారు. ఇప్పుడు సాధించిన విజయానికి సోపానంగా నిలిచింది అదే. మోడీ ప్రవేశపెట్టిన కార్యక్రమాలు, సాధించిన ప్రగతి ప్రజల హృదయాలపై బలమైన ముద్ర వేశాయి. దానినే గుజరాత్‌ మోడల్‌ అని తొలి టరమ్‌లో మోడీ తరచూ ప్రస్తావిస్తూ ఉండేవారు. మోడీ తప్ప అక్కడి బీజేపీ నాయకుల్లో పేరున్న నాయకులెవరూ లేరు. కేంద్ర మంత్రి అమిత్‌ షా ఆయన నాయకత్వంలో అంచలంచె లుగా ఎదిగిన వారే. ప్రచార భారాన్ని వారిద్దరే తలకెత్తు కున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి భూపేష్‌ పటేల్‌ ఏడాది క్రితం రాష్ట్ర నాయకత్వాన్ని చేపట్టారు. రాష్ట్రంలో బలమై న పటేల్‌ సామాజిక వర్గానికి చెందిన భూపేష్‌ మంత్రి పదవిని నిర్వహించకపోయినా ఆయనను మోడీ నేరుగా ముఖ్యమంత్రిని చేశారు. అలాగే, కిందటి ఎన్నికల ముం దు పటేల్‌ ఉద్యమాన్ని నిర్వహించి కాంగ్రెస్‌కి తోడ్పాటు నందించిన హార్దిక్‌ పటేల్‌ను ఈ ఎన్నికల ముందు మోడీ బీజేపీలో చేర్చుకుని అతడికి ప్రాధాన్యం ఇచ్చారు. యువతను ఆకర్షించడం కోసమే హార్థిక్‌ని పార్టీలోకి చేర్చుకున్నారు.

ఈ విషయంలో మోడీ వ్యూహం ఫలిం చింది. ఈసారి యువత అండగా నిలవడం వల్లనే తమ పార్టీ అనూహ్యమైన విజయాన్ని సాధించిందని మోడీ స్వయంగా అంగీకరించారు. గుజరాత్‌లోనే కాక, ఇప్పు డు దేశం యువత నాయకత్వాన్ని కోరుకుంటోందన్న మోడీ వ్యాఖ్యలు అక్షర సత్యాలు. హార్థిక్‌ నడిపిన ఉద్య మంలో ప్రధానపాత్ర వహించిన వారందరికీ బీజేపీ టికెట్లు లభించాయి. అలాగే, క్రికెటర్‌ రవీందర్‌ జడేజా భార్య రువాబాకి చివరి క్షణంలో పార్టీ టికెట్‌ ఇవ్వడం మహిళలనూ, యువతనూ ఆకర్షించడం కోసమే. ఆ వ్యాహం కూడా ఫలించింది. ఈసారి గుజరాత్‌లో పాగా వేసేందుకు ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఆశలు అడియాసల య్యాయి. అయితే, ఓట్ల శాతాన్ని పరిగణనలోకి తీసు కుంటే ఆ పార్టీకి జాతీయ హోదా లభించింది. బీజేపీ వ్యతి రేక ఓట్లను ఆప్‌ బాగా చీల్చడం వల్ల బీజేపీ అనుకోని రీతి లో 156 స్థానాలను సాధించింది.హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం రంగంలో ఉండటం వల్ల సంప్రదాయకంగా కాంగ్రెస్‌కి పడే ఓట్లన్నీ ఎంఐఎంకి పడ్డాయి. బీజేపీ ఓట్ల శాతం ఈసారి బాగా పెర గడానికి అది కూడా ఒక కారణం.ఎన్నికలకు ముందు మోర్బీలో తీగల వంతెన కూలిన దుర్ఘటనలో 130 మందిపైగా మరణించారు.ఆ సంఘటన ప్రభావం ఈ ఎన్నికలపై లేకపోవడం గమనార్హం.

అంతేకాకుండా కచ్‌, సౌరాష్ట్రలలో బీజేపీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఘనవిజయాలను సాధించింది. రాష్ట్రంలో బీజేపీ ఘన విజయానికి మోడీ లేవనెత్తిన భూమి పుత్ర నినాదం బాగా పని చేసింది. జి-20 దేశాల కూటమి సారథ్యం మోడీకి దక్కడాన్ని గుజరాతీయులు తమ విజయంగా పరిగణించారు.కేంద్రం నుంచి గుజరాత్‌కి లక్ష కోట్ల రూపాయిల నిధులు అభివృద్ధి కార్యక్రమాలకు అంద డం కూడా సామాన్యమైన విషయం కాదు. మోడీ హయాంలో అంతర్జాతీయంగా సంపన్నుల జాబితాలో స్థానాలు సంపాదించుకున్న అంబానీ, ఆదానీలు ఇద్దరూ కూడా గుజరాతీలే కావడంతో రాష్ట్రానికి పెట్టుబడులు రావడానికి వారు తమ వంతు సహాయాన్ని అందించా రు. పెట్టుబడిదారులను ప్రోత్సహించాలే తప్ప వారిపై విమర్శలు గుప్పించి రాష్ట్రం నుంచి తరలి పోయేట్టు చేయరాదని మోడీ స్వయంగా పలు సందర్భాల్లో స్పష్టం చేశారు.సూరత్‌ జిల్లాలో తమ పార్టీ అన్ని స్థానాలను ఊడ్చేస్తుందని ఆప్‌ సారథి ,ఢిల్లి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించినప్పటికీ ఒకటి తప్ప మిగిలిన 14 సీట్లను బీజేపీ గెల్చుకుంది.అలాగే, మహాత్మాగాంధీ స్వస్థ లమైన పోర్‌బందర్‌లో పాగా వేయడానికి బీజేపీ సాగిం చిన ప్రయత్నాలు ఫలించలేదు.

- Advertisement -

అక్కడ కాంగ్రెస్‌ తన పట్టును నిలబెట్టుకుంది.ఇక హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లి ఎన్నికల సంగతి తీసుకుంటే, రాష్ట్రానికి మూడు దఫాలు ముఖ్యమంత్రిగా పని చేసి మంచి పేరు సంపాదించుకు న్న సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు వీర్‌భద్ర సింగ్‌ సతీమణి స్వయంగా పార్టీ ప్రచార భారాన్ని స్వీకరించి పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చారు. అక్కడ బీజేపీ, కాంగ్రెస్‌ వంతుల వారీగా అధికారంలోకి రావడం ఆన వాయితీ. ఇప్పుడు కాంగ్రెస్‌ వంతు వచ్చింది.గాంధీ కుటుంబానికి చెందిన వారు ఎవరూ ఈసారి ప్రచారం లో పాల్గొనలేదు. గుజరాత్‌లో వరుసగా ఏడు సార్లు బీజేపీని అధికారంలోకి తేవడం ద్వారా గతంలో పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాలు నెలకొల్పిన రికార్డును మోడీ సమం చేశారు. అలాగే,నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానమంత్రి పదవిని చేపట్టిన జాతీయ నాయకునిగా చరిత్ర లిఖించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement