ఇరవై ఏళ్ళ నాటి గోద్రా అల్లర్లలో భాగమైన బిల్కీస్ బానో అనే యువతిపై అత్యాచారం కేసులో నిందితులు 14 ఏళ్ళ జైలు శిక్షను అనుభవించిన దృష్ట్యా వారికి రెమిషన్ ఇచ్చి విడుదల చేయడాన్ని గుజరాత్ ప్రభుత్వం సమర్థించింది. గోద్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లో రామసేవకులు ఉన్న ఒక బోగీని కొందరు దుండగులు నిప్పంటించి దగ్ధం చేశారు. ఇందుకు ప్రతీకారంగా గుజరాత్‌లో ముఖ్యంగా అహ్మదాబాద్, బరోడాలలో గృహ దహనాలు, హత్యలు, అత్యాచార సంఘటనలు చోటు చేసుకున్నాయి. వాటిల్లో బిల్కీ బానోస్ కేసు ఒకటి. అప్పట్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ ఉండే వారు. ఆయన హయాంలో ఏకపక్షంగా దాడులు జరిగా యన్న ఆరోపణలు వచ్చాయి. ఏళ్ల తరబడి విచారణ అనంతరం కోర్టులు ఆ కేసులను కొట్టి వేశాయి. ఈ కేసుల గురించి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం ఇచ్చిన హక్కుల ఉద్యమ నాయకురాలు తీస్తా సీతల్వాడ్, పోలీసు మాజీ అధికారి శ్రీకుమార్‌లపై కేసు నడుస్తోంది. కాగా, బిల్కీస్ బానోస్ కేసు నిందితులు ఏడుగురిలో ఒకరు మరణించగా, ఆరుగురు 14 ఏళ్ళ జైలు శిక్ష పూర్తి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం రెమిషన్ ఇచ్చి వారిని విడుదల చేసింది. జైలు జీవిత కాలంలో వీరిపై ఎటువంటి ఆరోపణలు రానందున, వీరి సత్ప్రవర్తన కారణంగా చట్ట ప్రకారమే వీరికి రెమిషన్ మం జూరు చేయడం జరిగిం దని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. అయితే, వీరంతా బీజేపీకి చెందిన వారు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అవ్యా జమైన ప్రేమను ప్రదర్శించిందని ప్రత్యర్థులు సుప్రీం కోర్టులో 23 పిటిషన్లను దాఖలు చేశారు. దీనిపై తదుపరి విచారణను నవంబర్ 29వ తేదీకి సర్వోన్నత న్యాయ స్థానం వాయిదా వేసింది.
త్వరలో గుజరాత్ అసెంబ్లికి జరగనున్న ఎన్నికల్లో బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గట్టి పోటీ ఇస్తోంది. గతంలో కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ మూడో స్థానంలోకి నెట్టి వేయబడింది. ఆప్ క్రియాశీలంగా వ్యవహరించడమే కాకుండా, బీజేపీ నాయకులపై పాత కేసులన్నింటినీ తిరగతోడుతోంది. ఆ విధంగా బిల్కీస్ బానో కేసు మళ్ళీ తెరమీదికి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా గుజరాత్ అల్లర్లలో భాగంగా జరిగిన వివిధ సంఘటనలన్నింటిపై విడివిడి విచార ణలను తూతూ మంత్రంగా జరిపించేసి కేసుల నుంచి విముక్తం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ బలం తగ్గిపోవడంతో ఈ కేసుల వ్యవహారాన్ని కోర్టులకు ఈడ్చే పనిని ఆప్ చేపట్టింది. గుల్మార్గ్ సొసైటీ ఇళ్ళపై దాడి కేసును కూడా మోడీ ఆదేశాలపై గుజరాత్ పోలీసులు ఇదే మాదిరిగా నీరుగార్చారన్నది ప్రత్యర్థుల ఆరోపణ. ఈ కేసులో మాజీ ఎంపీ ఇషాన్ జాఫ్రీ నివాసంతో సహా పలువురి ఇళ్ళను దుండగులు కాల్చేశారు. ఈ ఘటనలో పలువురు గాయపడటమో, మరణించడమో జరిగింది. ఆయన భార్య ఈ కేసులో న్యాయపోరాటం జరిపినా ప్రయోజనం లేకపోయింది. ఈ కేసు విచారణను కూడా మోడీ ప్రభావితం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఇవన్నీ ఎవరూ పట్టించుకోకపోయినా, బిల్కీ బానోస్ హత్యాచారం కేసుపై నిందితులు విడుదల కాకుండా చేయాలని ప్రత్యర్థులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. గుజరాత్‌లో ముఖ్యమంత్రి పదవి నుంచి మోడీ దిగిపోయిన తర్వాత సరైన నాయకుడు బీజేపీకి దొరకలేదు.
ఆయన తర్వాత ఆనందిబెన్‌పటేల్ ముఖ్యమంత్రి వ్యవహరించా రు. ఆమె రెండేళ్ళు మాత్రమే పదవిలో ఉన్నారు. ఆ తర్వాత విజయ్ రూపానీ ఐదేళ్ళు పైనే అధికారంలో ఉన్నా 2002అల్లర్ల కేసులను మాఫీ చేయించడంలో విఫలమయ్యారు. మళ్ళీ అసెంబ్లి ఎన్నికలు వస్తున్న తరుణంలోనైనా ఈ కేసుల తాలూకు అవశేషాలు లేకుండా చూసుకునేందుకు తోడ్పడేవారి కోసం మోడీ అన్వేషిస్తున్నారు. అందులో భాగంగానే భూపేష్ పటేల్‌ను ముఖ్య మంత్రిగా నియమించారు. ఆయన వల్ల కూడా తన లక్ష్యం నెరవేరకపోవడంతో ఆనందిబెన్ పటేల్ హయాంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పటేల్ ఉద్యమం నడిపిన హార్థిక్ పటేల్‌కు పార్టీ తీర్థం ఇచ్చారు. కాంగ్రెస్‌లో ఇమడ లేకపోవడంతో అతడికి ఈ మధ్యనే బీజేపీలో చేరారు. గుజరాత్‌లో కాంగ్రెస్‌ని పూర్తిగా నిర్వీర్యం చేయగలిగిన ప్పటికీ ఆప్ ఎదుగుదలను బీజేపీ నాయకులు ఆపలేక పోయారు. అందుకే, గుజరాత్ అసెంబ్లికి వచ్చే నెల 12న జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడేలా ఎన్నికల సంఘా న్ని ప్రభావితం చేశారన్న ప్రచారం ఉంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌ల అసెంబ్లి ఎన్నికలను ఒకేసారి జరిపి స్తారన్న వార్తలు మొదట వచ్చినప్పటికీ, ప్రస్తుతానికి హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలను మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు. దీని వెనుక గుజరాత్ పరిణామాల ప్రభా వం ఉండవచ్చనని పరిశీలకుల భావన. ఎన్నికలు ఇప్పు డు జరపకపోవడానికి అదే కారణం కావచ్చు.