Tuesday, November 19, 2024

ప్రజలు ఎదురు తిరిగితే అంతే!

ప్రజల భాగస్వామ్యం లేనిదే ఏ పథకమూ, లేదా కార్యక్రమం విజయవంతం కాదని మరోసారి రుజువైంది. చైనాను కోవిడ్‌ రహిత దేశంగా చేయాలని దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌ ప్రవేశపెట్టిన జీరో కోవిడ్‌ కార్యక్రమం బెడిసి కొట్టింది. ప్రజల్లో ఆగ్రహజ్వాలలను రేపింది. దేశాధ్యక్షు నిగాజిన్‌పింగ్‌ మూుడోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన రోజునే దేశంలోని ప్రధాన నగరాల్లో అయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజలు పెద్ద ఎత్తున ప్రదర్శనలు జేశారు. అయినప్పటికీ ప్రభుత్వం జీరో కోవిడ్‌ విధానాన్ని అనుసరించి తీరవల్సిందేనంటూ ప్రకటనలు చేసింది. కోవిడ్‌ రోగ లక్షణాలు లేకపోయినా లక్షలాది మందికి టెస్ట్‌లు నిర్వహించడం, క్వారంటైన్‌ కేంద్రాలకు పంపడం, స్కూళ్ళు, ఆఫీసులకు సెలవు ప్రకటించడం, ఉద్యోగులు ఇళ్ళ నుంచే వర్క్‌ ఫ్రమ్‌ హోం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడంతో దేశంలో కోట్లాది మంది ప్రభుత్వానికి ఎదురు తిరిగారు. ప్రభుత్వ వ్యతిరేకతను చైనాలో ఉక్కు పాదంతో అణచి వేస్తుంటారు. ఈసారి కూడా అలాంటి బలప్రయోగాలకు ప్రభుత్వం పాల్పడింది. అయినా జనం లొంగలేదు సరికదా, మరింత తీవ్ర స్థాయిలో విజృంభించారు. యూనివర్శిటీల్లో కూడా విద్యార్ధులు ఆందోళన ప్రారంభించారు. దాంతో హాస్టళ్ళు ఖాళీ చేయించి విద్యార్ధులను ఇళ్లకు పంపివేశారు. రాజధాని నగరం బీజింగ్‌,షాంఘై,తదితర నగరాల్లో విద్యార్ధులు సైతం ఉద్యమంలో పాల్గొన్నారు.చైనాలో జరుగుతున్న జీరో కోవిడ్‌ వ్యతిరేక ఆందోళనలు ఎమర్జెన్సీ సమయం లో బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిపించడానికి వ్యతిరేకంగా జరిగిన ఆందొళనలను తలపింపజేశాయని మన దేశంలో పాత తరం వారు పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ రెండవ కుమారుడు సంజయ్‌ గాంధీ అత్యుత్సాహాన్ని ప్రదర్శించి కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలకు భారీ లక్ష్యాలను నిర్దేశించారు.తాను ప్రత్యక్షం గా రంగంలోకి దిగి ఢిల్లిdలోని ఆస్పత్రులలో ప్రత్యేక శిబిరాల నిర్వహణను పర్యవేక్షించారు. అప్పట్లో పెళ్ళి కాని వారికీ, వయోవృద్దులకు ఆపరేషన్లు చేయించారం టూ వ్యంగ్యంగా వార్తలు, వ్యంగ్య చిత్రాలూ వచ్చేవి. కుటుంబ నియంత్రణకు వ్యతిరేకంగా దేశంలో కొన్ని వర్గాలు ఆందోళనను వ్యక్తం చేయడంతో చివరికి ఆ కార్యక్రమం లక్ష్యాలను చేరుకోకుండానే నిలిపివేయాల్సి వచ్చింది. సరిగ్గా ఇప్పుడు చైనాలో కూడా అలాంటి పరిస్థితే నెలకొంది. జీరో కోవిడ్‌ పరీక్షలకు బలవంతంగా జనాన్ని లాక్కుని రావడం,ఎదురు తిరిగిన వారిపై లాఠీ చార్జి చేయడం వంటి బలవంతపు చర్యలకు పాల్పడటం వల్ల ప్రజలు మరింత రెచ్చిపోయారు. గ్జిన్‌జియాంగ్‌లో ని ఉరుంఖీలో ఒక అపార్టుమెంట్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల 10 మందిసజీవ దహనమైన సంఘటనతో దేశంలో జీరో కోవిడ్‌ ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌ రాజీనామా చేయాలన్న డిమాం డ్‌తో వేలాదిమంది వీధుల్లోకి వచ్చి ఆందోళనలు సాగిం చారు. ఆనాటి తియానమన్‌ స్క్వేర్‌ ఆందోళనల స్థాయి లో జీరో కోవిడ్‌ ఆందోళనలు సాగినట్టు మీడియాలో కథ నాలు వెలువడ్డాయి. సాధారణంగా చాలా దృఢంగా, స్థిర నిర్ణయంతో ఉండే జిన్‌పింగ్‌ ని ఈ ఆందోళనలు కది లించాయి. సరిగ్గా ఇదే సమయంలో గత వారం మాజీ అధ్యక్షుడు జియాంగ్‌ జెమిన్‌ మరణించడంతో జిన్‌పిం గ్‌ పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది.ఆయన సంపా దించుకున్న ప్రతిష్ఠ అంతా మసకబారి పోవడంతో ఆయ న ఆలోచనలో పడ్డారు. గువాంగ్‌ ఝవా ప్రావిన్స్‌లో పోలీసులూ, ఆందోళనకారుల మధ్య ఘర్షణలు జరగ డంతో ప్రభుత్వం వెంటనే తన విధానాన్ని తిరగతోడేం దుకు చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ప్రజల్లో ఇంత వ్యతిరేకత వస్తుందని జిన్‌పింగ్‌ ఊహించలేదు. తాను కష్టపడి నిర్మించుకున్న సౌధం తన కళ్ళ ముందే కూలిపోతుందేమోనన్న భయం ఆయనలో కలిగింది. పదకొండు జిల్లాల్లో ఆంక్షలను ఎత్తివేసిన అధికారులు క్వారంటైన్లలో ఉన్న వారిని ఇళ్ళకు వెళ్ళేందుకు అనుమ తి ఇచ్చారు. ఆఖరుకు బీజింగ్‌లో కరోనా వైరస్‌ లక్షణాలు కనిపించిన వారిని ఇళ్ళల్లోనే ఉంటూ చికిత్స తీసుకోవా లని ఆదేశించింది. కఠినమైన నిబంధనలను ఎత్తివేయా లని ప్రభుత్వం నిర్ణయించుకుందని విశ్లేషకులు పేర్కొ న్నారు. అంతేకాక, ద్రవ్యోల్బణం చైనాను వణికిస్తోంది. గతంలో మాదిరిగా ఆర్థికపరమైన అంశాలపై చైనా చొర వ చేసి నిర్ణయాలు తీసుకోలేకపోతోంది. దీనికి తోడు జీరో కోవిడ్‌ ఆందోళనలు దేశాన్ని వణికించాయి. నాలుగు దశాబ్దాల క్రితం భారత్‌లో బలవంతపు కుటుంబ నియం త్రణ శస్త్ర చికిత్సల వల్ల కాంగ్రెస్‌ పార్టీకి ఒక వర్గం వారు దూరం అయిన కారణంగానే ఆ విషయమై అప్పటి ప్రభు త్వం వెనక్కి తగ్గింది. ప్రజలపై బలవంతంగా రుద్దేందు కు ప్రభుత్వాలు ప్రయత్నించిన సందర్భాల్లో ఇదే మాదిరి ప్రతిఘటన ఎదురవుతోంది. ఇది భారతదేశంలోనైనా.. చైనాలో అయినా… మరెక్కడైనా.. సహజాతి సహజమైన ప్రతిక్రియ!

Advertisement

తాజా వార్తలు

Advertisement