బ్రిటిష్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ మంగళవారం మధ్యాహ్నం పదవీ ప్రమాణ స్వీకారం చేయడం బ్రిటన్- భారత దేశాల చరిత్రలో సువ ర్ణాధ్యాయం. బ్రిటన్‌లో మూడు తరాల క్రితం స్థిరపడిన పంజాబీ కుటుంబానికి చెందిన సునాక్ స్టాన్‌ఫోర్డ్ యూని వర్శిటీలో పట్టా తీసుకున్న తర్వాత కొంతకాలం అధ్యాపకునిగా పనిచేసి, ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. కన్సర్వేటివ్ పార్టీలో చేరి అంచలంచెలు గా ఎదిగారు. ఆయన పూర్వీకులు అవిభక్త పంజాబ్‌లోని గుజ్రాన్‌వాలాకి చెందినవారు.
ప్రస్తుతం అది పాకిస్తాన్ లో ఉంది. గుజ్రాన్‌వాలా మహారాజా రంజిత్‌సింగ్ స్వస్థలం. అయితే, మూడు తరాల క్రితమే సునాక్ తాత ఆఫ్రికాకు తరలి వెళ్ళిపోయారు. అక్కడ భారత వ్యతిరే కతను తట్టుకోలేక బ్రిటన్‌కి తరలి వెళ్ళారు. రుషి సునాక్ బ్రిటన్‌లోనే పుట్టారు. సునాక్‌ది జాతీయ భావాల కుటుం బం. ఏ దేశంలో ఉంటే ఆ దేశం అభ్యున్నతికి కృషి చేసిన కుటుంబం. అందుకే, సునాక్ పట్ల బ్రిటన్లకు గౌరవం పెరిగింది. ఆయన చదువుకునే రోజుల్లోనే రెస్టారెంట్‌లో పనిచేసినట్టు బాహాటంగానే చెప్పుకున్నారు.
సొంత ఖర్చుల కోసం ఇంట్లో వారిని అడగకుండా తాను ఆ ఉద్యోగం చేసినట్టు ఆయన ఒక ఇంటర్వ్యూలో భోళాగా చెప్పారు. ఆర్థిక విషయాల్లో ఆయనకు చిన్నప్పటి నుంచి సమగ్రమైన అవగాహన ఉందనడానికి ఇది నిదర్శనం. తన వివాహం విషయంలో కూడా అంత పొదుపును ఆయన పాటించారు. కేవలం 500 మందితోనే వివాహం జరిపించాలని షరతు పెట్టారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ లో చదువుకునే రోజుల్లో ఇన్‌ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణ మూర్తి, ప్రముఖ సామాజిక సేవకు రాలు సుధామూర్తిల కుమార్తె అక్షతా మూర్తిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు.
రిషిని మొదట వ్యతిరేకించిన నారాయణమూర్తి ఆర్థిక వ్యవహారాల్లో ఆయన తీరును గుర్తించి అంగీకరించారు. కంపెనీ వ్యవహారాలను చక్క దిద్దగలిగిన వాడు భవిష్యత్‌లో దేశ ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దగలడని ఆ రోజే నారాయణ మూర్తి భావించి ఉంటారు. ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. తీవ్ర సంక్షో భంలో కూరుకుని పోయిన బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను గాడి లో పెట్టే బాధ్యత ఆయనపై పడింది. బ్రిటన్ ప్రధానమం త్రి పదవి అంటే ఇప్పుడు ముళ్ళ కిరీటం. ఆ పదవిలో నిలదొక్కుకోలేకే ప్రమాణ స్వీకారం చేసిన 45 రోజుల్లో లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. ఆ తర్వాత ప్రధానమంత్రి రేసులో నిలిచిన పెనీ మోర్డౌంట్ విరమించుకోవడంతో రిషి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇది నిజంగా ఒక రికార్డు.
ముఖ్యంగా బ్రిటనేతర వ్యక్తికి దక్కిన అపూర్వ గౌరవం. 357 మందిపైగా ఉన్న ఎంపీల్లో సగం మందికి పైగా మద్దత ఆయనకుు లభించడం అందరినీ ఆశ్చర్య పర్చింది. ఈ పదవికి పోటీ చేసి ఓడినప్పుడు ఆయన ఏ మాత్రం నిస్పృహ చెందకుండా, తన ప్రత్యర్థిపై ఎటు వంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయకుండా, సౌమనస్యాన్ని ప్రదర్శించడం అందరినీ ఆకర్షించింది. లిజ్ ట్రస్ ప్రధాని గా ప్రమాణం చేసిన కొద్ది రోజులకే ఆమెపట్ల వ్యతిరేక భావం ఏర్పడింది. సునాక్‌ని ఎన్నుకుని ఉంటే బాగుండే దన్న అభిప్రాయం చాలామందిలో వ్యక్తమైంది. బ్రిటిష్ రాజును కలుసుకున్న తర్వాత ప్రధానిగా ప్రమాణం చేసిన సునాక్ తన తొలి ప్రసంగంలో దేశ ప్రజలను ద్దేశించి సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధపడే ఈ పదవిని చేపడుతున్నానని అన్నారు.
బ్రిటన్ ఆర్థిక పరిస్థితి దిగజా రడాని కి ఏ ఒక్కరినో వేలెత్తి చూపలేం. పదెెళ్ళ క్రితం ఆనాటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ బ్రిటన్‌ని బలవం తంగా సంకీర్ణ సేనలో చేర్చారు. దానివల్ల బ్రిటన్ సైనికం గానూ, ఆర్థికంగానూ చాలా నష్టపోయింది. ఐరోపా సమాఖ్య నుంచి వైదొలగడం వల్ల పెద్ద కంపెనీలన్నీ బ్రిటన్ నుంచి ఉపసంహరించుకున్నాయి. ఇప్పుడు కూడా ఉక్రెయిన్ పై రష్యా దాడి విషయంలో అమెరికా ఒత్తిడి కారణంగా బ్రిటన్ కూడా ఉక్రెయిన్‌ని సమర్ధి స్తున్నది. బ్రిటన్‌లో నీరు, విద్యుత్‌లకు కొరత ఏర్పడ టంతో చాలా కంపెనీలు ఇతర దేశాలకు తరలిపో యా యి. ద్రవ్యోల్బణం నాలుగు దశాబ్దాల గరిష్ఠానికి చేరుకుం ది. మరోవైపు దేశంలో ఉద్యోగాల కొరత ఏర్పడింది.
దాంతో దేశం నుంచి పలువురు ఇతర దేశాలకు ఉద్యోగార్థులై వెళ్ళిపోతున్నా రు. గతంలో ఉద్యోగాల కోసం వచ్చిన వారికి బ్రిటన్‌లో తగిన ఆదరణ లభిం చలేదు. ఇప్పుడు అదే పరిస్థితి బిటన్‌లకు ఎదురవు తోంది. కరోనా సమయంలో నియం త్రణలను పాటించ డానికి బదులు అప్పటి ప్రధాని బోరిస్ జాన్సన్ విందు లు, పార్టీలు ఏర్పాటు చేయడం వల్ల ఆర్థిక భారం పెరగ డమే కాకుండా ఆయన ప్రతిష్ట దెబ్బతింది. పదవి నుంచి ఆయన వైదొలగవల్సి రావడా నికి ప్రధాన కారణం అదే. బ్రిటన్‌కి పెట్టుబడులను తీసు కుని రావడం సునాక్‌కి పెద్ద సవాల్. తన ప్రావీణ్యాన్ని ఉపయోగించి దేశాన్ని గాడిలో పెట్టే ప్రధాన బాధ్యత సునాక్‌పై ఉంది.