ఆశ్చర్యమేమిటంటే అంగారక గ్రహంపై కాలు మోపేందుకు పోటీ రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకు అగ్రదేశాలు ఆ గ్రహంపై పరిశోధనలకు, అధ్యయనాల కు ఉబలాట పడుతూండగా, ఇప్పుడు అనే క ప్రైవేట్ సంస్థలు అంగారకునిపై అడుగు పెట్టేందుకు తీవ్రంగా పోటీ పడుతున్నా యి. ఈ అనూహ్యమైన పోటీలో అమెజాన్ సీఈఓ, ప్రముఖ వ్యాపారవేత్త జెఫ్ బెజోస్ దూసుకుపోతున్నా డు. స్పేస్ ఎక్స్‌కు గట్టి ప్రత్యర్థిగా రంగంలో నిలిచాడు. ఆ క్రమంలో స్పేస్ ఎక్స్ సిఈఓ, ప్రముఖ వ్యాపారవేత్త ఇలాన్ మస్క్, జెఫ్ బెజోస్ మధ్య ‘వైరం’ ఏర్పడింది. స్పర్థ పెరిగింది. దాంతో అంతరిక్ష ప్రయాణరంగ ప్రయత్నం రసవత్తరంగా మారింది. ‘బ్లూ ఆరిజిన్’ సంస్థ ఆధ్వర్యంలో బెజోస్ అంతరిక్షంలోకి అడుగు పెడుతున్నారు. వైరం, స్పర్థ కారణంగా ఈ రంగంలో కొత్త ఆలోచనలు వెలుగు చూస్తున్నాయి. బెజోస్ ఆలోచనల ప్రకారం మార్స్ పై పాదం మోపేముందు చందమామపై స్థావరం ఏర్పరచుకోవాలి. దాన్నొక ‘లాంచ్ ప్యాడ్’గా ఉపయోగించుకోవాలి. అలాగాక నేరుగా మార్స్ పైకి వెళ్ళాలనుకోవడం భ్రాంతి, భ్రమ కలిగించే అంశమని ఆయన గట్టిగా విశ్వసిస్తున్నారు. నేరుగా అంగారకుడి పైకి వెళ్ళడమంటే మధ్యనున్న మెట్లను పట్టించుకోకపోవడమే అవుతుంది. ఒకవేళ అంగారకుడి పైకి భారీ సామగ్రి తీసుకెళ్లాలంటే భూమిపై నుంచి నేరుగా మార్స్ పైకి కాకుండా చంద్రు డిపై నుంచి తీసుకెళితే సులువుగా ఉంటుందని ఆయన వాదన. ముందు చంద్రుడిపై అవసరమైన గిడ్డంగులు, తదితరాలు ఏర్పాటు చేసుకుంటే, మార్స్ పై కనే కాలనీల ‘కల’ భవ్యంగా ఉంటుందనేది ఆయన దృష్టికోణం. అందుకే ఆయన తన సంస్థ నుంచి చందమామపై ల్యాండర్ ను దింపే పనుల్లో ఉన్నారు. ‘స్పేస్ ఎక్స్’ అధినేత మాత్రం నేరుగా మార్స్ పైకి వెళ్ళడంలో నష్టమేమీ లేదని అంటున్నారు. వయా చందమామగా మార్స్ ప్రయాణం గూర్చిన ఆలోచ నను ఆయన ఎద్దేవా చేస్తున్నారు. దాంతో జెఫ్ బెజోస్, ఇలాన్ మస్క్‌ల మధ్య వృత్తిపరమైన వైరం క్రమంగా పెరిగింది.. ఇంకా పెరుగుతోంది. బెజోస్ చంద మామపైకి మానవ కాలనీల ఏర్పాటు కోసం కష్టపడు తూండగా, ఇలాన్ మస్క్ మాత్రం ఏకంగా మార్స్ పై మానవుల కోసం కాలనీలు ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యాడు. మానవాళి భవిష్యత్ కోసం, మానవ సరిహద్దుల్ని విస్తరించడం కోసం భిన్న దృ క్కోణాలతో ఈ ఇద్దరు బిలియనీర్లు అహూరాత్రులు శ్రమిస్తున్నారు. ఇప్పుడు అంతరిక్ష పర్యాటకం, ఇతర గ్రహాల్లో నివాసం, అక్కడ ఏముందో తెలుసుకోవాల న్న జిజ్ఞాస, అధ్యయనాలు, పరిశోధనలు చేసేందుకు ఉత్సుకత పెరుగుతోంది. ఈ తరం ప్రారంభించిన ఈ ‘రహదారి’ పై వచ్చే తరాలు మరిన్ని అద్భుతాలు సృష్టి స్తాయన్న ప్రగాఢ విశ్వాసంతో అడుగులు వేస్తున్నారు. ఏవైనా గ్రహ శకలాలు (స్కైలాబ్ లాంటి ఆస్ట్రాయిడ్స్) భూగ్రహాన్ని తాకి మానవాళి అంతమవకుండా ఉండాలంటే బ్యాకప్ లా భూమి ఉన్నా, ఇతర గ్రహాల లో మనిషి మనుగడ ముఖ్యమని, మానవ నాగరికత ఎట్టి పరిస్థితుల్లో అంతరించిపోరాదని ఈ రంగంలో ఉన్నవారు భావిస్తున్నారు. ఈ ఒక్క అంశం చాలా మందిని ఆకర్షిస్తోంది, కదిలిస్తోంది, ముందుకు తరుముతోంది. అంతరిక్షంలో మానవాళి భవిష్యత్తు పై బెజోస్ కన్నా ఇలాన్ మస్క్‌కు ఎక్కువ స్పష్టత ఉన్న ట్టు కనిపిస్తోంది. ఆయన భారీ ఆలోచనలను ఆచరణ లోకి తీసుకొచ్చి విజయం సాధిస్తున్నాడు. నేరుగా మార్స్ పైకి ‘కార్గో’ సర్వీసులను మరో నాలుగేళ్లలో ప్రారంభించబోతున్నట్లు, ఆ తర్వాత మనుషులను తీసుకెళ్లనున్నట్టు, 2030 సంవత్సరం నాటికి మార్స్ పై ‘నగరం’ ఏర్పడుతుందని ఇలాన్ మస్క్ హామీ ఇస్తున్నాడు. జెఫ్ బెజోస్ మాత్రం తన వ్యూహం, ఎత్తు గడల ప్రకారం తన బ్లూ ఆరిజిన్ ద్వారా చందమామ పై దింపేందుకు గత మే నెలలో ల్యాండర్ను సిద్ధం చేశారు. పునర్వినియోగ రాకెట్లను రూపొందిస్తున్నా రు. ఇలాన్ మస్క్ కన్నా ముందే చందమామపై కాలనీ లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అక్క డ స్థిరపడ్డాక అంగారక గ్రహంపైకి ప్రయాణం ప్రారం భిస్తామంటున్నారు. ఆ రకంగా ఇప్పుడు స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్ మధ్య అంతరిక్ష పరుగుపందెం మొద లైంది. వీరిద్దరి మధ్య పోటీని తాబేలు-కుందేలు మధ్య పరుగు పందెం లాంటిదని చాలామంది వ్యా ఖ్యానిస్తున్నారు. ఇద్దరు కుబేరులు మిలియన్ల కొద్దీ డాలర్లు తమ తమ ప్రాజెక్టులపై ఖర్చు చేస్తున్నారు. ఈ రంగంలో ప్రతిభ గల వారిని పోటీపడి ఆకర్షిస్తున్నా రు. దాంతో మరింత వైరం.. వివాదం.. స్పర్థ పెరుగు తూనే ఉంది. మార్స్‌పై మానవ నాగరికత పరిఢవిల్లు తుందని తమ తమ దృష్టికోణాలతో వీరు విశ్వసిస్తు న్నారు. వాస్తవానికి జెఫ్ బెజోస్ అంతరిక్షంపై అపార మైన ఆసక్తి, అనురాగంతో 2000 సంవత్సరంలోనే ‘బ్లూ ఆరిజిన్’ అన్న సంస్థను స్థాపించారు. ఇలాన్ మస్క్ తన చిన్ననాటి కలను సాకారం చేసుకునేందు కు 2002 సంవత్సరంలో ‘స్పేస్ ఎక్స్’ను స్థాపించారు. 2004 సంవత్సరంలో ఈ రెండు సంస్థలు అంకుర దశలో ఉండగానే పోటీతత్వం.. వైరం ఆరంభమైం ది. అది అంతరిక్ష అభివృద్ధికి, విస్తరణకు, సరికొత్త ప్రయోగాలకు ఊపిరులూదింది.
రాకెట్ల పునర్వినియోగ టెక్నాలజీ గూర్చి, ఇతర సంబంధిత అంశాల గూర్చి ఈ ఇద్దరు బిలియనీర్లు ఓసారి చర్చలకు కూర్చున్నా ఇద్దరి మధ్య పొసగ లేదు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనకపోయినా వైమనస్యం, విముఖత పెరగసాగింది. 2013 సంవత్సరంలో నాసాకు చెందిన లాంచ్ ప్యాడ్ వినియోగ విషయమై ఇద్దరూ పోటీపడ్డారు. ఆ సమయంలో స్పేస్ ఎక్స్ ను అడ్డుకోవడానికి బ్లూ ఆరిజిన్ ‘నాసా’కు లేఖ రాసింది. దాంతో ఇద్దరు బిలియనీర్ల మధ్య, రెండు సంస్థల మధ్య అగాథం మరింత పెరిగింది. ఈ విషయంలో స్పేస్ ఎక్స్ విజయం సాధించి ఓ అడుగు ముందుకే సింది. అది స్పేస్ ఎక్స్ కు నిజమైన లాంచ్ ప్యాడ్ లా ఉపకరించింది. ఆ మరుసటి సంవత్సరం బ్లూ ఆరిజి న్ డ్రోన్ షిప్స్ పేటెంట్ విషయంలో మళ్లి వివాదం చెలరేగింది. ఇక్కడ కూడా స్పేస్ ఎక్స్ గెలిచింది. ఈ సంఘటన అనంతరం ఇక అంతా ఉప్పు-నిప్పు వ్యవ హారమే! ఎద్దేవా, విరోధ భావం, ఎకసెక్కాలు, ట్విట్టర్ల యుద్ధం కొందరికి వినోదం పంచింది. సౌరమండల పరిశోధనలకు, అన్వేషణలకు మాత్రం నెగళ్లను ఎగదోసినట్టయింది. గత దశాబ్దంన్నర కాలంగా విరోధి తత్వంతోనే బెజోస్ చంద్రుడిపై కాలనీల నిర్మా ణం, ఇలాన్ మస్క్ మార్స్ పై కాలనీల నిర్మాణం కోసం తపన పడుతున్నారు.. జెఫ్ బెజోస్ 1964 జనవరి 12న మెక్సికోలో జన్మించాడు. బాల్యం నుంచే కంప్యూటర్‌ను ప్రేమిస్తూ పెరిగాడు. తన ఇంటి గ్యారేజిని ఓ పరిశోధన శాలగా మార్చుకున్నాడు. ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రిక్ట్రికల్ ఇంజనీర్ పట్టా అందుకున్నారు. ఆన్‌లైన్‌లో పుస్తకాలు విక్రయించేందుకు ‘అమెజాన్’ ను ప్రారంభించాడు. ఇది ఎవరూ ఊ#హం చని విజ యం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో తన బాల్యంలో ఆకాశంలోని తారలను, ‘చంద మామ’ను చూసి కన్న ఎన్నో కలలను సాకారం చేసుకు నేందుకు 2000 సంవత్సరంలో ‘బ్లూ ఆరిజిన్’ సంస్థను స్థాపించారు. ఇక ఇలాన్ మస్క్ 28 జూన్, 1971లో దక్షిణాఫ్రికాలో జన్మించి, తల్లితోపాటు కెనడాకు వచ్చి, పెన్సిల్వేని యాలో భౌతిక శాస్త్రం, ఆర్థి కశాస్త్రంలో పట్టా సంపాదించి, చిన్న చిన్న ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేసి, 2002లో ‘స్పేస్ ఎక్స్’ ను స్థాపించారు. ఇలాన్ మస్క్ కన్నా జెఫ్ బెజోస్ ఏడేళ్లు పెద్ద. అయినా సమ ఉజ్జీలుగా తలపడుతూ అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిం చారు. వారి మధ్య వైరం లోకకల్యాణం కోసమే అన్నది యదార్థం .
వారి వైరం రాకెట్‌కు ఇంధనం
Advertisement
తాజా వార్తలు
Advertisement