మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా మూడు దశాబ్దాలుగా జైలులో మగ్గుతున్న ఆరుగురి విడుదలకు మార్గాన్ని సుగమం చేయడం ద్వారా ఆయన సతీమణ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పెద్ద మనసు చాటుకున్నారు. భారతీయ సంస్కృతీ వారసత్వమైన క్షమాగుణాన్ని ఆమె ప్రదర్శించారు. రాజీవ్ హత్య ఆనాడు పెను సంచలనాన్ని సృష్టించింది. రాజకీయ, ఆర్థిక రంగాల్లో మార్పులకు కారణం అయింది. తమిళనాడు శ్రీపెరంబదూర్‌లో ఎన్నికల ప్రచార సభలో తమిళ ఈలం తీవ్రవాది, ఆత్మాహుతి దళం సభ్యురాలు థాను అనే మానవ బాంబుదాడిలో రాజీవ్ మరణించి 31 సంవత్సరాలైంది. ఈ కేసులో ఏడుగురిని దోషులుగా నిర్ధారించిన ఉగ్రవాద వ్యతిరేక కోర్టు 1998 లో మరణశిక్ష విధించింది. వీరిలో పేరారివలన్, మురుగున్, నళిని, శాంతన్‌లకు మరణశిక్షను జీవిత ఖైదుగా ఆ మరుసటి సంవత్సరమే మార్చింది. 2014లో పెరారివలన్, శాంతన్, మురుగన్‌లకు జీవితఖైదుగా మార్చారు. రాజీవ్ సతీమణి, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జోక్యంతో 2000లో నళిని మరణశిక్షను కూడా జీవిత ఖైదుగా మార్చారు. ఆ తర్వాత మిగిలిన ముగ్గురికి మరణశిక్షను యావజ్జీవ ఖైదుగా మార్చారు. ఈ కేసులో 30 ఏళ్ళ జైలు శిక్ష అనుభవించిన వారిని శుక్రవారం సుప్రీంకోర్టు విడుదల చేసింది. ముత్తం మీద ఈ కేసులో ముద్దాయిలంతా విడుదలైనట్టే. రాజీవ్ హత్యతో దేశ రాజకీయాలు మలుపు తిరిగాయి.
ఆయన స్థానే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకత్వాన్ని స్వీకరించేందుకు సోనియా తిరస్కరించడంతో రాజకీయాల నుంచి శాశ్వ తంగా నిష్క్రమించి హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుం దామనుకుంటున్న రాజకీయ దురంధరుడు, సీనియర్ నాయకుడు పీవీ నరసింహారావు భుజస్కంధాలపై దేశా నికి నాయకత్వం వహించే భారం పడింది. పార్టీ అధ్యక్ష పదవినీ,ప్రధాని పదవినీ పీవీ నిర్వహించి తన సమర్ధత ను రుజువు చేసుకున్నారు.ఆర్థిక సంస్కరణల అమలుతో దేశానికి ఉత్తమమైన దశ, దిశ ఇచ్చారు. ఇందిరాగాంధీ హత్యకు గురైనప్పుడు రాజీవ్ ప్రధాని పగ్గాలనూ, పార్టీ అధ్యక్ష పదవినీ నిర్వహించారు. రాజీవ్ హత్యతో దేశం గొప్ప విజన్ ఉన్న నాయకుణ్ణి కోల్పోయింది. ఇప్పుడు ప్రభుత్వాల ను నడపడంలోనే కాదు, పార్టీలనూ,ప్రైవేటు సంస్థలను నడపడంలో ప్రాణాధారంగా రూపుదిద్దు కున్న కంప్యూటర్ టెక్నాలజీని ప్రవేశపెట్టింది ఆయనే. ఆ రోజుల్లో ఆయననూ, ఆయన మిత్రులనూ కంప్యూటర్ బాయస్ అని ఎద్దేవా చేసిన వారే ఇప్పుడు కంప్యూటర్ పైనే పూర్తిగా ఆధారపడుతున్నారు. ఆయన ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వీచికలకు గవాక్షాలను తెరిచారు. పార్టీ నాయకులు, ప్రజలు నెహ్రూ కుటుంబ వారసులే ఆ పదవులను చేపట్టాలని పార్టీలో అందరూ పట్టుపట్టారు.
ఆ సమయంలో పీవీ కాంగ్రెస్‌కూ, దేశానికి పెద్ద దిక్కు అయ్యారు. సోనియాగాంధీ తన భర్త హంతకుల మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చాలని సిఫార్సు చేశారు. ఇందిరాగాంధీ, రాహుల్ ప్రధానమంత్రి పదవిని నిర్వ హించినప్పుడు సోనియా ఇంటికే పరిమితమైనా, ఆనాటి రాజకీయాలను గురించి తెలుసుకునేవారు పార్టీ నీ, ప్రభుత్వాన్నీ నడిపించడంలో పీవీకి సలహాలిచ్చే వారు. అయితే, వారిద్దరి మధ్య అగాధాన్ని పెంచడానికి పార్టీలో సీనియర్లే కాకుండా, కొంత మంది భజనపరులు ప్రయత్నించారు. ఆ సమయంలో పీవీ ప్రదర్శించిన సంయమనం అసమానం, అపూర్వం. పీవీ ప్రధాని పదవిని చేపట్టడం ఒక చారిత్రక ఘటన. దేశ భవిష్యత్‌ను మలుపు తిప్పిన పీవీ సంస్కరణలు ఇప్పటికీ ఆర్థికాభి వృద్ధి సౌధానికి పునాదులుగా ఉన్నాయి. ఇక రాజీవ్ హంతకుల విషయానికి వస్తే, వారు లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్‌టిటిఇ) టైగర్లుగా పిలవబడినప్ప టికీ వారందరూ తమిళనాడులో ద్రవిడ పార్టీలకు సన్నిహితులే. అందువల్ల రాజీవ్ హంతకులను విడిపిస్తామన్న వాగ్దానంతో ద్రవిడ పార్టీలు అధికారంలోకి వచ్చేవి. వారి విడుదల కోసం డిఎంకె మాజీ అధ్యక్షుడు కరుణానిధి, ప్రస్తుత అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కృషి చేశారు.
ఈ కేసులో దోషులు కాలపరిమితికి మించి జైలు శిక్ష అనుభవించారు కనుక విడుదల చేయా లన్న డిమాండ్ తమిళనాడులో ప్రతి ఎన్నికల ముందు తెరమీదికి వచ్చేది. ఈ కేసులో దోషి అయిన పెరారివలన్ ని సుప్రీంకోర్టు గత మే నెలలో అసాధారణ నిర్ణయంగా విడుదల చేయాలని ఆదేశించింది. ఆనాటి నుంచి మిగిలి న వారిని కూడా విడుదల చేయాలన్న డిమాండ్ పలు వర్గాల నుంచి వస్తూనే ఉంది. పెరారివలన్ విడుదలకు సుప్రీంకోర్టు ఏర్పరిచిన మార్గంలోనే ఇప్పుడు మిగిలిన దోషుల విడదలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజీవ్ హంతకుల విడుదలను సోనియా అంగీకరిం చినా, అది ఆమె వ్యక్తిగత నిర్ణయమని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేష్ ప్రకటించారు.