బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారతీయ సంప్రదాయాల పట్ల ఎక్కువ మక్కువను ప్రదర్శిస్తూ ఉంటారు. ఆమె ఆహార్యంలో, పలుకుల్లో భారతీయత ఉట్టి పడు తూ ఉంటుంది. బెంగాలీ సంప్రదాయాన్ని మన కన్నా ఎక్కువగా పరిరక్షిస్తున్న మహిళ ఆమె. అందుకే, ఆమె మన దేశంలో పర్యటించినప్పుడల్లా ఇక్కడి బెంగాలీ మహిళలు, యువతులు నీరాజనాలు అందిస్తూ ఉంటా రు. నాలుగు రోజుల ప్రస్తుత పర్యటనలో ఆమె పెద్ద అజెండాతోనే వచ్చారు. భారత్- బంగ్లాల మధ్య దూరం పెంచాలని చైనా ఎంత ప్రయత్నించినా దృఢమైన ఆమె వైఖరి కారణంగా అది ఫలించలేదు. బంగ్లాదేశ్ రాజకీ యాల్లో ఆమె ప్రత్యర్థి అయిన బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బీఎన్పీ) అధినేత్రి బేగం ఖలీదా చైనాకూ,మయన్మార్‌కీ దగ్గరయి మనదేశాన్ని ఇబ్బందులపాలు చేసిన సందర్భా లు ఎన్నో ఉన్నాయి. ఈశాన్య ప్రాంత తీవ్రవాదులకు బేగంఖలీదా తన హయాంలో ఆశ్రయం కల్పించి అసోం, బోడోలాండ్, తదితర ఈశాన్య రాష్ట్రాల్లో అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నించారు.
బంగ్లా ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా అందుకు భిన్నంగా మన దేశంతో మైత్రి వల్లనే తమ దేశానికి ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయ ని గట్టిగా విశ్వసిస్తున్నారు. అందుకు తగినట్టుగానే ఆమె హయాంలో బంగ్లా ప్రభుత్వానికి మన దేశం బాగా సాయం అందిస్తోంది. చిరకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ఆసక్తి చూపుతోంది. బంగ్లాతో నాలుగు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సరిహద్దు వివాదాన్ని ప్రస్తుతప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే పరిష్కరించారు. ఇప్పుడు అంతకన్నా తీవ్రమైనది, చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నదీ అయిన కోషియారా నదీజలాల పంపిణీపై ఒప్పందం కుదుర్చుకున్నారు. కోషియారా నదీజలాల పంపిణీపై వివాదం పూర్వపు కాంగ్రెస్ ప్రభుత్వ హయాం నుంచి పెండింగ్‌లో ఉంది. బంగ్లాదేశ్ తో సంబంధాలు మెరుగుగా ఉన్నప్పటికీ, అసోం, తది తర సరిహద్దు రాష్ట్రాల్లో అధికారంలో పార్టీలు భిన్నమైన వైఖరిని తీసుకోవడం వల్ల ఈ సమస్య పరిష్కారం కాలేదు.
అలాగే, తీస్తా నదీ జలాల పంపిణీ విషయంలో కూడా షేక్ హసీనా ప్రధాని మోడీతో చర్చలు జరిపారు. ఇది కూడా పరిష్కారం అయితే, బంగ్లాతో నీటి వివాదా లు చాలా మటుకు పరిష్కారం అయినట్టే. ఆమె ప్రధాని మోడీతో చర్చలకు ఉపక్రమించే ముందు ఇరుదేశాల మధ్య సాంస్కృతీ, సంప్రదాయాల గురించి ప్రధానంగా ప్రస్తావించారు. భారత్‌లో అంతర్భాగంగా ఉన్నప్పుడు బంగాల్ ప్రజలు సోనార్ బంగ్లా నినాదాన్ని భావోద్వేగం తో ముక్త కంఠంతో వినిపించేందుకు బెంగాలీలంతా ఎంతో గర్విస్తారు. స్వతంత్ర భావ వీచికలు అక్కడి నుంచే వీచాయి. స్వాతంత్య్ర సమరంలో బెంగాలీల పాత్ర అమోఘం. దేశ విభజన తర్వాత కూడా బెంగాలీలు భారత్‌తో కలిసి ఉండాలన్న ఆకాంక్షను కలిగిఉండటానికి ఇదే కారణం.
భారత్‌తో మైత్రి వల్ల బంగ్లాదేశ్ ఎన్నో ప్రయోజనాలను పొందింది. మైత్రి సూపర్ థర్మల్‌పవర్ ప్రాజెక్టు మొదటి యూనిట్‌ను భారత్ సాయంతో బంగ్లా దేశ్ నిర్మించింది. కోషియారా నదీజలాల పంపిణీయే కాకుండా బంగ్లాదేశ్ న్యాయాధికారులకు శిక్షణ, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఒప్పందాలు, పబ్లిక్ టెలివిజన్ సెక్టా ర్లో సాయం వంటి ఒప్పందాలపై కూడా ఇరుదేశాలూ సంతకాలు చేశాయి. ద్వైపాక్షిక సంబంధాలకు షేక్ హసీనా అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. తమ దేశాభి వృద్ధిలో భారత్ అతిపెద్ద భాగస్వామి అని షేక్ ప్రశంసిం చడంలో పొగడ్తలేం లేవు. బంగ్లాదేశ్ ఆర్థికాభివృద్ధి, శాస్త్ర, సాంకేతిక, ఐటి రంగాల్లో మనదేశం బంగ్లాకు అందిస్తున్న సాయాన్ని దృష్టిలో ఉంచుకునే ఆమె ఈ వ్యాఖ్య చేశారు. అంతేకాకుండా భారత్ అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని షేక్ హసీనా తన ప్రసంగంలో ప్రశంసించారు.
ఇరుదేశాల్లోని యువతరానికి బంగరు భవిష్యత్‌ని అందించడమే లక్ష్యంగా ఇరుదేశాల విదేశాం గ విధానం రూపుదిద్దుకుందని హసీనా పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌తో కనెక్టివిటీలోనూ, వాణిజ్య మౌలిక సదుపా యాల విషయంలోనూ భారత్ మంచి సంబంధాలను కలిగిఉందని మోడీ పేర్కొన్నారు. బంగ్లాలో మౌలిక సదుపాయాల వృద్ధికి చైనా తోడ్పడుతున్నట్టే, సరిహద్దు రాష్ట్రాలతోసంబంధాలు పెంచేందుకు భారత్ తోడ్పడు తోంది. ముఖ్యంగా, ఈశాన్య రాష్ట్రాల్లో మౌలిక సదుపా యాల వృద్ధి వల్ల బంగ్లాతో సంబంధాలు మరింత మెరు గుకాగలవని భారత్ ఆశిస్తోంది. మోడీ ప్రధాని బాధ్యత లను చేపట్టిన తర్వాత ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం చేస్తున్న కృషివల్ల ఇప్పటికే ఆ రాష్ట్రాలు దేశంలోని ఇతర ప్రాంతాలతోసంబంధాలను వృద్ధి చేసుకుంటున్నాయి. బంగ్లా వంటి పొరుగు దేశాలతో సంబంధాలను పెంచు కోవడానికి ఈశాన్య రాష్ట్రాల ు బలోపేతం చైనాకు చెక్ పెట్టవచ్చన్నది మోడీ వ్యూహం.