భారత రాజకీయాల్లో సామాజిక న్యాయం అనే మాట ఇప్పుడు బాగా వినిపిస్తోంది. ఏభై అరవై ఏళ్ళ క్రితమే సామాజిక న్యాయాన్ని అమలు చేసిన నాయకుడు కర్పూరీ ఠాకూర్. సామాజిక న్యాయానికి ఆయన నిర్వచనం. బీహార్ ముఖ్యమంత్రిగా రెండు పర్యా యా లు వ్యవహరించినా, అసలు ఏమాత్రం భేషజం, గర్వం లేకుండా ఆయన కార్యకర్తలతో కలిసిపోయే వారు. సోషలిస్టు పార్టీ నాయకునిగా దేశంలో కాంగ్రెస్ వ్యతిరే క కూటమి నిర్మాణ కోసం ఎంతో కృషి చేశారు.
బీహార్‌లోని వెనుకబడిన ప్రాంతమైన సమస్తిపూర్‌కు స మీపంలోని కర్పూరీ గ్రామానికి చెందిన ఠాకూర్ అత్యం త వెనుకబడిన తరగతుల కుటుంబంలో జన్మిం చారు. స్వయంకృషితో అంచలంచెలుగా పైకి వచ్చారు. ఆయన అట్టడుగు వర్గాల పేదరికాన్ని చాలా దగ్గర నుంచి చూ శారు.జ్యోతిబాయ్ ఫూలే, సావిత్రీబాయ్‌పూలేలు వెనుకబడిన వర్గాలకోసం చేసిన కృషిని ఆదర్శంగా తీసుకుని ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీల) కోసం ఆయన ప్రభుత్వం అప్పట్లోనే ఒక కమిషన్‌ను వేసింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కూడా రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించింది. జనతా పార్టీలో సోషలిస్టు వర్గానికీ, జనసంఘ్ వర్గానికీ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం ఉన్నప్పటికీ, జనసంఘ్ నాయకుల్లో చాలామంది ఆయనకు మిత్రులు ఉన్నారు.
కర్పూరీ శతజయంతి సందర్భంగా మరణానంతర పురస్కారంగా భారత్ రత్న అవార్డును ప్రకటించిన ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ కూడా జనసంఘ్ మాతృక అయిన బీజేపీకి చెందిన వారే. అలాగే, కాంగ్రెస్ సోషలిస్టు నాయకులతో కూడా ఆయనకు సంబంధాలుండేవి. రాజకీయం అనేది పేదల జీవితాల్లో వెలుగు నింపాలే కానీ, వారిని మరింత దిగ జార్చకూడదని కర్పూరీ అనేవారు. అలాగే, స్వాతంత్య్ర సమరంలో ఆయన లోక్‌నాయక్ జయప్రకాష్ నారా యణ్‌తో కలిసి వివిధ ఉద్యమాల్లో పాల్గొని నెలల తరబడి జైలులో ఉన్నారు. ఆయనకు హిందీ భాష అంటే మక్కువ ఎక్కువ. స్వచ్ఛమైన హిందీలో అనర్గళంగా మాట్లాడేవారు. అదే సందర్భంలో ఆంగ్ల భాషను రుద్దడాన్ని వ్యతిరేకిం చేవారు. దక్షిణాదిన డీఎంకె అధ్యక్షుడు కరుణానిధి మాదిరిగానే ఏ భాషనైనా ప్రజలు ఐచ్ఛికంగా అభ్యసిం చవచ్చు కానీ, బలవం తంగా రుద్దకూడదు అనేవారు.
ఇద్దరూ కాంగ్రెస్ వ్యతిరేకులే, అయితే, కరుణానిధి తర్వాతి కాలంలో కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకున్నారు. కర్పూరీ మాత్రం కాంగ్రెస్‌ని అంటరాని పార్టీగానే పరిగణించేవారు. భారత దేశంలో సోషలిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన రామమనోహర్ లోహియా, మధులిమాయే, ఎస్.ఎన్.బెనర్జీ వంటి దిగ్గజాలతో కలిసి సోషలిస్టు సమాజ నిర్మాణం కోసం ఆయన కృషి చేశారు. ఆయన తంతితపాలా ఉద్యోగుల సమ్మెకు మద్దతు ఇవ్వడం వల్ల ఆనాడు అధికారంలో ఉన్న ఇందిరాగాంధీ ప్రభుత్వం జైలులో పెట్టింది. బీహార్ లో కులాల కుంపట్లు ఎక్కువ. అందరూ వెనుకబడిన వర్గాలవారే. మళ్ళీ వారిలో వారికి సరిపడేది కాదు. వెను కబడిన తరగతుల్లో ఐక్యత లేకపోతే ఎంత కాలమైనా ఆర్థికంగా వెనుకబడి ఉంటామని ఆయన హెచ్చరించేవారు. ఆయన హెచ్చరికల పర్యవసానంగానే ఆయ న కన్నుమూసిన ఏడాది తర్వాత వీపీ సింగ్‌ప్రభుత్వం బీపీ మండల్ నేతృత్వంలో ఓబీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. విద్యా, వైద్య సంస్థల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించింది. కర్పూరీ అంతకు ముందే ఒబీ సీలకూ,ఈబీసీలకు రిజర్వేషన్లను అమలు జరిపారు.
కర్పూరీ ఎంతో నిరాడంబరంగా ఉండేవారు. ఆయన ఆహార్యంలోనే కాకుండా, అందరితో కలుపు గోలుగా ఉండేవారు. ఆయన మిత్రపక్షాలను ఎంతో గౌరవించే వారు. మతం పేరిట రాజకీయాలను వ్యతిరేకించేవారు. జనతాపార్టీలో చీలిక వచ్చినప్పుడు చరణ్ సింగ్ నేతృత్వంలోని జనతాదళ్ (సెక్యులర్)లో చేరారు. ఆయన బీహార్‌లో అగ్రవర్ణాలతో సఖ్యతతో ఉంటూనే బీసీల అభ్యున్నతి కోసం కృషి చేసే వారు. ప్రస్తుత ముఖ్య మంత్రి, జనతాదళ్(యు) సారథి ని తీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ మొదలైన వారంతా ఆయన శిష్యులే. సిద్ధాంతాలతో రాజీపడకపోవడం, నిరాడంబర జీవనాన్ని సాగించడం, కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత మొద లైన అంశాల్లో ఆయనను తెలుగు వాడైన కమ్యూనిస్టు గాంధీ పుచ్చలపల్లి సుందరయ్యగారితో పోల్చవచ్చు. ఎంతకా లం ఎన్ని పదవులను నిర్వహించామని కాకుండా, ప్రజలకు ఎంతగా ఉపయోగపడ్డామని ఆ రోజుల్లో నాయకులు ఆలోచించుకునేవారు. ఆయన శతజయంతి సందర్భంగా, మరణానంతర పురస్కారంగా భారతరత్న అవార్డును ప్రధాని మోడీ ప్రకటించడం ఎంతో సముచితం. స్వాగతించాల్సిన విషయం.