కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటులోనూ, వెలుపలా వెన్నుదన్నుగా నిలిచిన నాయకుల్లో కపిల్ సిబాల్ ముఖ్యులు. న్యాయశాస్త్ర కోవిదుడైన సిబాల్ పార్లమెంటులో ప్రతిపక్షాల దాడులను తిప్పికొట్టి ఎన్నో సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి పెట్టనికోటగా నిలిచారు.ఆయన రాజీనామాతో కాంగ్రెస్ మరింత బలహీనపడిందనడం లో ఎటువంటి సం దేహం లేదు. ఆయన లోక్‌సభకు ఎన్నికైంది ఒక్కసారి మాత్రమే అయినా, రాజ్యసభలో కాంగ్రెస్ నాయకునిగా ఎన్నోవివాదాల్లో తన వాణిని బలంగా వినిపించి పార్టీకి మంచి పేరు తెచ్చారు.ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి సమాజ్ వాదీ పార్టీ మద్దతుతో మళ్ళీ రాజ్యసభకు పోటీ చేయడానికి నామినేషన్ వేశారు. ఆయన కడపటిసారి కూడా ఉత్తరప్రదేశ్ నుంచే రాజ్యసభ కు ఎన్నికయ్యారు.ఈసారి కాంగ్రెస్‌కి అక్కడ బలం లేక పోవడం వల్ల సమాజ్ వాదీ పార్టీతో పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీపై గాంధీ కుటుంబం పట్టును వ్యతిరేకిం చక పోయినా, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అంగీకరిం చలేదు.పార్టీకి చురుకైన నాయకతం కావాలని అనే వారు. ఆ కారణంగానే పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆయనను దూరంగా పెట్టారు. కాంగ్రెస్‌లో సోనియాకు ఇప్పుడు సలహాలు ఇచ్చే నమ్మకమైన నాయకులు ఎవరూ లేరు.కపిల్ సిబాల్ పంజాబ్‌లోని జలంధర్‌కి చెందిన వారు.ఆయన తండ్రి హీరాలాల్ సిబాల్ దేశ విభజన సమయంలో పంజాబ్‌లో స్థిరపడ్డా రు. కపిల్ సిబాల్‌కి రాజ్యాంగ పరమైన అంశాలపై సాధికారత ఉంది.
సుప్రీం కోర్టు న్యాయవాదిగా సుదీర్ఘ కాలం అనుభవం ఉండటం వల్ల రాజ్యాంగ పరమైన చిక్కులు వచ్చినప్పుడు చిటికెలో పరిష్కారాన్ని సూచిం చే వారు.కాంగ్రెస్ పార్టీకి పూర వైభవం తేవాలంటే ముందుగా నాయకత్వ సమస్యను పరిష్కరించాలంటూ సోనియాకు లేఖ రాసిన సీనియర్ నాయకుల్లో ఆయన ఒకరు. ఆయన బీజేపీ పంచన చేరేందుకే అలాంటి లేఖలు రాయిస్తున్నారంటూ రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శిం చారు. దానిపై ఆయన రాహుల్‌కి ఘాటైన సమాధాన మిచ్చారు. రాహుల్‌లో అనుభవ రాహిత్యమే కాదు, సీనియర్లలలో ఎవరు నమ్మకస్తులో, ఎవరు భజనపరు లో ఎంచుకోలేని అసమర్ధత కూడా ఉంది. బీజేపీకి బద్ద శత్రువైన సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో సిబాల్ రాజ్యసభ కు పోటీ చేస్తుండటం వల్ల రాహుల్‌ది అపోహ మాత్రమే నని రుజువైంది. అంతేకాదు, బీజేపీ విధానాలను ఎండ గట్టడంలో ఆయన రాజీలేని వైఖరిని ప్రదర్శిస్తూ ఉంటా రు. అలాంటి సీనియర్ నాయకుడు పార్టీలో ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు.కాంగ్రెస్ నుంచి ఈనెల 16వ తేదీనే తాను రాజీనామా చేసినట్టు ప్రకటించారు. పంజాబ్‌లో పార్టీ ప్రభుత్వాన్ని చేజేతులా పోగొట్టుకోవ డానికి సిబాల్ వంటి నాయకులను పక్కన పెట్టి రాహుల్ భజన పరుల మాటలను వినడమే కారణం. ముఖ్య మంత్రి పదవికి అమరీందర్ సింగ్ తర్వాత చరణ్‌జిత్ సింగ్ చున్నీని ఎంపిక చేశారు.అలాగే,పీసీసీ అధ్యక్ష పదవికి ఎంతో మంది సమర్ధులుండగా,బీజేపీ నుంచి వచ్చిన నవజ్యోతి సింగ్ సిద్దూని రాహుల్ ఎంపిక చేశారు. ఈ ఇద్దరి నియామకాల విషయంలో కపిల్ సిబాల్ వంటి అనుభవజ్ఞుల సలహాలను కాంగ్రెస్ అధిష్టా నవర్గం తీసుకోలేదు. దాంతో చేతిలో ఉన్న మూడు రాష్ట్రాల్లో ఒకటిపోయింది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో పార్టీ వ్యూహాలను రూపొందించే సీనియర్లు ఒక్కొక్కరే రాజీనామా చేయడం సోనియాగాంధీకి కష్టకాలమే. రాహుల్ సలహాలను పాటిస్తుండటం వల్లనే కాంగ్రెస్ పరిస్థితి ఇంత దయనీయంగా మారిందని ఇటీవల ఉదయ్‌పూర్ చింతన్ శిబిర్ సందర్భంగా పలువు రు పార్టీ అభిమానులు వాపోయారు.
అయితే, వారిలో ఎవరూ ధైర్యం చేసి తమ అభిప్రాయాలను బయటకు వెళ్ళగక్కలేకపోయారు.ముఖ్యంగా గుజరాత్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, పటేల్ ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ పార్టీ నుంచి తాను బాధతో వెళ్ళిపోతున్నాననీ, తనకు పదవి ఇచ్చారు కానీ, పని చెప్పకపోవడం వల్లనే పార్టీ నుంచి వైదొలగాల్సి వస్తోందని బహిరంగంగానే ప్రకటించారు.రాహుల్ పార్టీ అధ్యక్షుడు కాకపోయినా, ప్రధానమైన విధానపరమైన నిర్ణయాలన్నీ ఆయనే తీసుకుంటున్నారు.అలాగే, కాంగ్రెస్ పార్టీకి ఎంతో నమ్మకమైన సేవలందించిన మాజీ లోక్‌సభ స్పీకర్ బల రామ్ జాఖడ్ కుమారుడు ఇటీవల పార్టీకి రాజీనామా చేశారు. దశాబ్దాలుగా పార్టీకి అండగా నిలిచిన వారంతా క్రమంగా బయటకు వెళ్ళి పోతున్నారు. ఈ ధోరణికి అడ్డుకట్ట వేయడానికే సోనియా ఇటీవల చింతన్ శిబిర్‌లో సలహాలు కోరారు. కాంగ్రెస్ పార్టీకి అసలు సమస్య రాహు ల్ నుంచే ఉందన్న సంగతి ఆమెకు కూడా తెలుసు. సిబాల్ మాదిరిగా గళం విప్పిన సీనియర్ నాయకుల్లో ఒకరైన గులామ్ నబీ ఆజాద్ పేరును రాష్ట్రపతి పదవికి ప్రధాని పరిశీలిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఆయన కూడా వెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..