Friday, November 22, 2024

హక్కులకు సంకెళ్ళా?: ఐరాస..

ఆల్ట్‌ న్యూస్‌ వెబ్‌సైట్‌ సహ వ్యవ స్థాపకుడు మహ్మద్‌ జుబైర్‌నీ,హక్కుల ఉద్యమనాయకురాలు తీస్తా సెత ల్వాడ్‌నీ అరెస్టు చేయడం పట్ల ఐక్యరాజ్య సమితి తీవ్ర ఆక్షేపణ తెలియజేసింది.సమితి ప్రధాన కార్యదర్శి ఆంటో నియో గుటెరెస్‌ ఈ అరెస్టులపై తీవ్రంగా స్పందించారు. దీనిపై దేశంలోపల జర్నలిస్టుల సంఘాలు కూడా అభ్యం తరాన్ని తెలిపాయి. జర్నలిస్టులు వాస్తవాలు తెలుసుకునే సమాచారాన్ని అందజేస్తారనీ,ప్రజల్లో మతపరమైన ఉద్రేకాలను రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో వారు కథనాలను వెలువరిస్తారనడం సమంజసం కాదని గుటెరెస్‌ తరఫు ప్రతినిధి స్టీఫెన్‌ డుజారిక్‌ అన్నారు.గతంలో కూడా ఐక్య రాజ్య సమితి జర్నలిస్టుల హక్కులపై తీవ్రంగా గర్హిం చింది. కానీ, ఈసారి మరింత ఘాటైన విమర్శలు చేసింది. అలాగే, 2002నాటి గుజరాత్‌ అల్లర్ల కేసులను వెలుగులోకి తెచ్చినందుకు హక్కుల ఉద్యమ నాయ కురాలు తీస్తాతల్వాడ్‌ని జైలులో పెట్టడాన్ని గూడా సమితి హక్కుల విభాగం తీవ్రంగా స్పందించింది. సెతల్వాడ్‌ని ముంబాయి లోని జుహూలో ఆమె నివాసం నుంచి గత శనివారం అరెస్టు చేసి తీసుకుని వెళ్ళారు. ఆమె అరెస్టు అన్యాయమని హక్కుల సంఘాలు ఆరోపిం చాయి. ఇరవై ఏళ్ళ క్రితం నాటి సంఘటనలపై ఆమె పోరాడిన విషయం వాస్తవమే కానీ, దానికి ఇప్పుడు ఆమెను అరెస్టు చేయడంలో అర్ధం లేదని హక్కుల సం ఘాలు ధ్వజమెత్తాయి.దేశంలో మళ్ళీ అసహన ధోర ణులు పెరుగుతున్నాయనడానికి ఈ అరెస్టులు నిదర్శ నమని హక్కుల సంఘాల వారు ఆరోపిస్తున్నారు. అహ మ్మదాబాద్‌లో ఇరవై ఏళ్ళ క్రితం జరిగిన సంఘటనలకు సంబంధించి ఒక కేసులో ప్రధాని నరేంద్రమోడీకి కోర్టు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది.ఆ కేసు సెతల్వాడ్‌ ఫిర్యాదుపైనే నమో దు చేశారు. అందువల్ల కట్టుకథలు అల్లి కేసుపెట్టారంటూ ఆమెపై ఇప్పుడు చర్యలుతీసుకుంటున్నారు.నిజానికి అప్పట్లో గుజరాత్‌ అల్లర్ల కేసులను సెతల్వాడ్‌ మాత్రమే కాకుండా ఆమ్నెస్టీ ఇంటర్‌నేషనల్‌ వంటి హక్కుల సం స్థలు వెలుగులోకి తెచ్చాయి.అయితే, పత్రికా విలేఖ రులు, వెబ్‌ జర్నలిస్టుల ను అరెస్టు చేయడం మీడియా స్వేచ్ఛకు ఆటంకం కలిగించినట్టు అవుతుందని సమితి ప్రధాన కార్యదర్శి ప్రతినిధి స్పష్టం చేశారు. జుబైర్‌, సెత ల్వాడ్‌ల అరెస్టులను తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షు రాలు,బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా తీవ్రంగా ఖండించారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న అసహన ధోరణులకు ఈ అరెస్టులు నిదర్శనమని ఆమె తీవ్రంగా విమర్శించారు. సాగు చట్టాలపై రైతులు ఆం దోళన జరిపినప్పుడు కూడా ప్రభుత్వం ఇదే మాదిరిగా అసహనాన్ని ప్రదర్శించిందనీ, హక్కుల ఉద్యమ కారు లను అరెస్టు చేయడం వల్ల వచ్చే నష్టమేమిటో మోడీకి గతంలో అనుభవమేనని ఆమె అన్నారు.అయితే, రెచ్చగొట్టే ధోరణుల వల్లే హింస పెరుగుతోందని హక్కుల ఉద్యమకారులు పేర్కొంటున్నారు.

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఒక దర్జీ నుపుర్‌ శర్మ వ్యాఖ్యలను సమ ర్ధించినందుకు అతడి తలను నరికి వేసిన సంఘటనను కమలనాథులు ప్రస్తావిస్తూ ఇలాంటి ఘటనలను రాహుల్‌, మమతలు సమర్ధిస్తారా అంటూ ఎదురు ప్రశ్న వేశారు. హింసను ఎవరూ సమర్ధించరు.అంతమాత్రాన పత్రికా స్వేచ్చను అడ్డుకోవడం రాజ్యాంగ బద్ధం కాదు. ఇది నిపుణుల అభిప్రాయం. ఉదయ్‌పూర్‌లో జరిగిన సంఘటన వంటివి జరగక పోయినా, నుపుర్‌ శర్మ వ్యాఖ్య లను సమర్దించేవారివల్ల శాంతిభద్రతలకు భంగం కలుగుతోందన్న మాట వాస్తవం. నుపుర్‌ శర్మను బీజేపీ పార్టీ నుంచి బహిష్క రించినతర్వాత ఆమె వ్యాఖ్యలను సమర్ధిస్తున్నవారిపై చర్యలు ఎందుకుతీసుకోవడం లేదు. ఎక్కడికక్కడ జనాన్ని రెచ్చగొట్టడంలో అటువారు, ఇటువారు అతిగా పోతుండటం వల్లనే అశాంతి చెలరేగు తోంది. అలాగే, ఢిల్లిdలో ,ఉత్తరప్రదేశ్‌లో బుల్‌డోజింగ్‌ పేరిట జరుగుతున్న కూల్చివేతల వల్ల కూడా అశాంతి చెలరేగుతోంది.జుబైర్‌ ఢిల్లిdలో కూల్చివేతల నేపధ్యంలో తన వెబ్‌సైట్‌లో కొన్ని కథనాలను ప్రచారం చేయడం వల్లనే అతడిని అరెస్టు చేసినట్టు చెబుతున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో ఇలాంటి బుల్‌డోజింగ్‌ ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. అయినప్పటికీ ఇందుకు సంబం ధించిన సమా చారాన్ని అందించిన మీడియాపై చర్యలే మిటని హక్కుల సంఘాల వారు ప్రశ్నిస్తున్నారు. గతంలో గోరక్షకుల పై దాడుల విషయంలో జరిగినట్టు గానే ఇప్పుడు దాడులు, అరెస్టులు జరుగుతున్నాయి. హింసకు, ప్రతీకారానికీ ఎవరు పాల్పడినా తప్పే.ఇరవై ఏళ్ళ నాటి గుజరాత్‌ కేసుల దాఖలుకు బాధ్యరాలిగా తీస్తా సెత ల్వాడ్‌ను ఇప్పుడు అరెస్టుచేయడం కూడా ప్రతీ కారమే. పాలకుల సంయమనాన్ని పాటిస్తే శాంతి భద్రతలకు విఘాతం కలగదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement