వ్యవసాయ రంగంలో సంస్కరణలు తెచ్చినప్పుడల్లా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నా యంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ సోమవారం పార్లమెంటులో పాత చరిత్ర తవ్వి తీసి సభ్యులముందు ఉంచారు. సంస్కరణలు వచ్చినప్పుడల్లా పేదలకు అన్యాయం జరుగుతుందేమోనన్న భయ సందేహాలను కమ్యూనిస్టులు, లౌకిక వాద శక్తులు వ్యక్తం చేస్తున్న మాట నిజమే. సంస్కరణలు అమలు జరిగిన, జరుగు తున్న తీరు చూస్తుంటే అవి నిరాధారాలు కావని రుజువు అవుతోంది. ప్రభుత్వ రంగ సంస్థల విషయమే తీసుకుంటే వాటిని ప్రైవేటు పరం చేయడం వల్ల లబ్ధి పొందింది ప్రైవేటు, కార్పొరేట్, పారిశ్రామిక శక్తులే. ఇప్పుడు వ్యవసాయ రంగం మీద ప్రభు త్వం దృష్టిని కేంద్రీకరించింది. వ్యవసాయ రంగం తరతరాలుగా కుటుంబ వారస త్వంగా సాగుతున్న వ్యాపకం. వ్యవసాయం లేనిదే రైతులు జీవించలేరు. పారిశ్రామికరంగంలో నష్టాలు వస్తే,పరిశ్రమల నిర్వాహకులు వేరే వ్యాపకాలపై దృష్టి పెడతారు.వారికి బ్యాంకులు రుణాలు కూడా ఇస్తాయి. కానీ, రైతులు వ్యవసాయరంగం వీడి మరో రంగానికి తరలి వెళ్ళ లేరు. అంతవరకూ ఎందుకువ్యవసాయానికి తోడుగా కోళ్ళ ఫారాలను, చేపలపెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నప్పటికీ ఆ ప్రోత్సాహకాలను ఉపయోగించుకుంటున్నది అతి కొద్దిమంది మాత్రమే. పెట్టుబడుల కోసం పెద్ద రైతులపై ఆధారపడే చిన్నరైతులు వ్యవసాయాన్ని ఇతరుల చేతులలో పెట్టేందుకు అంగీకరించరు. ప్రధాని తన వాదాన్ని బలం వినిపించేందుకు మాజీ ప్రధాని చరణ్ సింగ్ 70వ దశకంలో అన్న మాటలను గుర్తు చేశారు. ఒక హెక్టార్ కన్నా తక్కువ భూమి కలవారు ఆనాడు 51 శాతం ఉండగా, ఇప్పుడు 68 శాతం ఉన్నారనీ, వీరు ఎంత శ్రమించినా పెద్దగా ఆదాయంఉండదనీ, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ఆనాడే ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచనలు చేశారని ప్రధాని గుర్తుచేశారు. దశాబ్దాలు గడుస్తున్న కొద్దీ రైతులు భూములపై హక్కును ఎందుకు కోల్పోతున్నారో ప్రధాని చెప్పి ఉంటే, రెండో పార్శ్వాన్ని కూడా వివరించారని భావించేందుకు వీలుండేది. చరణ్ సింగ్ కాలంనాటికీ ఇప్పటికీ రైతులు మరింతగా పేదలయ్యారు. ఇందుకు కారణాలు ప్రకృతి వైపరీత్యాలే కాకుండా, పద్దరైతులు, వడ్డీ వ్యాపారుల రుణచక్రబంధంలో చిక్కుకోవడం ప్రధాన కారణమన్నదివాస్తవం. ఇలాంటి వారికి ప్రభుత్వాలు అందించే సాయమంతా ఎక్కడికి వెళ్తోందో ప్రభుత్వాలు కూపీ లాగిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి.అలాగే. హరిత విప్లవం కోసం రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడిన సన్నకారు,చిన్న రైతులకు మిగిలిం దేమీ లేదు. పెద్ద రైతులు,కాంట్రాక్టు ఫార్మింగ్ రైతులే ఎక్కువబాగుపడ్డారు. ఈ విషయం కూడా ప్రధాని చెప్పి ఉంటే ఆయన పరిస్థితిని సమగ్రంగా వివరించినట్టు అయ్యేది. ప్రధాని పార్లమెంటులో చేసిన ప్రసంగం ఎంతో తార్కికంగా ఉన్నప్పటికీ దేశంలో వ్యవసాయ రంగ పరిస్థితిపై ఆయన ఒకే పార్శ్వాన్ని వివరించారు.మరో పార్శ్వాన్ని తరచి చూస్తే, చిన్న రైతులు అప్పుడూ, ఇప్పుడూకూడా దగాకు గురి అవుతున్నారు. కేంద్రం, రాష్ట్రాలు తీసుకువస్తున్న పథకాలన్నీ పెద్ద రైతులను ఆదుకోవడానికి ఉద్దేశించినవే. ఈ పరిస్థితి మార్పు కోసమే సంస్కరణలను తీసుకుని వచ్చినట్టు ప్రధాని వివరించారు.పసల్ బీమా యోజన కింద గత నాల్గేళ్ళలో 90వేల కోట్ల రూపాయిలను చెల్లించినట్టు ప్రధాని వివరించారు. బ్యాంకు ఖాతా లు ఉన్న వారికే కాకుండా లేనివారికి ప్రయోజనం చేకూర్చేందుకే ప్రధానమంత్రి సమ్మాన్ యోజన పథకాన్ని తెచ్చామని మోడీ వివరించారు. అయితే,ఈ పథకాల్లో ఎక్కువ మంది లబ్ధి పొందింది పెద్ద రైతులేనని చిన్న రైతులు వాపోతున్నారు.ఇందుకు పంట నిల్వ ఉంచు కునే పరిస్థితి వారికి లేదు. పంట చేతికొచ్చినవెంటనే అమ్ముకునేవారే అధిక సంఖ్యాకులు ఉన్నారు.అలాంటివారికి ప్రభుత్వపథకాల ప్రయోజనాలు చేరడం లేదు. మోడీ ప్రభుత్వం ఈ విషయమై కూడా దృష్టిని సారించాల్సిన అవసరంఉంది.రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నప్పటికీ అదిచాలడం లేదన్నఫిర్యాదులు వస్తున్నాయి. అందుకోసం మళ్ళీ వారు రుణదాతలను ఆశ్రయించాల్సి వస్తోంది ప్రభుత్వం ఈ విషయమై కూడా దృష్టిని సారించా ల్సిన అవసరం ఉంది. సమయానుకూలంగా పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసుకుంటూ ముందుకు సాగాలన్న ప్రధాని సందేశం సముచితమైనదే.
Advertisement
తాజా వార్తలు
Advertisement