Tuesday, November 26, 2024

మార‌ని పుతిన్ బుద్ధి!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఇటీవల ఉజ్బె కిస్తాన్‌లోని సమర్‌ఖండ్‌లో షాంఘై సహకార కూటమి శిఖరాగ్ర సమావేశాలకు హాజరైనప్పుడు మన ప్రదాని నరేంద్రమోడీతో సహా వివిధ దేశాల అధినేతలు ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని విరమించమని హితవు చెప్పారు. మీకున్న ఒత్తిడులు, మీ సమస్యలు మాకు తెలుసు.. ఇక యుద్ధాన్ని విరమించడం రష్యా క్షేమానికేకాక, ప్రపంచ దేశాల క్షేమానికి అత్యవసరమని మోడీ ఒక స్థిత ప్రజ్ఞునిగా సలహా ఇచ్చారు. ఉక్రెయిన్‌ విషయాలలో మోడీ ఎంతో సంయమనాన్ని, సహనాన్ని ప్రద ర్శిస్తున్నారు. రష్యాకు సానుకూలంగా వ్యవహరిస్తున్న చైనానుంచేకాక, అగ్రరాజ్యమైన అమెరికా నుంచి కూడా భారత్‌ ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నది.

ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకుని భారత సరిహద్దు దేశాలను చైనా రెచ్చగొడుతోంది. కాగా, ఇటీవలి కాలంలో ఉక్రెయిన్‌ ఎదురుదాడిని ఉధృతం చేయడంతో రష్యా బలగాలు పలాయనం చిత్తగిస్తున్నాయి. ఖార్ఖీవ్‌ సహా అనేక ప్రాం తాల్లో ఉక్రెయిన్‌ మళ్లిd పట్టు సాధించింది. ఈ పరిణామాలతో ఉక్రెయిన్‌, ఐరోపా దేశాల్లో కొత్త ఆశలు చిగురిస్తుండగా రష్యా బలగాల్లో నిరుత్సాహం ఆవరిస్తోంది. ఈ పరిస్థితుల్లో పుతిన్‌ ఇప్పుడు కొత్త ఎత్తుగడ ఎత్తుకున్నారు. ఉక్రెయిన్‌లోని పూర్వపు ప్రాంతాలైన తూర్పు, దక్షిణ ప్రాంతాలను రష్యాలో కలుపుకునేందుకు పాచిక వేశారు. ఖార్కీవ్‌ నుంచి తమ దళాలు వెనక్కు వచ్చిన నేపథ్యంలో, రష్యా ఈ యుద్ధంలో ఇంతకుముందు తాను స్వాధీనం చేసుకున్న డోనెట్స్క్‌, లుహాన్స్క్‌, ఖేర్సన్‌, జపోరిజిజియా ప్రాం తాల్లో జనవాక్య సేకరణ జరిపిస్తామనీ, వారంతా ఉక్రెయన్‌లోనే కొనసాగుతామంటే వెనక్కి పోతామని, లేనిపక్షంలో తమ దేశంలో విలీనం చేస్తామని పుతిన్‌ ప్రకటించారు.

పైగా, తమ ప్రాంతాన్ని, ప్రజలను రక్షించుకునేందుకు కావలిసిన అన్ని ఆయుధాలు తమవద్ద ఉన్నాయని పరోక్షంగా అణ్వాయుధాల ప్రస్తావన చేశారు. ఉక్రెయిన్‌ను పావుగా చేసుకుని ఐరోపా దేశాలు కుట్రలు జరుపుతున్నాయని, ఉక్రెయిన్‌కు గుట్టలు గుట్టలుగా ఆయుధాలు ఇస్తున్నాయని, వారికి బుద్ధి చెబుతామని కూడా పుతిన్‌ హెచ్చరించారు. పుతిన్‌ ప్రకటించిన ఈ కొత్త ప్రతిపాదనను, బెదరింపులను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీయే కాకుండా యూరోప్‌ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. అణ్వాయుధాల ఆలోచన సరికాదని, పొరపాటున కూడా ఆ పని చేయవద్దని అమెరికా అధ్యక్షుడు బిడెన్‌ పుతిన్‌కు ఇటీవలే సూచిం చారు. మరోవైపు ఖార్కీవ్‌ మాదిరిగా ఈ ప్రాంతాలను తిరిగి చేజిక్కించుకోవాలన్నది ఉక్రెయిన్‌ ఆలోచన. ఆ విషయాన్ని పసిగట్టిన రష్యా ఈ ఎత్తుగడ పన్నింది.

రష్యా ప్రజాభిప్రాయ సేకరణ జరిపిస్తామన్న ప్రాంతాల లో తిరుగుబాటుదారులను ప్రోత్సహించి, ఆయుధాలు ఇచ్చి ఉసిగొల్పింది రష్యాయే. రష్యా ప్రోద్బలంతో ఈ ప్రాంతాలు ఉక్రెయిన్‌ నుంచి విడిపోవాలన్న నినాదాన్ని తలకెత్తుకున్నాయి. అందుకే రష్యా ఆధిపత్యంలో ప్రస్తుతం ఉన్న ఈ నాలుగు ప్రాంతాలలో ఓటింగ్‌ జరిపిస్తామని రష్యా ప్రకటించడం బూటకు ప్రక్రియ అని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబా కొట్టి వేశారు. ఇదంతా పుతిన్‌ ఆడిస్తున్న కొత్త నాటకమని ఆయన అన్నారు. ఈ నాలుగు ప్రాంతాలవారు రష్యా అధీనంలోకి వెళ్లిన తరువాత ఆ ముచ్చట ఏదో తీరిపో యిందనీ, ఉక్రెయిన్‌లోనే కలి ఉందామని ప్రజలు అంటు న్నారన్నది ఆయన వాదన. నిజానికి రష్యా సైనికుల ఒత్తిడి, ఊచకోత భరించలేక ఈ నాలుగు ప్రాంతాల వారు ఉక్రెయిన్‌లోకి ఎప్పుడు వెళ్దామా అని ఎదురు చూస్తున్నారు.

- Advertisement -

రష్యా సైనికుల నియంతృత్వ పోకడలకు ఈ నాలుగు ప్రాంతాలవారే కాకుండా ఉక్రెయిన్‌లోని అన్ని ప్రాంతాలవారు రష్యా నుంచి ఎంత త్వరగా విముక్తమైతే అంత మంచిదన్న ఆతృతతో ఉన్నారు. ఇది గ్రహించిన పుతిన్‌ అక్కడి వారిలో ఈ ఆలోచన స్థిరపడకుండా వీలైనంత త్వర లోనే కీలకమైన ఈ నాలుగు ప్రాంతాలలో ప్రజాభిప్రాయ సేకరణ జరి పిస్తున్నట్టు ప్రకటించారు. అంతా ఏకపక్షమే. అక్కడి ప్రజల అభిప్రాయాన్ని తెలసుకుని కాదు. మాతృదేశంలో విలీనం కావడానికి ఈ నాలుగు ప్రాంతాల ప్రజలు ఎదురు చూస్తున్నారని, దీనిని ఎవరూ ఆపలేరని రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వదేవ్‌ కూడా అన్నారు. పుతిన్‌ తన వారందరిచేత ప్రజాభి ప్రాయ సేకరణకు జై కొట్టించి ఈ వారంలోనే రిఫరెండం జరిపించేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. పుతిన్‌ ప్రకటనతో ఉక్రెయిన్‌ పరిణామాలు వేడెక్కాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement