Friday, November 22, 2024

టికెట్ల పంపిణీలో నిరసనలు..

ఎగువ సభలకు పార్టీ అభ్యర్దులను ఎంపిక చేయడం ప్రతి రాజకీయ పార్టీకీ సమస్యలు అనివార్యమవుతూ ఉంటాయి. చాలాకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి ఈ సమస్య మొదటి నుంచి పెను సమస్యగానే ఉంది. అయితే, ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తూ గండాలను కాంగ్రెస్‌ దాటుకుంటూ వస్తోంది. ఈసారి కూడా అలాంటి సమస్యే ఎదురైంది. కాంగ్రెస్‌ పార్టీకి 18 సంవత్సరాలు పైగా ప్రతి ఎన్నికల్లోనూ ప్రచారం చేస్తూ వస్తున్న సినీనటి నగ్మా ఈ సారి తన అసంతృప్తిని బహి రంగంగానే వెళ్ళగక్కారు.ఇతర సీనియర్‌ నాయకులు కూడా తమకు టికెట్‌ రాలేదని బహిరంగంగా వ్యాఖ్యా నించకపోయినా, లోలోపల అవమానంతో కుమిలి పోతున్నారు. కాంగ్రెస్‌ చేతిలో ఈసారి రెండురాష్ట్రాలే ఉన్నాయి. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఇటీవల చింత న్‌ శిబిరాన్ని నిర్వహించిన కాంగ్రెస్‌ రాష్ట్రంలో అధికారం లో కొనసాగుతున్నప్పటి కీ మూడు సీట్లకూ రాష్ట్రానికి చెందినవారెవరినీ ఎంపిక చేయలేదు.రణదీప్‌ సూర్జే వాలా, ముకుల్‌ వాస్నిక్‌,ప్రమోద్‌ తివారీలను ఎంపిక చేశారు. ఈ ముగ్గురూ పార్టీలో జాతీయ స్థాయి నాయకు లే, కానీ, లోకల్‌ టాలెంట్‌ని గుర్తించకుండా బయటవారిని ఎంపిక చేయడం ఎంతవరకూ న్యాయమని ఆ రాష్ట్రా నికి చెందిన వారు ప్రశ్నిస్తున్నారు. నగ్మా అయితే, మరింత తీవ్రంగా తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రతిఎన్నికల ముందు పార్టీకి ప్రచారం చేయమని కోరేవారనీ,తగిన సమయం లో గుర్తింపు వచ్చేట్టు చేస్తానని మాట ఇచ్చారనీ,ఆమె మాటకు కట్టుబడే వ్యక్తిగా నమ్మడం వల్లనే 18 ఏళ్ళ నుంచి ప్రచారం చేస్తూ వచ్చాననీ,ఈసారి కూడా తనను నిరాశకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, రాజ్యసభ ఎన్నికల్లో టికె ట్‌ లభించదని ముందే తెలియ డం వల్లనేమో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కపిల్‌ సిబాల్‌ పార్టీకి రాజీనామా చేసి ఉత్తరప్రదేశ్‌ నుంచి సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో ఇండిపెండెంట్‌గా రాజ్యసభకు పోటీ చేస్తున్నారు. జనతాదళ్‌(యు)లో కూడా ఇలాంటి అసంతృుప్తి వెల్లడైంది.ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు,బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌కి అత్యంత సన్నిహితుడైన కేంద్రమంత్రి ఆర్‌సీపీ సింగ్‌కి ఈసారి టికెట్‌ ఇవ్వకపోవడంతో ఆయన బీజేపీలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు.అసలు బీజేపీ నాయకులు ఆయనను ప్రోత్సహిస్తుండటం వల్లనే ఈసారి మరొకరికి తమ పార్టీ టికెట్‌ ఇచ్చినట్టు జనతాదళ్‌(యూ) నాయకు లు చెబుతున్నారు. ఆర్‌సీపీ సింగ్‌ మాజీ ఐఏఎస్‌ కావడం వల్ల మొదటి నుంచి ప్రధానమంత్రితో నేరుగా సంబంధా లు కలిగి ఉన్నారు. తాను జనతాదళ్‌(యు)కి చెందినా ప్రధానమంత్రి నియమిస్తేనే మంత్రినయ్యాననీ,ఆయన రాజీనామా చేయమంటే చేస్తానని మడత పేచీ పెడుతు న్నారు. బీజేపీ నాయకులు పరోక్షంగా ఆయనకు మద్దతు ఇస్తుండటం వల్లనే, పార్టీ టికెట్‌ను మరొకరికి ఇవ్వాలని నితీశ్‌ కుమార్‌ నిర్ణయించకుండా పదవికి రాజీనామా చేయకుండా మొరాయిస్తున్నారని జనతాదళ్‌ (యు) నాయకులు ఆరోపిస్తున్నారు. బీజేపీలో కూడా రాజ్యసభ టికెట్లవ్యవహారం లుకలుకలను సృష్టిస్తోంది. పార్టీ సీనియర్‌ నాయకుడు అబ్బాస్‌ ముక్తర్‌ లఖ్వికిప్రకాష్‌ జావదేకర్‌కీ ఈసారి టికెట్‌ ఇవ్వకపోవడం ఆ పార్టీలో అసంతృప్తిని రేపింది.

బీజేపీ అభ్యర్ధుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కర్నాటక నుంచి ,వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయెల్‌ ఉత్తరప్రదేశ్‌ నుంచి ఎంపిక అయ్యారు.బీజేపీలో గతంలో ప్రాతినిధ్యం వహించిన పలువురు సీనియర్‌ నాయకులకు ఈసారి టికెట్లు దొరక లేదు. అయితే, ప్రధానమంత్రినరేంద్రమోడీ పట్ల విశ్వాసంతో లేదా భయంతో వారెవరూ నోరు మెదపడం లేదు. రాజ్యసభలో ఈసారి ఉత్తరప్రదేశ్‌కి ఎక్కువ ఇతర పార్టీల్లో కన్నా కాంగ్రెస్‌లో టికెట్లు దొరకని వారు బహి రంగంగా విమర్శలు చేస్తున్నారు. ఆ పార్టీలో ఆంతరంగి క ప్రజాస్వామ్యం ఎక్కువని వారే తరచూ చెబుతుంటా రు. చత్తీస్‌గఢ్‌లో కూడాస్థానికేతరుణ్ణి ఎంపిక చేయడం పట్ల కాంగ్రెస్‌ వర్గాలు బహిరం గంగానే అస మ్మతని వ్యక్తం చేశారు. హర్యానాలో మాజీ కేంద్రమంత్రి, దళిత నాయ కురాలు కుమారి షెల్జాకు ఈసారి టికెట్‌ లభించలేదు. అయితే, ఇప్పటికే రెండు మూడు సార్లు టికెట్లు పొందిన నాయకులు ఇంకా అసంతృప్తిని వ్యక్తం చేయడంలో అర్థం లేదని కాంగ్రెస్‌ నాయకుడు ఒకరు అన్నారు. అన్ని రాష్ట్రాల్లో రాజ్యసభ టికెట్ల పంపిణీ అసంతృప్తులను రేపింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజ్యసభ అభ్యర్ధుల ఎంపిక కలకలాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. రాజ్య సభ ఎన్నికలు గతంలో కూడా ఇదే మాదిరిగా అసంతృ ప్తులను రగిల్చాయి. అయితే పార్టీ అధినేతల మాటకు తిరుగులేకపోవడం, బుజ్జగింపులు కారణంగా అవి అప్పటికి సద్దుమణిగినా సాధారణ ఎన్నికల్లో అసంతృప్తి వాదులు పార్టీకి నష్టం చేకూరుస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement