Tuesday, November 26, 2024

భూముల విక్రయం తేలిక కాదు

ఆలోచన మంచిదే.. అమలుపైనే అనుమానా లు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో ఈ ఆర్థిక సంవత్సరం రెవెన్యూను పెంచుకోవానికి ప్రభుత్వరంగ సంస్థల (పీఎస్‌యు) వద్ద ఉన్న మిగులు భూములను విక్రయించి రెవెన్యూ పెంచు కుంటామని చెప్పారు. ప్రతి ఆర్థిక సంవత్స రం బడ్జెట్‌లో ఆర్థికమంత్రులు ఖాయిలా పడ్డ పీఎస్‌యు కంపెనీల ఆస్తులను విక్రయించి రెవెన్యూ పెంచుకుంటామని చెబుతూ వచ్చారు. అయితే అను కున్న లక్ష్యాన్ని మాత్రం ఇప్పటి వరకు ఏ ఆర్థిక మంత్రి చేరలేదు. పీఎస్‌యుల వద్ద నిరుపయోగంగా ఉన్న ఆస్తుల విషయానికి వస్తే కేంద్రమంత్రులు నిర్వ హ స్తున్న పోర్టుపోలియోల వద్ద ప్రభుత్వరంగానికి చెందిన సంస్థల వద్ద అదనపు భూములు విరివిగా ఉన్నాయి. నిర్మల సీతారామన్‌ తన ప్రసంగంలో పీఎస్‌యు రంగానికి చెందిన భూములను నేరుగా విక్రయించడమో లేదా రాయితీల ద్వారా విక్రయించ డమో చేస్తామని చెప్పారు. ఈ ఆస్తుల విక్రయానికి స్పెషల్‌ పర్పస్‌ వెహకిల్‌ (ఎస్‌పీవీ)ని ఏర్పాటు చేస్తా మని ప్రతిపాదించారు. ఈ ఆస్తులను విక్రయించ డానికి ప్రత్యేక కంపెనీని ఏర్పాటు చేసి ఆస్తుల విక్రయం చేపడతామని నిర్మల తెలియజేశారు. నిర్ణ యించిన గడువు లోగానే నష్టాల్లో కూరుకుపోయిన పీఎస్‌యు కంపెనీలు లేదా మూతపడిన కంపెనీల ఆస్తులు విక్రయిస్తామ ని చెప్పారు. దీనికి కొత్తగా రివైజ్డ్‌ మెకనిజమ్‌ ప్రవేశ పెట్టి వీలైనంత త్వరగా ఈ ఆస్తులను విక్రయానికి పెడతామన్నారు.
ఆస్తుల విక్రయం కొత్త కాదు : ప్రభుత్వం వద్ద ఉన్న అదనపు భూములను లేదా నిరుపయోగంగా ఉన్న ఆస్తులను విక్రయించి సొమ్ము చేసుకోవడం అనే ఆలోచన కొత్తదేమీ కాదు. ఈ అంశంపై పలు వేదికల పై ఇప్పటికే మేధావులు లేదా ఆర్థికవేత్తలు తమ తమ అభిప్రాయలు స్పష్టం చేశారు. పీఎస్‌యు ఆస్తుల విక్ర యానికి పలువురు మేధావులు మొగ్గు చూపారు. ప్రభుత్వ భూములు, ఆస్తుల విక్రయించడంలోనూ పలు సవాళ్లు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అయితే నిర్మలా సీతారామన్‌ తన ప్రసంగంలో చెప్పినట్లు స్పెషల్‌ పర్పస్‌ వెహకిల్‌ (ఎస్‌పీవీ) అంటే ఏమిటి? ల్యాండ్‌ బ్యాంకుకు దీనికి వ్యత్యాసం ఏమిటి? ప్రభు త్వరంగానికి చెందిన సంస్థల భూముల అమ్మకాలపై ఎలాంటి గైడెన్స్‌ ఉంటుంది? వ్యూహాత్మక పెట్టుబడు ల ఉపసంహరణ ఎప్పడు ఉంటుంది? ఇదంతా ఒక ఎత్తయితే ఆ భూములకు సరైన విలువ కట్టే వ్యవస్థ ఉంటుందా అనే అనుమానాలు మేధావులు, ఆర్థిక వేత్తలు వ్యక్తం చేస్తున్నారు.
పీఎస్‌యు ఆస్తులను విక్రయించడానికి ఆర్థిక మం త్రిత్వశాఖ ఎస్‌పీవీని ఏర్పాటు చేసింది. దీనిపై డిపార్టు మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనే జ్‌మెంట్‌ (దీపం) కార్యదర్శి తుషిన్‌కాంత పాండే తన అభిప్రాయాలను వెల్లడిస్తూ.. ల్యాండ్‌ బ్యాంక్‌ కంటే ఎస్‌పీవీ మెరుగైందని.. ఈ బ్యాంకు పోర్టల్‌లా పని చేస్తుందని వివరించారు. ప్రముఖ ఆర్థికవేత్త నీతిఆయోగ్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ అరవింద్‌ పన గారియా విషయానికి వస్తే ఆయన కూడా ప్రభు త్వం వద్ద అదనంగా ఉన్న ఆస్తులను విక్ర యించి సొమ్ము చేసుకోవాలని సూచిస్తుంటారు. గతంలో గనులు, స్పెక్ట్రమ్‌ ఎలా వేలం వేశామో ప్రభుత్వ భూములను కూడా అలానే వేలం వేస్తే చాలని ఆయన సూచించా రు. ఇక భూముల విక్రయం విషయానికి వస్తే ప్రభుత్వరంగానికి చెందిన కంపెనీల భూములు విక్ర యించడం కొంచెం సంక్షిష్టమే. ఈ కంపెనీల చేతిలో పెద్దమొత్తంలో భూములున్నాయి. చాలా వరకు ఈ కంపెనీలు నష్టాల్లో కూరుకుపోవడం వల్ల మూత పడ్డాయి. ఈ కంపెనీలను కొనుగోలు చేయడానికి ఏ కొనుగోలుదారు ఇప్పటి వరకు ముందుకు రాలేదు. ఈ కంపెనీలు కొనుగోలు చేయాలంటే ఆ విలువైన భూములను చూసి కొనుగోలు చేయాల్సిందే.
అసలు సమస్య ఇక్కడే… : మూతపడ్డ ప్రభుత్వ రంగానికి చెందిన ఆస్తులు లేదా భూములు విక్రయిం చాలంటే చాలా కష్టం. దీనికి కూడా ఒక తరుణోపా యం చెప్పారు పనగారియా. ఆయన ఇస్తున్న సలహా ఏమిటంటే ప్రభుత్వ రంగానికి చెందిన కంపెనీల భూములను విక్రయించాలంటే ముందుగా ప్రభు త్వం నిర్వ#హస్తున్న ల్యాండ్‌ బ్యాంక్‌లకు ఈ భూము లను బదిలీచేయడం. ఈ భూములు ల్యాండ్‌ బ్యాంకు కు తరలిస్తే.. పీఎస్‌యు లేదా ప్రభుత్వ రంగానికి చెందిన కంపెనీ చేతిలో ఎలాంటి ఆస్తి ఉండదు. కాబట్టి ఈ కంపెనీని మూసివేడయం చాలా సులభ మని పనగారియా చెప్పారు. అలాగే లాభాలను ఆర్జి స్తున్నపీఎస్‌యూల చేతిలో కూడా పెద్ద మొత్తంలో మిగులు భూములున్నాయి. పలుదఫాలుగా ప్రభుత్వం ఈ కంపెనీలకు భూములు కేటాయించ డంతో పెద్దమొత్తంలో ఈ కంపెనీల వద్ద భూములు పేరుకు పోయాయి. అయితే పీఎస్‌యు కంపెనీని ప్రైవేటైజేషన్‌ చేస్తే.. అదనపు భూములు విలువను కావాలని తగ్గించి చూపే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనికి మళ్లిd పరిష్కారం అదనపు భూములను ప్రభుత్వం నిర్వహస్తున్న ల్యాండ్‌ బ్యాంకుకు బదిలీ చేయడమే. దీంతో పీఎస్‌యు కంపెనీ ప్రైవటేజేషన్‌ కూడా సులభతరం అవుతుందని పనగారియా అన్నారు. కాబట్టి ప్రభుత్వం ల్యాండ్‌ బ్యాంక్‌ వద్ద ఉన్న భూములను ఎప్పటికప్పడు ప్రత్యే కంగా వేలం వేయాలనేది పనగారియా సలహా. దీంతో పాటు ఆయన చెప్పేదేమిటంటే ఈ ల్యాండ్‌ బ్యాంక్‌ను ఖాళీ ఉంచకుండా బ్యాంక్‌లో జమ అయిన భూములను ఎప్పటికప్పుడు విక్రయించాలని, ఈ భూములను దీర్ఘకాలంపాటు నిరుపయోగంగా ఉంచడంవల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదనేది ఆయన అభిప్రాయం. ముందుగా ఈ భూములు మార్కెట్లోకి తీసుకొచ్చి వినియోగంలోకి తెస్తేనే ప్రయోజనం ఉంటుందంటున్నారు పనగారియా.
అసలు సవాళ్లు ప్రభుత్వానికి తెలుసు.. : అయితే ప్రభుత్వ రంగానికి చెందిన ఆస్తులు విక్రయించడం లో ఉన్న సవాళ్ల గురించి ప్రభుత్వానికి తెలియనిదేమీ కాదు. ఇక్కడ భూముల విషయానికి వస్తే రెండు రకా ల భూములుంటాయి. ప్రభుత్వరంగానికి చెందిన కంపెనీలు (సీపీఎస్‌ఈ) చేతిలో ప్రభుత్వ భూములు ఉన్నాయి. మళ్లిd ఈ సీపీఎస్‌ఈ భూముల విషయానికి రెండు విభాగాలు విభజించాల్సి ఉంటుంది. ఒకటి లిస్టెడ్‌ కంపెనీలు, మరోటి అన్‌లిస్టెడ్‌ కంపెనీలు. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసం#హరణ అమలు చేయాలనుకున్నప్పుడు లిస్టెడ్‌.. అన్‌లిస్టెడ్‌ కంపెనీల వద్ద నిరుపయోగంగా ఉన్న ఆస్తులను విక్రయించు కొనే వెసులుబాటు ఉంటుంది. కాగా నవంబర్‌16, 2020లో ప్రపంచబ్యాంకుతో దీపం (డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అస్సెట్‌ మేనేజ్‌ మెంట్‌) ఒక ఒప్పందాన్ని కుదర్చుకుంది. నిరుప యోగంగా ఉన్న ఆస్తుల విక్రయానికి ఒక ఫ్రేంవర్కు కు లోబడే విక్రయాలు జరుపుతామనేది దీని ప్రధాన ఉద్దేశం. వాస్తవానికి ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం ఏమి టంటే పీఎస్‌యుల వద్ద ఉన్న అదనపు భూములు విక్రయించి.. ఆ భూములను ఉపయోగంలోకి తేవా లనేది ప్రధాన ఉద్దేశం. దీంతో పాటు పీఎస్‌యు కంపెనీలు కూడా తమ వద్ద ఉన్న ఆస్తులను విక్రయిం చుకొనే అధికారాన్ని కట్టబెట్టింది ప్రభుత్వం. వచ్చిన డబ్బుతో సంస్థను అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం. అయితే ఇక్కడా ఒక తిరకాసుంది. ప్రభుత్వరంగానికి చెందిన కంపెనీల ఆస్తుల విక్రయిం చడం ద్వారా వచ్చే డబ్బు కంపెనీకి వెళుతుంది. ప్రభుత్వ ఖజానాలో జమకాదు. అదే ప్రభుత్వ భూములు విక్రయిస్తే మాత్రమే ఆ డబ్బు ప్రభుత్వ ఖాతాలో జమ అవుతుంది.
స్పష్టత కొరవడింది? : బడ్జెట్‌ ప్రసంగంలో నిర్మలా సీతారామన్‌ నిరుపయోగంగా ఉన్న భూములు విక్ర యించి రెవెన్యూను పెంచుకుంటామని చెబుతున్నా రు. దానిపై మరింత స్పష్టత రావాల్సి ఉంటుంది. సేకరించిన నిధులు ఏ ఖాతాలోకి పోతాయి. ఈ నిధు లను ఎవరూ నిర్వహస్తారు. ఒక వేళ పీఎస్‌యులే తమ ఆస్తులను విక్రయించాలని ముందుకొస్తే.. దీనికి నోడల్‌ మంత్రిత్వశాఖ అనుమతులు తీసుకోవాలా? లేక వీటిని దీపం చక్కబెడుతుందా.. అలాగే రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వరంగానికి చెందిన కంపెనీలున్నా యి. వాటికి పైన తెలిపిన నిబంధనలే వర్తిస్తాయా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇవన్నీ ఒక ఎత్తయితే సేకరించిన నిధులను మౌలికరంగం అభి వృద్ధిపై వ్యయం చేస్తుందా? లేక సంక్షేమానికా? లేదా ప్రభుత్వరంగానికి చెందిన సంస్థలను మరింత బలోపేతం చేయడానికి వినియోగిస్తుందా అనే దాని పై స్పష్టత రావాలి. ఇన్ని అడ్డంకుల మధ్య ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం నేరవేరుతుందా లేదా అనేది కాలమే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement