Wednesday, November 20, 2024

అతి ప్రైవేటీక‌ర‌ణ ప్ర‌మాద‌క‌రం…

భారతదేశంలాంటి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ లో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలు క్రియాశీ ల పాత్రను పోషిస్తాయి. అయితే, దేశ ఆర్థికవ్యవస్థ సమగ్రంగా ముందుకెళ్లా లంటే ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలు రెం డు సమపాళ్లలో ఉండాలి. ఈ మధ్య కాలంలో ఎన్‌డిఏ. ప్రభుత్వం ప్రైవేటీక రణపై ఎక్కువ మొగ్గు చూపడం, నిధుల సమీక రణకై ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రభుత్వ వాటా ను ప్రైవేటీకరించడం జరుగు తుంది. అర్థ శాస్త్రంలో ప్రైవేటీకరణ అంటే రాష్ట్ర లేదా ప్రభుత్వ రంగం చేతిలో ఉన్న ఒక సంస్థ లేదా కార్యకలాపా లను ప్రైవేటు రంగానికి బదిలీ చేయడమే. ప్రైవేటీ కరణ ప్రాథమిక లక్ష్యం, స్వేచ్చా éమార్కెట్‌, ఆర్థిక వ్యవస్థలో రాష్ట్ర జోక్యాన్ని తగ్గించడంగా చెప్ప వచ్చు. ప్రైవేటీకరణలో పభుత్వ సంస్థలు, ప్రైవేట్‌ సంస్థలపాత్రలు, బాధ్యతలలో మార్పులు ఉంటా యి, ఇది ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు రంగానికి అమ్మడం మాత్రమే కాదు. ప్రైవేటీకరణ అనేది మూడు ప్రధాన మార్గాల్లో నిర్వ#హంచగల ఒక ప్రక్రియ. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటురంగానికి అమ్మడం, ప్రైవేటు సంస్థలచే ప్రభుత్వ వస్తుసేవల నిర్వ#హణ, ఒక ప్రైవేట్‌ సంస్థ నుండి సేవలను రాష్ట్రాల ద్వారా కొనుగోలు చేయడం.
ఇటీవల కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను సాధ్య మైనంత వరకు ప్రైవేటీకరిస్తామని, అందుకు వీలుపడనివాటిని మూసేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ తెలిపారు. అంతేకాకుండా, 2020-21 బడ్జెట్‌ సవరించిన అంచనాల ప్రకారం పెట్టుబడుల ఉప సంహరణ ద్వారా రూ.2.10 లక్షల కోట్లు సేకరిం చాలని లక్ష్యంగా పెట్టుకుంటే రూ.32వేల కోట్లే వచ్చాయని, కొవిడ్‌ కారణంగా నెలకొన్న ప్రతికూ ల పరిస్థితులు పెట్టుబడుల ఉపసం హరణపై తీవ్రప్రభావం చూపాయని ఠాకూర్‌ పేర్కొన్నారు. అయితే, ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యాన్ని చేరుకోవ డానికి భారత్‌కు నిధులు సమీకరించాలనే ఉద్దే శ్యంతో, నూతన ప్రభుత్వరంగ సంస్థల విధానా న్ని ఖరారుచేసి అన్ని నాన్‌ స్ట్రాటజిక్‌, స్ట్రాటజిక్‌ రంగాల్లో పెట్టుబడుల ఉపసం హరణకు మార్గ సూచీని కేంద్రం విడుదల చేసింది. దేశంలో ఇప్పు డు అన్ని ప్రధాన పబ్లిక్‌ సంస్థలైన ఇన్సూరెన్స్‌, రైల్వే, పెట్రోలియం, బ్యాంకింగ్‌, విశాఖ ఉక్కు, కమ్యూనికేషన్‌ సంస్థలు ప్రయివేటీకరణ అనే గొడుగు కిందికి నెట్టివేయబడుతున్నాయి. అయి తే ప్రభుత్వరంగసంస్థలను ప్రైవేట్‌ పరం చేయడం వెనుకగల ప్రధానకారణం నిర్వా హణ వ్యయం తగ్గించుకోవడం, నష్టాలనివారణ, ఉత్పాదకత ను గరిష్టంచేయడం లాంటివి ప్రభుత్వం చూపెట్టి నప్పటికీ వాస్తవానికి నిధుల సమీకరణ, కార్పొ రేట్‌ శక్తులకు పీఎస్‌యూలను అప్పగించడమేన ని చెప్పాలి. ప్రైవేటీకరణకు అధి క ప్రాధాన్యత ఇస్తే గుత్తాధిపత్యం పెరుగడం, జవాబుదారీతనం లోపించడం, నిధుల దుర్వినియోగం, ప్రాంతీ య, ఆదాయ అసమానతలు, ప్రజల సంక్షేమం కొరవడడంలాంటి సమస్యలు ఉత్పన్నమై ప్రభు త్వాలు ప్రేక్షక పాత్ర వహించాల్సి వస్తుంది. లాభా ర్జనే ధ్యేయంగా ఉండటంతో ప్రజల శ్రేయస్సు కనుమరుగవుతుంది. ప్రైవేటీకరణ వల్ల ప్రభుత్వా నికి అమ్మకపు ఆదాయం వచ్చినప్పటికీ భవిష్యత్‌ లో డివిడెండ్‌ ఆదాయాలు మాత్రం ఉండవు. ఏది ఏమైనా, ప్రైవేటీకరణ విదేశీ పెట్టుబడులను ఆకర్షిం చేలా ఉండాలే గాని, విదేశీయులు, కార్పొరేట్‌ శక్తులు దేశ ఆర్థిక వ్యవస్థను శాషిం చేలా ఉండకూడదు.

  • డాక్ట‌ర్ ఎం డి ఖ్వాజా మెయినొద్దీన్
Advertisement

తాజా వార్తలు

Advertisement