Wednesday, November 6, 2024

Editorial : స్వప్రయోజనాల కోసం కోర్టులపై ఒత్తిడి!

వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు న్యాయస్థానాలపైనా, న్యాయమూర్తులపైనా ఒత్తిడి తెస్తున్నారు. ఈ విషయమై ఆవేదన వ్యక్తం చేస్తూ రిటైరైన 21 మంది న్యాయమూర్తులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాశారు. కోర్టులో ఏ రోజు ఏ కేసు విచారణ చేపట్టాలో కూడా వారే సూచిస్తూ, న్యాయ మూర్తులపై ఒత్తిడి తెస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి హానికరమైన పరిణామమని విశ్రాంత న్యాయ మూర్తులు ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. సర్వీసులో ఉండగా వీరంతా అటువంటి ఒత్తిళ్లకు లోనైన వారే.

- Advertisement -

ఇప్పుడు రిటైరయ్యారు కనుక, ఆ విషయంపై బహి రంగంగా తమ ఆవేదనని వ్యక్తం చేశారు. న్యాయ స్థానాల్లో ఏ కేసు ఎప్పుడు విచారణకు చేపట్టాలనే విషయంలో ఒక పద్దతి ఉంటుంది. దాని ప్రకారమే జరుగుతుంది. కానీ, రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం కోర్టులపై ఒత్తిడి తెస్తున్నారు. అలా గే, తమ అవసరాల కోసం కేసులను వాయిదా వేయా లని కోరుతూ ఉంటారు. తప్పుడు సమాచారాన్ని వ్యా ప్తి చేసి, బహిరంగంగా అవమానించి, న్యాయవ్య వస్థను తక్కువ చేసి చూపే ప్రయత్నాలు కూడా జరుగు తున్నాయని రిటైర్డ్‌ న్యాయమూర్తులు ఆందోళన వ్యక్తం చేశారు. నేటి రాజకీయ నాయకులు తమ అవసరాలే ప్రధానంగా కోర్టులపై ఒత్తిడి తెస్తున్నారు. ఢిల్లిd ముఖ్య మంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు, జైలులో ఉంచడంపై ఈ మధ్య ఆమ్‌ ఆద్మీపార్టీ (ఆప్‌) నాయకులు బహి రంగంగా చేసిన విమర్శలను దృష్టిలో ఉంచుకుని రిటైర్డ్‌ న్యాయమూర్తులు చీఫ్‌ జస్టిస్‌కి ఈ లేఖ రాసినట్టుగా స్పష్టం అవుతోంది. కేజ్రీవాల్‌ విషయంలోనే కాదు… ప్రతిపక్షాలకు చెందిన ప్రముఖ నాయకులు ఎవరు అరె స్టు అయినా, వారికి మద్దతుగా ఇదే మాదిరి విమర్శల దాడి జరుగుతోంది.

న్యాయస్థానాలు రాజ్యాంగానికి లోబడి పని చేస్తాయి. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ పెక్కు సందర్భాల్లో స్పష్టం చేశారు. కేసుల విచారణ ప్రాధాన్యత విషయంలో కూడా కొన్ని ప్రామాణికాలను బట్టి కోర్టులు పని చేస్తాయని కూ డా ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగమే తమకు ప్రమా ణమనీ, ఎవరికో అనుకూలంగానో, ప్రతికూలంగానో తీర్పులు చెప్పడమనేది ఉండదని ఆయన చెప్పిన సందర్భాలున్నాయి. అయినప్పటికీ తమకు అనుకూ లమైన తీర్పులు వస్తే పొగడటం, ప్రతికూల తీర్పులు వస్తే విమర్శించడం ఇటీవల కాలంలో ఎక్కువైందని విశ్రాంత న్యాయమూర్తులు లేఖలో పేర్కొన్నారు. తమ కేసులను విచారణకు చేపట్టే న్యాయమూర్తులపై పరోక్షంగా విమర్శలు చేసే రాజకీయ నాయకులు కూడా ఈ మధ్య తయారవుతున్నారు. రాజకీయ నాయకులు న్యాయస్థానాలపై విమర్శలు చేసేందుకు, తీర్పులపై బహిరంగంగా స్పందించేందుకు గతంలో వెనకాడే వారు. ఇప్పుడు అటువంటి సంకోచాలేవీ లేకుండా ఎవ రికి తోచినట్టుగా వారు మాట్లాడుతున్నారు. రాజ్యాంగం ప్రసాదించిన వాక్‌ స్వేచ్ఛను దుర్వినియోగపరుస్తున్నా రని ప్రధాన న్యాయమూర్తికి ఇటీవల కొందరు ఫిర్యాదు చేశారు. న్యాయస్థానాలు వెలువరించే తీర్పులపై వ్యా ఖ్యానించేందుకు ఎవరైనా స్వయం నియంత్రణ పాటిం చడం అత్యవసరం. తమకు అనుకూలంగా తీర్పులు రాలేదన్న ఉక్రోషంతో విమర్శలు, వ్యాఖ్యలను చేసే ధోర ణిని తగ్గించుకునేందుకు రాజకీయ నాయకులు ప్రయత్నించాలి.

ఈ విషయమై దాదాపు ఐదు దశాబ్దాల క్రితమే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కోకా సుబ్బారావు న్యాయవాదుల సంఘం సమావేశం లో ప్రసంగిస్తూ సంయమనాన్ని పాటించడం న్యాయ వాదులకే కాకుండా, రాజకీయాల్లో ఉన్న న్యాయ వాదులకూ అవసరమని స్పష్టం చేశారు. మన దేశంలో ప్రసిద్ధి చెందిన రాజకీయ నాయకులంతా, ముఖ్యంగా తెలుగురాష్ట్రాల్లో పేరెన్నిక గన్న రాజకీయ నాయ కులం తా న్యాయవాద వృత్తి నుంచి వచ్చిన వారే. అంతెందు కు రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేద్కర్‌ కూడా న్యాయ వాద వృత్తినుంచి వచ్చిన వారే. వారంతా వ్యవస్థలో ఉన్న లోపాలను చక్కదిద్దేందుకు ప్రయత్నించారే తప్ప న్యాయస్థానాలను తగ్గించి మాట్లాడలేదు. ఇటీవల మన దేశంలో రాజకీయ నాయకులు కొందరు రాజ్యాంగాన్ని మార్చేస్తారంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజ్యాంగాన్ని మార్చడం అంత సులభం కాదని, అంబేద్కరే తిరిగి వచ్చినా, రాజ్యాంగాన్ని మార్చలేరని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. అందువల్ల తమ ప్రయోజనాలకు ఆటంకంగా ఉందనో, లేక అనుకూలంగా లేదనో న్యా యస్థానాలపైనా, తీర్పులపైనా వ్యాఖ్యలు చేయడం ఆమోదకరం కాదు. తీర్పుల పట్ల అసంతృప్తి ఉంటే అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. అంతే తప్ప న్యా యస్థానాలను తక్కువ చేసి మాట్లాడరాదన్నదే విశ్రాంత న్యాయమూర్తులు చీఫ్‌జస్టిస్‌కి రాసిన లేఖ సారాంశం.

Advertisement

తాజా వార్తలు

Advertisement