Wednesday, November 20, 2024

బాల్‌థాకరే చుట్టూ రాజకీయం!

దేవేంద్ర ఫడ్నవీస్‌ మహరాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక టరమ్‌పని చేసి అదే రాష్ట్రానికి ఇప్పుడు ఉపముఖ్య మంత్రిగా కొనసాగుతున్నారు. పార్టీ కోసం ఆయన చేసిన త్యాగం వృధా కాలేదు.ఇటీవల పార్టీఅత్యున్నత విధాన నిర్ణాయక వేదిక పార్లమెంటరీ బోర్డులో స్థానం లభించిం ది. ఒక్క మాటలో పార్టీకి సంబంధించి మహారాష్ట్రలో ఆయనే నాయకుడు. ఇంతవరకూ నితిన్‌ గడ్కరీ ఆ స్థానంలో ఉండేవారు. దేవేంద్ర ఫడ్నవీస్‌ సౌమ్యుడు, ఆవేశ పరుడు కాదు.ఆవేశానికిపెట్టింది పేరయిన శివసేన నాయకులతో ఆయన సర్దుకుని పోతూ ఐదేళ్ళ పాటు ముఖ్యమంత్రి పదవిని నిర్వహించాడు.ఇప్పడు రాష్ట్రం లో రాజకీయ సమీకరణాలు మారినా, ఆయన అలవాటు కొద్దీ శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ థాకరేని పొగడటం మొదలు పెట్టారు.బాల్‌థాకరే ప్రవేశపెట్టిన సంస్కృతీ, సంప్రదాయాలను తమ ప్రభుత్వం కొనసాగిస్తుందని ఆయన ఇటీవల చేసిన ప్రకటన విమర్శలకు గురి అయిం ది. బాల్‌థాకరే కుమారుడు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ థాకరే నేతృత్వంలోని శివసేనలో చీలిక సృష్టించి, తిరు గుబాటు నాయకుడైన ఏకనాథ్‌ షిండేని ముఖ్యమంత్రిగా చేశారు. ఏకనాథ్‌ నేతృత్వంలోని ప్రభుత్వంలోనే దేవేం ద్ర ఫడ్నవీస్‌ ఉపముఖ్యమంత్రిగా పాలనా వ్యవహారాల ను చక్కబెడుతున్నారు. షిండేకి పాలనా వ్యవహారాల్లో పెద్దగా అనుభవం లేదు. అందువల్ల ఫడ్నవీస్‌ అన్ని విష యాల్లో చొరవ తీసుకుంటున్నారు. బహుశా ఆ కారణం గానేమో ఆయన బాల్‌ధాకరే ప్రవేశపెట్టిన సంస్కృతీ సంప్రదాయాలను కొనసాగిస్తామంటూ వాగ్దానం చేసి ఉండవచ్చు. ఇదే విషయాన్ని శివసేన అధికార పత్రిక సామ్నా ఎదురు ప్రశ్నించింది. బాల్‌థాకరే స్థాపించిన శివసేన పార్టీని చీల్చి ఇప్పుడు బాల్‌థాకరే సంస్కృతి సంప్రదాయాలను కొనసాగిస్తామనడమేమిటని సామ్నా దుయ్యబట్టింది. ఆ ప్రశ్న సహేతుకంగానే ఉంది. మహారాష్ట్రలో బాల్‌థాకరే పేరు చెబితేనే శివసేనకైనా, బీజేపీకైనా ఓట్లు పడతాయి.పైగా,సైద్ధాంతికంగా బీజేపీ కన్నా ఎక్కువగా హిందూత్వ సిద్ధాంతాలను ప్రచారం చేసిన పార్టీగా బాల్‌థాకరే పార్టీకి పేరుంది. మరాఠీ ప్రజల భావోద్వేగాలపై బాల్‌థాకరే ఆ పార్టీని నిర్మించారు. అందువల్ల మరాఠీ ప్రజల ఓట్లు పొందాలంటే బాల్‌ థాకరే జపాన్ని ఎవరైనా చేయాల్సిందే. అందుకే, దేవేం ద్రఫడ్నవీస్‌ బాల్‌థాకరే పేరును పదే పదే ఉచ్చరిస్తున్నా రు. అయితే, బాల్‌థాకరే కుమారునిగా ఆయన పేరునూ, లెగసీనీ సొంతం చేసుకునే హక్కు తనకు మాత్రమే ఉందని ఉద్ధవ్‌ థాకరే వాదిస్తున్నారు.పార్టీ చిహ్నమైన బాణం గుర్తు కోసం సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. బాల్‌థాకరేతో పూర్వపు బీజేపీ నాయకులకు సత్సంబం ధాలు ఉండేవి. ఆయనకు ఆ పార్టీ అగ్రనేతలు వాజ్‌పేయి, అద్వానీలు ఎక్కువ గౌరవం ఇచ్చేవారు. బాల్‌థాకరే అలిగినప్పుడు ఆయనకు నచ్చజెప్పేందుకు అద్వానీని వాజ్‌పేయి ముంబాయి పంపేవారు. ఆయన తదనంత రం పార్టీ పగ్గాలు చేపట్టిన ఉద్ధవ్‌ థాకరేకి జనాకర్షణ శక్తి లేదని ఎన్నికల ఫలితాలతో తేలిపోవడంతో కమలనాథు లు కూటమి నాయకత్వం తమకే కావాలని పట్టుపట్టారు. గత అసెంబ్లిd ఎన్నికలలోనూ, అంతకుముందు పార్లమెం టు ఎన్నికల్లోనూ మహారాష్ట్రలో బీజేపీ-సేన కూటమి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆకర్షణ శక్తి కారణంగానే ఎక్కువ సీట్లు సాధించిందనేది కమలనాథుల వాద న. మరాఠీల భావోద్వేగం కారణంగానే బీజేపీ మహారాష్ట్ర లో పుంజుకోగలిగిందనీ, అందువల్ల కూటమి నాయక త్వం తమకే దక్కుతుందన్నది ఉద్ధవ్‌ థాకరే వాదన. బీజేపీ నాయకత్వం తన అభ్యర్థనను ససేమిరా అనడంతో మరాఠా స్ట్రాంగ్‌ మ్యాన్‌గా పేరొందిన ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ వ్యూహంలో భాగంగా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌, పార్టీలు మహారాష్ట్ర అగాఢీ అనే కూటమిని స్థాపించారు. ఈ కూటమి ప్రభుత్వానికి కమ్యూనిస్టుల మద్దతుకూడాఉంది. దీనిని కమలనాథులు సహించలేక పోయారు. ఉద్ధవ్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఏక నాథ్‌ షిండేని తమ వైపునకు తిప్పుకుని చీలిక వర్గాన్ని ప్రోత్సహించారు. బీజేపీ నాయకులు ఇప్పుడు బాల్‌ థాకరే పేరు చెప్పుకుని ప్రజలను ప్రసన్నం చేసుకోవడాని కి ప్రయత్నించడం ఏ విధంగా సమర్ధనీయమని శివసేన ప్రశ్నిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పట్ల జనాకర్ష ణ శక్తి కారణంగా ఎక్కువ స్థానాలు సంపాదించుకున్నా మని గొప్పలు చెప్పుకున్న కమలనాథులు ఇప్పుడు మోడీపై జనానికి మోజు తగ్గిన కారణంగానే బాల్‌థాకరే భజన చేస్తున్నారా అని కూడా సామ్నా ప్రశ్నించింది. మహారాష్ట్రలో ఏ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బాల్‌థాకరే బొమ్మతోనే ఈ రెండు వర్గాలు ప్రజల వద్దకు వెళ్తాయని స్పష్టం అవుతోంది. అది సహజమే కానీ, శివసేన చీలిక వర్గంతో పొత్తు పెట్టుకున్న జాతీయ పార్టీ బీజేపీ కూడ బాల్‌థాకరే పేరుతోనే ఓట్లు అడగడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement