Friday, November 22, 2024

హనీట్రాప్‌లో మన రక్షణ!

బాహ్య శత్రువుల కన్నా అంత:శత్రువులే ప్రమాద కారులు మన దేశంలో అంతశత్రువులకు కొదవలేదు. ఆనాడు పృధ్వీరాజ్‌కి వ్యతిరేకంగా జయచంద్రుడు శత్రు వులకు సమాచారాన్ని అందించినట్టు చరిత్రలో చదవుకున్నాం. రక్షణ రహస్యాలు లీక్‌ అవుతున్నప్పుడు విద్యార్దులప్రశ్న పత్రాలు లీక్‌ కావడం ఆశ్చర్యం ఏమీ లేద ని ఇటీవల జోక్‌లు వినిపిస్తున్నాయి. రక్షణ రహ స్యాలను లీక్‌ చేసే ప్రబుద్ధులు స్వతంత్ర భారత దేశంలో కూడా ఉన్నారని ఇప్పటికి చాలా సార్లు రుజువైంది.తాజాగా డిఆర్‌డిల్‌లో కాంట్రాక్టు ఇంజనీర్‌ఒకరి ఉదంతం వెలుగులోకి వచ్చింది. హానీ ట్రాప్‌ అనే పేరు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తోంది.అత్యంత కీలకమైన రహస్య సమాచారాన్నిరాబట్టేందుకు శత్రువులు అమ్మాయిలను ప్రయోగిస్తున్నారు.దానినే హానీ ట్రాప్‌ అని పిలుస్తు న్నారు. మన దేశ క్షిపణి అభివృద్ది కార్యక్రమ రహస్యా లను ఆ ఇంజనీర్‌ తాను బ్రిటన్‌లో డిఫెన్స్‌ జర్నల్‌లో పని చేస్తున్నానని చెప్పుకున్న ఆ పాక్‌ గూఢచారికి రెండేళ్ళ నుంచి అందించినట్టు రాచకొండ పోలీసుల దర్యాప్తులో తేలింది.ఆ ఇంజనీర్‌ 2019 నుంచి2021 వరకూ క్షిపణుల్లో ఉపయోగించే పరికరాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఆమెకు అందించినట్టు దర్యాప్తులో తేలింది. తన పేరు నటాషా రావు అని చెప్పుకున్న ఆ యువతి సామాజిక మాధ్యమాల ద్వారానే అతడి నుంచి సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తోంది. అయితే, డిఆర్‌ డిఎల్‌లో పని చేసే శాస్త్రవేత్తలు,ఇంజనీర్లు ఈ విషయాన్నిఎందుకు పసిగట్టలేకపోయారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తన తండ్రి భారత వైమానిక దళంలో పని చేశారనీ,అప్పట్లో తాము బెంగళూరులో ఉండేవారమని ఆమె ఆ ఇంజనీర్‌కి తెలియజేసింది. ఆమె కోరిన సమాచారాన్ని మాత్రమే కాకుండా కొన్ని ఛాయా చిత్రాలను కూడా ఆ ఇంజనీర్‌ ఆమెకు పంపినట్టు దర్యాప్తులో వెల్లడైంది.అయితే, తెలుగువాడైన ఆ ఇంజనీర్‌ ఏ జిల్లాకి చెందిన వారో, ఎక్కడ చదివారో వివరాలు తెలియరాలేదు. పాక్‌ రహస్య గూఢచార సంస్థ (ఐఎస్‌ఐ) తరఫున మన దేశంలో చాలా మంది ఏజెంట్లుగా, స్లీపర్‌ సెల్స్‌గా పని చేస్తున్నారు. బయటపడిన కేసులు మాత్రమే మనకు తెలుస్తున్నాయి. దాదాపు ఏడాది క్రితం గత సంవత్సరం జూలైలో బికనీర్‌ కి చెందిన హబీబూర్‌ రెహమాన్‌ అనే పాక్‌ గూఢచారిని అరెస్టు చేశారు. పోఖ్రాన్‌లోని ఆర్మీ బేస్‌ క్యాంపు నుంచి అతడురహస్య సమాచారాన్ని పాకిస్తాన్‌కి చేరవేసినట్టు పోలీసులు గుర్తించారు.

పాక్‌ గూఢచారులకు అతడు కొన్ని మ్యాపులను, కోడ్‌ సమాచారాన్నికూడా అందిం చినట్టు దర్యాప్తులోతేలింది.అతడికి పంకజ్‌ కౌర్‌ అనే కానిస్టేబుల్‌ ఈ సమాచారాన్ని అందజేసినట్టు తెలియ వచ్చింది.ఆగ్రా కంటోన్మెంట్‌లో పని చేస్తున్న కౌర్‌నికూడా అరెస్టు చేశారు.రెహమాన్‌ బంధువులు పాక్‌లోని సింధ్‌లో నివసిస్తున్నారనీ, వారిని కలుసు కోవడానికి అతడు తరచూ వెళ్తుంటాడనీ,ఆర్మీ బేస్‌ క్యాం ప్‌కి కూరగాయలు సరఫరా చేసే హబీబూర్‌ రెహమాన్‌ కౌర్‌ ద్వారా సమాచారాన్ని సేకరించి సింధ్‌ వెళ్ళినప్పుడు ఐఎస్‌ఐ అధికారులకు అందజేసేవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.అలాగే, గత ఏడాది అక్టోబర్‌లో ఆంధ్రప్రదేశ్‌ పోలీసు కౌంటర్‌ ఇంటిలిజెన్స్‌ విభాగం, గుజరాత్‌ పోలీసులు కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో నావికా దళంలో రహస్యంగా సమాచా రాన్ని పాక్‌ ఏజెంట్లకు చేరవేస్తున్న ఐదుగురిని అరెస్టు చేశారు. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నారు.అలాగే, 2019లో ఆంధ్రప్రదేశ్‌ పోలీసు కౌంటర్‌ ఇంటిలిజెన్స్‌ నెట్‌వర్క్‌ పోలీసులు ఒక రహస్య గూఢచార ముఠా కార్యకలాపాలను పసిగట్టారు. మన నౌకలను,సబ్‌ మెరైన్లను ఎక్కడ నిలుపుతారో సంబంధించిన సమా చారాన్ని ఆ ముఠా సభ్యులు ఐఎస్‌ఐకి అందజేశారు. రహస్యగూఢచర్యంకేసులో పేరు మోసిన నంబి నారా యణ్‌ కేసు ఇప్పటికీ మన స్మృతి పథంలోనే ఉంది. అయితే, కొన్ని కేసులు కట్టుకథలుగా తేలాయి. ఇస్రోలో సైంటిస్ట్‌ గా పని చేసిన నంబినారాయణ్‌పై కేసులు సీబీఐ దశాబ్దాలతర్వాత ఆయనకు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది.అయితే, నారాయణన్‌ ఉన్నత స్థాయిలో వారిని ప్రభావితం చేసి క్లీన్‌ చిట్‌ తెచ్చుకున్నారన్న ఆరోపణలు కూడాఉన్నాయి. ఇలాంటి కేసుల్లో వాస్తవాలు వెలుగులోకి రాకుండా అధి కారంలో ఉన్న వారు దాచి పెట్టడం వల్ల కేసులు తు స్సుమంటున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. కీలక రహస్యాలను పాక్‌ గూఢచారులకుఅందించిన సంఘ టనలన్నీ నౌకాదళంలోనే ఎక్కువగా చోటు చేసుకున్నాయి. ఇప్పుడు అణు రహస్యాలను డిఆర్‌డిఎల్‌ శాస్త్రవేత్త పాక్‌ యువతి విసిరిన హానీ ట్రాప్‌లో చిక్కుకుని అందించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement