కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గతేడాది భారత జోడో యాత్ర విజయవంతం కావడంతో ఈనెల 14వ తేదీన జోడోన్యాయయాత్రను ప్రారంభించారు. మణిపూర్ నుంచి ఈ యాత్రను ఆయన ప్రారంభించడం వ్యూహాత్మకమే కావచ్చు. మణిపూర్‌లో జరిగిన ఘటనలపై పార్లమెంటులో తనను మాట్లాడనివ్వలేదన్న కోపం ఆయనకు ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక్కసారైనా మణిపూర్‌ని సందర్శించలేదని ఆయన చాలా సందర్భాల్లో విమర్శించారు.
ఇప్పటికీ విమర్శిస్తున్నారు. మణిపూర్‌లో ప్రారంభమైన ఆయన యాత్ర అసోంలో ప్రవేశించింది. రాహుల్ ఈసారి ఈశాన్య రాష్ట్రాలను ఎంచుకోవడానికి కారణం ఉంది. తమ హయాంలో ఈశాన్య రాష్ట్రాలను బాగా అభివృద్ధి చేస్తున్నట్టు ప్రధాని మోడీ తరచూ ప్రకటించడం ఇందు కు కారణం కావచ్చు. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయి. సరిహద్దు ల్లో ఉన్న ఈశాన్య రాష్ట్రాలకు పొరుగు దేశమైన మయ న్మార్ పౌరులే కాకుండా సైనికులు కూడా చొచ్చుకుని వస్తున్నారు. దీంతో శాంతి భద్రతల పరిస్థితులు ఏర్పడు తున్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చేందు కే రాహుల్ జోడో న్యాయ యాత్రను ప్రారంభించారు. అయితే, అసోం ప్రభుత్వం ఆయన యాత్రను రాజకీ యంగా చూస్తోంది. రాజకీయ లబ్ధి కోసమే రాహుల్ యాత్ర చేస్తున్నారంటూ అసోం ముఖ్యమంత్రి హేమం త్ బిశ్వ శర్మ ఆరోపించారు. రాహుల్ యాత్రకు ఎక్కడి కక్కడ అడ్డంకులు కల్పిస్తున్నారు.
అసోంలో ప్రజాస్వా మ్యం మచ్చుకైనా లేదనీ, ప్రతిపక్షాల వాక్ స్వాతంత్య్రా న్నీ, కదలికలను రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం హరి స్తోందని రాహుల్ ఆరోపిస్తున్నారు. అయితే, రాహుల్‌కి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వ లేక బీజేపీ ప్రభుత్వం ఆయన యాత్రకు ఆటంకాలను కల్పిస్తోందంటూ కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. సోమవారం నాడు అక్కడ అయోధ్యలో బాలరాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరిగిన సందర్భంలోనే రాహుల్ అసోంలో వైష్ణ వ పుణ్య క్షేత్రమైన బతద్రవ ఆలయ సందర్శనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అయోధ్యలో రామజన్మ భూమి ఆలయం ప్రారంభోత్సవం జరుగుతు న్న దృష్ట్యా మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగే ప్రమాదం ఉందని పోలీసులు కారణం చెప్పారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అసోంలో రాహుల్ ఆలయ సందర్శనం చేసినంత మాత్రాన అయోధ్యలో గొడవలు జరుగుతాయా? అంటూ ప్రశ్నిం చారు. దీనిపై కాంగ్రెస్, బీజేపీ వర్గాల మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ శాసనసభ పార్టీ నాయకుడు దేవవ్రత సైకియాపై బీజేపీ నాయకులు చేయి చేసుకున్నారంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గవర్నర్ గులాబ్ చంద్ కటారియా కు ఫిర్యాదు చేసింది.ఈ నేపథ్యంలో మంగళవారం నాడు రాహుల్‌ని గౌహతిలో ప్రవేశించనివ్వకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ కార్యకర్త లు ఆ బ్యారికేడ్‌లను ధ్వంసం చేశారు. దానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే, తాము బ్యారికేడ్‌లను బ్రేక్ చేశాము కానీ, చట్టాన్ని బ్రేక్ చేయలేదని రాహుల్ అన్నారు. తానేమి నేరం చేశానని రాహుల్‌ప్రశ్నించారు. దీనికి పాత కక్షలే కారణం. అసోం ప్రస్తుత ముఖ్యమంత్రి బిశ్వశర్మ గతంలోకాంగ్రెస్‌లో ఉండేవారు. రాహుల్‌కీ, ఆయనకూ సరిపడకపోవడం వల్లనే ఆయన రాహుల్‌పై ఆంక్షలు విధించారన్నది కాంగ్రెస్ నాయకుల కథనం. అది నిజం కావచ్చు. అయితే, 15వ శతాబ్దినాటి బతద్రవ సత్ర ఆలయాన్ని రాహుల్ సందర్శించబోతున్నారన్న సంగతి తెలియగానే విద్రోహ శక్తులు విధ్వంసానికి ప్రయ త్నాలు చేస్తున్నట్టు ప్రభుత్వానికి సమాచారం అందడం వల్లనే రాహుల్‌ని అడ్డుకుంటున్నామని అధికారులు వివరణ ఇచ్చారు. ఏమైనా రాహుల్ అసోం పర్యటన ఉద్రిక్తతలకు దారి తీసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రా ల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాహుల్ యాత్ర అడ్డగింతను నిరసిస్తూ రోడ్లపై బైఠాయింపు జరిపారు. మరో వంక బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు రామమంది రం ప్రారంభోత్సవానికి హర్షం వ్యక్తం చేస్తూ శోభా యాత్రలను నిర్వహించారు. సోమవారం నాడు దేశ వ్యాప్తంగా వివిధ నగరాల్లో ఉద్రిక్తత ఏర్పడింది. రాహు ల్ ఇప్పుడు ఈ యాత్రను కొత్తగా తలపెట్టలేదు. గత నెల లోనే ఈ యాత్ర రోడ్ మ్యాప్‌ని ఎఐసిసి విడుదల చేసింది. రానున్న లోక్‌సభ ఎన్నికలలో ప్రజలను ఆకర్షించేం దుకు ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ ప్రయత్నిస్తున్నాయన్నది యధార్ధం. మంగళవారం కూడా గౌహతిలోకి రాహుల్‌ని రానివ్వకపోవడంతో ఆయన నగర శివార్లలో కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. రాహుల్ పర్యటన తో గౌహతి, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది.