నిత్యం ఉగ్రవాదుల దాడులతో రక్తమోడే కాశ్మీర్లో సినిమా థియేటర్లు తెరచుకోవడం కొత్త చరిత్రకు నాంది. రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అన్న ఈ మాటలు అక్షర సత్యం. ఆదివారం పుల్వామా, షోపియాన్లలో మల్టిప్లెక్స్‌లను ఆయన ప్రారంభించారు. ఈ అవకాశం తనకు లభించినందుకు ఎంతో ఆనందిస్తున్నానని చెప్పా రు. జమ్ము-కాశ్మీర్ విభజన తర్వాత లడఖ్, జమ్మూ- కాశ్మీర్‌లు కేంద్రపాలిత ప్రాంతాలయ్యాయి. కాశ్మీర్లో పరిస్థితి కొంతమేర మెరుగుపడినప్పటికీ, ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే లడఖ్‌లో అగ్గి రాజేయడానికి పాక్ ఉగ్రవాదులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. వారికి పాక్ ఊతం ఇస్తోంది.
లడఖ్‌ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడం వల్ల పాకిస్తాన్‌కన్నా చైనాకే ఇబ్బందులు ఎక్కువ. చైనా నిర్మించే రోడ్లు, ఇతర మౌలిక సదుపాయా లకు లడఖ్ ఆధారం. అందువల్ల లడఖ్‌ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని చైనా జీర్ణించుకోలేకపోతోం ది. జమ్మూలో పరిస్థితి కాస్తంత కుదుటపడుతోంది. అదే సందర్భంలో కాశ్మీర్లో యువకులను పెడదారి పట్టిం చేందుకు పాక్ ఏజెంట్లు స్లీపింగ్సెల్స్గా పనిచేస్తూ ఉగ్రవాద కార్యకలాపాల వైపు వారిని ఆకర్షింపజేస్తున్నా రు. అలాంటివారిని విద్య, శిక్షణవైపు మళ్లించేందుకు యూపీఏ ప్రభుత్వం శ్రీనగర్‌లోను, రాష్ట్రంలోని ముఖ్య నగరాలలోను శిక్షణ కేంద్రాలను ప్రారంభించింది. పాకి స్తాన్ ఉగ్రవాదులు ఆ కేంద్రాలపై కూడా దాడులు జరిపిన సంఘటనలు ఇంకా మన స్మృతి పథంలోనే ఉన్నాయి.
కాశ్మీర్లో ముఖ్యంగా శ్రీనగర్‌లో పరిస్థితి మార్పు కోసం ప్రధాని నరేంద్రమోడీ ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తున్నారు. రాష్ట్రంలో యువతకు ఉపయోగపడే అనేక పథకాలను ప్రవేశపెట్టారు. కాశ్మీర్ ప్రజలను జనజీవన స్రవంతిలో కలిపేందుకు దేశమంతా విడుదలయ్యే చలన చిత్రాలు కాశ్మీర్లో కూడా ఏకకాలంలో విడుదలయ్యేం దుకు సినిమా థియేటర్లు, మల్టిప్లెక్స్‌ల నిర్మాణాన్ని ప్రోత్సహించింది. సినిమా థియేటర్లు అంతకుముందు ఉన్నాయి.
1980 దశకం చివరి వరకు డజనుకుపైగా థియేటర్లలో సినిమాలు ప్రదర్శించేవారు. అయితే, సినిమాహాళ్లను మూసివేయాలని ఉగ్రవాదుల నుంచి తరచూ నేరుగా బెదిరింపులు వచ్చేవి. దాంతో సినీ అభిమానులు థియేటర్లకు రావడానికి సంకోచించారు. ఈ నేపథ్యంలో యాజమాన్యాలు కూడా థియేటర్లు మూసివేందుకు మొగ్గు చూపాయి. 1990 దశకంలో వీటి ని తెరిచేందుకు పలు దఫాలుగా విఫలయత్నాలు జరిగా యి. 1999 సెప్టెంబర్‌లో రాజధాని నగరం శ్రీనగర్ నడి బొడ్డున లాల్చౌక వద్ద ఉన్న రీగల్ సినిమా హాల్‌పై ముష్కరులు దారుణకాండకు పాల్పడ్డారు.
అప్పటి నుంచి దాదాపు 23 ఏళ్లపాటు కాశ్మీరీ ప్రజలు సినిమా వినోదానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. జమ్ము- కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దయిన మూడేళ్ల తర్వాత ఇప్పు డు మళ్లి సినిమా థియేటర్లు తెరుచుకుం టున్నాయి. అయితే, మల్టిdప్లెక్స్‌ల భద్రతపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నప్పటికీ, కేంద్రం, స్థానిక కేంద్రపాలిత అధికార యంత్రాంగం చొరవ తీసుకున్నాయి. అత్యాధునిక మల్టి ప్లెక్స్ – సినిమా థియేటర్లను స్వయంగా నిర్మించాయి. వాటి నిర్వహణపై స్థానిక యువతకు శిక్షణ ఇచ్చాయి. మరోవైపు కాశ్మీర్లో ప్రజాస్వామ్య ప్రక్రియను వేగవం తం చేయడానికి కూడా కేంద్రం ప్రయత్నిస్తోంది.
అసెంబ్లి నియోజకవర్గం పునర్విభజన ప్రక్రియను వడివడిగా జరిపిస్తోంది. కాశ్మీర్లో అసెంబ్లి పునర్విభజన ప్రక్రియ పూర్తి అయితేనే అసెంబ్లి ఎన్నికలు నిర్వహించేం దుకు వీలుటుంది. అలాగే, కాశ్మీర్లో పర్యాటక రంగాన్ని వృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కాశ్మీర్ ప్రధాన ఆదాయ వనరు పర్యాటక రంగమే. ఉగ్ర వాదుల దాడుల వల్ల ఆ రంగం బాగా దెబ్బతిన్నది. రాష్ట్ర విభజన తర్వాత ఈ రంగం క్రమంగా పుంజుకుం టోంది. దీనిని దెబ్బతీయడానికి పాక్ కేంద్రంగా పనిచేసే ఉగ్ర వాదులు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల పుల్వామాలో ను, షోపియాన్లోను దాడులు జరిగాయి.సరిగ్గా ఆ రెండు పట్టణాలలోనే మల్టిప్లెక్స్‌లను ప్రారంభించారు. ఇటీవల కాశ్మీరీ ఫైల్స్ సినిమా జమ్మూ ప్రాంతంలోని యువకుల ను ఆలోచనలు రేకెత్తించాయి.
జమ్మూలో పండిట్ల జీవన స్థితిగతులను దేశవ్యాప్తంగా ప్రజలంతా వీక్షించారు. ఇప్పుడు కాశ్మీర్ల కూడా మల్టిdప్లెక్సులు తెరుచుకు న్నాయి కనుక అక్కడి వారికి కూడా ఈ చిత్రాన్ని వీక్షించే అవకాశం కలుగుతుంది.కాశ్మీర్లో మొట్ట మొదటి ఐనా క్స్ మల్టిdప్లెక్స్ థియేటర్ శ్రీనగర్‌లో ప్రారంభానికి సిద్ధ మైంది. ఇక్కడి సోమ్వార్ ఏరియాలో దీనిని నిర్మించా రు. మొత్తం మూడు థియేటర్లు ఉన్నాయి. 520 మందికి సీటింగ్ సౌకర్యం కల్పించారు. వచ్చేవారం దీనిని ప్రారం భించబోతున్నారు. దేశంలోని మిగతా ప్రాంతా ల ప్రజల మాదిరిగానే ఇక జమ్ము-కాశ్మీర్ ప్రజలు సినిమా వినోదా న్ని ఆస్వాదించబోతుండటం శుభపరిణామం.