జర్మనీలో జరిగిన జి-7 కూటమి శిఖరాగ్ర సమావేశా ల్లో ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై భారత్ వైఖరిని స్పష్టం చేసి ప్రధానమంత్రి నరేంద్రమోడీ అందరి ప్రశంసలు అందుకున్నారు.జి-7 అనేది అభివృద్ది చెందిన దేశాల కూటమి. ఈ కూటమిలో కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, అమెరికాలకు సభ్యత్వం ఉంది.మన దేశానికి ఆహ్వాన సభ్యత్వం ఉంది. ఉమ్మడి సమస్యలపై జి-7 కూటమి చర్చిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకూ జరిగిన సమావేశాలన్నీ భూతాపంపైనే ప్రధానంగా చర్చించా యి. భూతాపం అన్ని దేశాలూ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. ఈ కూటమి 1973 మార్చి 25వ తేదీన ఏర్పడిం ది. ఈసారి జి-7 దేశాల అజెండా రష్యావైపు మళ్ళింది. ఉక్రెయిన్‌పై రష్యాదాడులను ఆపాలని జి-7 కూటమి ముక్తకంఠంతో కోరింది. రష్యాపై మరిన్ని ఆంక్షలను అమలు జేయాలనీ,జి-7 దేశాల కూటమి సభ్యదేశాలకు విజ్ఞప్తి చేశాయి. జి-7 దేశాలన్నిటితో భారత్‌కి సత్సం బంధాలున్నాయి.అదే సందర్భంలో రష్యాతో మన దేశానికి దశాబ్దాలుగా వాణిజ్య, దౌత్య సంబంధాలున్నా యి. రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై జి-7 దేశాలు తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నప్పటికీ ఆయన ఏమాత్రం మెత్తబడటం లేదు. రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేసిన ప్రపంచ దేశాలు ఇప్పుడు బంగారం దిగుమతులను కూడా నిలిపివేయాలని నిర్ణయించాయి. రష్యాను ఒక విధంగా అష్టదిగ్బంధం చేయాలన్న వ్యూహంతోనే అమెరికా అధ్యక్షుడు జోబిడెన్ ఈ విషయమై పిలుపు ఇచ్చారు. ఈ ఏడాది జి-7 కూటమి సదస్సు అజెండాలో వాతావరణ పరిరక్షణ, భూతాపం అంశాలు ఉన్నాయి. వీటిపై మన ప్రభుత్వ వైఖరిని ప్రధాని నరేంద్రమోడీ చాలా స్పష్టంగా తెలియజేశారు. భారత్‌లో క్లీన్ ఎనర్జీపై పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయనీ, సంపన్న దేశాలు ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మోడీ పిలుపు ఇచ్చారు. భారత్‌లో కొత్త ఆవిష్కరణల ఫలితాలను ఎప్పటికప్పుడు ప్రపంచ దేశాలకు అందిస్తు న్నారని తెలిపారు. అలాగే, ప్రజాస్వామ్యానికి పట్టు గొమ్మగా భారత్ నియంతృత్వ పోకడలను దునుమారిం దనీ, దేశంలోప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కాపాడు తోందని మోడీ చెప్పారు.
జి-7 దేశాల కూటమి భారత్‌లో పరిస్థితులను గురించి స్థూలంగా చర్చించింది.ప్రపంచ దేశాల్లో సంభవించే పరిణామాలపై జి-7 స్పందించిన తీరును పరిగణనలోకి తీసుకుని భారత్ ఎప్పటికప్పుడు తన వైఖరిని తెలియజేస్తూ వస్తోంది. అఎn్గానిస్తాన్‌లో, ఇరాక్‌లో గత దశాబ్దంలో చోటు చేసుకున్న పరిణామాల ను జి-7 శ్రద్ధగా పరిశీలించి ఈ పరిణామాల ప్రభావానికి గురి అయ్యే దేశాలకు సాయం అందించే విషయాన్ని ఎప్పటికప్పుడు చర్చిస్తోంది. తాజాగా, రష్యా దాడుల వల్ల కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి అనుసరించాల్సిన వ్యూహాలను జి-7 కూటమి చర్చించిం ది. అమెరికా అధ్యక్షుడు జోబిడెన్ ప్రత్యేకంగా మోడీ వద్దకు వచ్చి కరచాలనం చేయడం ఈ సదస్సులో కొట్టొ చ్చినట్టు కనిపించిన అంశం. అలాగే, వారణాసి తదితర ప్రాంతాల నుంచి తెప్పించిన కళారీతులను జి-7 దేశాల అధినేతలకు బహుమతులుగా అందజేయడం ద్వారా ప్రధానిమోడీ వారిని ఆకట్టుకున్నారు.జి-7కూటమి శిఖరాగ్ర సమావేశాలు ఫ్రాన్స్‌లోని బియార్టిజ్‌లో జరిగిన ప్పుడు కూడా మోడీ ఇదే మాదిరి ఆ కూటమి దేశాల అధినేతలను తన వాదనా పటిమతో ఆకర్షించారు. ఫ్రాన్స్ గత ఏడాది జరిగిన 45వ శిఖరాగ్ర సమావేశాల్లో ఉగ్రవాదం ప్రధానాంశం. జి-7 కూటమిలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాల్లో ఆరోగ్య రక్షణలో సహకారం మరో ముఖ్యమైన అంశం.ఈ విషయంలో భారత్ కరోనా సమయంలో ఇతర దేశాలకు అందించిన సహకారం ప్రస్తానార్హమైంది. అదే సమయంలో అమెరికా ఏకపక్ష ధోరణిని ప్రదర్శించడం కూడా ఒక ఆనవాయితీగా తయారైంది. అనారోగ్యానికి హేతువైన వాయు,జల కాలుష్యాలు విస్తరించడంలో అమెరి కా,దాని మిత్ర దేశాలదే బాధ్యత అన్నవిషయం అన్ని దేశాలకూ తెలుసు. అయితే, తమ దేశం మీద కూటమిలోని ఇతర దేశాలు దాడి చేయకుండా ట్రంప్ తెలివిగా ఇతర అంశా లపై దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నించారు.కిందటి సారి ఇరాన్‌వైపు దృష్టి మళ్ళించే యత్నం చేసినట్టే ఈసారి ఉక్రెయిన్ యుద్దంపై జి-7 దేశాల అధినేతల దృష్టిని మళ్ళించే ప్రయత్నం జరిగింది. అయితే, యీ యుద్దాన్ని తమ దేశం సమర్ధించడం లేదనీ,రష్యాను వెనక్కి తగ్గమ ని ఇప్పటికి పెక్కుసార్లు విజ్ఞప్తి చేయడం జరిగిందని మోడీ జి-7 దేశాల అధినేతలకు స్పష్టం చేశారు. జి-7 దేశాలు ఇలాంటి సమావేశాలు జరపడం, తీర్మానాలు చేయడం తప్ప, వాటిని ఆ సభ్యదేశాలే పాటించడం లేదు. ప్రాంతీయ ప్రత్యేక అభిమానాలు, కుదరని మన స్తత్వా లు ప్రధాన కారణం. తమకు అనుకూలంగా ఉండే దేశాల పట్ల మెతక వైఖరి అనుసరించడం సర్వసాధారణం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.