Friday, November 22, 2024

Editorial : కాశ్మీర్‌పై వెూడీ నిజాయితీ

మూడు దశాబ్దాల నుంచి ఉగ్రవాదుల కార్య కలాపాల కారణంగా అస్తవ్యస్తంగా తయారైన జమ్ము, కాశ్మీర్‌కి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించారు. కాశ్మీర్‌లో క్రమంగా ప్రశాంతత ఏర్పడు తోంది. కాశ్మీర్‌కి రాష్ట్ర హోదా కల్పిస్తామనీ, అసెంబ్లి నియోజకవర్గాల పునర్విభజన పూర్తి కాగానే ఎన్నికలు జరిపిస్తామని,తనను విశ్వసించమని ఆయన ఉద్ధం పూర్‌లో జరిగిన సభలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఆయన మాటల్లో నిజాయితీ కనిపిస్తోంది. ఇంతవరకూ జరిగిన కృషిని పరిశీలిస్తే ఆయన మాటలు నమ్మదగినవిగానే కనిపిస్తున్నాయి. గడిచిన రెండుమూడు సంవత్సరా లుగా కాశ్మీర్‌కి సంబంధించిన ఘోరమైన వార్తలు రావడం లేదు.ఇంతకుముందు పాక్‌ ప్రేరేపిత ఉగ్రవా దుల దాడుల్లో అమాయక కాశ్మీర్‌ ప్రజలు వందల సంఖ్యల్లో ప్రాణాలు విడిచిన ఘటనలు నిత్యకృత్య మయ్యేవి. ఇప్పుడు అక్కడ అలాంటి పరిస్థితులు లేవు. కాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేస్తే కాశ్మీర్‌ కల్లోలమైపోతుం దన్న భయాందోళనలను వ్యక్తం చేసిన వారున్నారు. రాజకీయ వాదుల్లోనే కాక, సాధారణ ప్రజల్లో సైతం అటువంటి భయాలు ఉండేవి. అయితే,కాశ్మీర్‌ విభజన తర్వాత రాష్ట్రంలో గుణాత్మకమైన మార్పు వచ్చింది. బాహ్య ప్రపంచంతో కాశ్మీర్‌కి సంబంధాలు ఏర్పడ్డాయి.

- Advertisement -

అంతకుముందు రెండుపతాకాలు,రెండురాజ్యాంగాల వ్య‌వ‌స్థ‌ వల్ల కేంద్రం తీసుకునే నిర్ణయాలు, చేసే చట్టాలు కాశ్మీర్‌కి వర్తించేవి కావు. ఇప్పుడు దేశమంతటా ఒకే రాజ్యాంగం,దేశప్రజలందరికీ ఒకే తరహా చట్టాలు అమలులో ఉన్నాయి. ఈ తరహా వాతావరణం అక్కడి ప్రజలు భారతీయులందరితో మమేకమయ్యేట్టు చేసింది. కాశ్మీర్‌ను సందర్శించే స్వదేశీ, విదేశీ పర్యాట కుల సంఖ్య పెరిగింది. ఇది గొప్ప మార్పు. అలాగేప్రధాని మోడీ, హోం మంత్రి, ఇతర కేంద్ర మంత్రుల పర్యటన లకు ఎటువంటి అవరోధాలు ఇప్పుడు ఉండ టం లేదు. ఇది కూడా చెప్పుకోదగిన మార్పే. ప్రస్తుతం మోడీ జరుపుతున్నది ఎన్నికల పర్యటన అయినప్పటికీ, వాస్త వ పరిస్థితులకు అనుగుణంగానే మాట్లాడారు. కాశ్మీర్‌ని అద్భుతమైన రాష్ట్రంగా మలిచే పనిలో బిజీలో ఉన్నా మని ఆయన అన్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సైతం ఇటీవల ఆక్రమిత కాశ్మీర్‌ గురించి తరచూ ప్రక టనలు చేస్తున్నారు. అక్కడి ప్రజలు భారత్‌లో విలీనం కావాలని కోరుకుంటున్నారనీ,అది ఎంతో దూరంలో లేదని అంటూ ఆయన ఇటీవల చేసిన ప్రకట న అఖండ్‌ భారత్‌ని కోరుకుంటున్న వారందరికీ చల్లని స మీరంలా అనిపించింది.

ఉగ్రవాదులు ఆక్రమిత కాశ్మీ ర్‌లో దాక్కు న్నా తరిమితరిమి కొడతామని రాజ్‌నాథ్‌ ఇటీవల ప్రకటించారు. ఉగ్రవాదాన్ని అణచివేయడం ముమ్మా టికీ గొప్ప విషయమే. కాశ్మీర్‌లో ప్రకృతి అం దాలే కాక, విస్తారంగా సహజ వనరులు ఉన్నాయి. అమూల్యమై న సహజసంపద ఉంది. వాటిని వెలికి తీసి దేశాభివృద్ధికి వినియోగించేందుకు ఉగ్రవాదుల కార్య కలాపాలు అడ్డంకిగా ఉన్నాయి.అన్నింటి కన్నా హిం దువులకు ఎంతో పవిత్రమైన శారదా మాత ఆలయం ఆక్రమిత కాశ్మీర్‌లోనే ఉంది.దీనిని ఆది శంకరాచార్యుల వారు ప్రతిష్టించారు.కాశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో గత ఏడాది 5.9 మిలియన్‌ టన్నుల లిథియం నిల్వలను కనుగొన్నారు. వీటిని వెలికి తీస్తే ప్రపంచంలో ఈ అమూల్య భూగర్భ సంపద కలిగిన దేశాల్లో భారత్‌ మూడవది అవుతుంది. దీనిని బ్యాటరీల తయారీలో వినియోగిస్తారు. ఆక్రమిత కాశ్మీర్ మన దేశంలో విలీనం అయితే, అమూల్యమైన ఈ భూగర్భ సంపదతో వేలాది మందికి ఉపాధి కల్పించవచ్చు. కాశ్మీర్‌లో ప్రస్తుతం లభిస్తున్న ప్రకృతి వనరులను పూరి గా ఉపయోగించుకుంటే మన దేశం సంపన్న దేశాలతో పోటీ పడే రీతిలో అభివృద్ధిని సాధిస్తుంది.

భూగర్భ శాస్త్ర‌వేత్తలు చాలా కాలం క్రితమే లిథియంను వెలికి తీయా ల్సిన ఆవశ్యకతను స్పష్టం చేశారు.ఉగ్రవాదుల కార్య కలాపాల వల్ల కాశ్మీర్‌లో అడుగు పెట్టడానికి సైనిక దళాలే వెనుకంజ వేసే పరిస్థితులు అప్పట్లో ఉండేవి. కాశ్మీర్‌లో భద్రతాదళాల కోసం పూర్వపు ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయిలు ఖర్చు చేసేవి. కాశ్మీిర్‌లో ప్రాంతీయ పార్టీలు ఉగ్రవాదులతో రాజీ పడి కేంద్రం కేటాయించిన ఆర్థిక వనరులలో కొంత భాగాన్ని ఉగ్రవాదులకు అందించేవి. నేషనల్‌ కాన్ఫరెన్స్‌,పీడీపీలతో కాంగ్రెస్‌,బీజేపీలు జతకట్టి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వాల వల్ల రాష్ట్రానికి మంచి కన్నా, కీడు ఎక్కువ జరిగింది.మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పీడీపీ-బీజేపీల మధ్య పొత్తుతో కొంత కాలం సంకీర్ణ ప్రభుుత్వాన్ని నడిపిం చారు. కానీ, అది విఫలం కావడంతో కాశ్మీర్‌ విభజనే ఏకై క పరిష్కారంగా భావించి పార్లమెంటు చేత బిల్లు ఆమో దింపజేశారు.దీనిపై కొంత వ్యతిరేకత వచ్చినా, పాల పొంగులా అది చల్లారింది. ప్రస్తుతం కాశ్మీర్‌లో సాధా రణ పరిస్థితులు నెలకొ న్నాయి. ఆక్రమిత కాశ్మీర్‌ విలీనం కూడా జరిగితే అఖండ భారత్‌ పునరుద్ధరణ అవుతుంది. ప్రపంచంలో భారత్‌ తలెత్తుకుని నిలిచే పరిస్థితులు ఏర్పడ తాయి. అటువంటి సువర్ణావకాశం రావాలని ఆకాంక్షిద్దాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement