అంతర్జాతీయ ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ తన సుదీర్ఘ ప్రయాణంలో మరోసారి ఎందరికో క్రీడాస్ఫూర్తినిచ్చా డు. అత్యధిక విజయాలు నమోదు చేశాడు. ఖతర్ రాజధాని దోహాలో ఆదివారం జరిగిన ప్రపంచ కప్ ఫుడ్‌బాల్ పోటీల్లో ఫ్రాన్స్‌పై అర్జెంటీనా సాధించిన విజయం ముమ్మాటికీ అతడిదే. ప్రపంచ కప్ పోటీల్లో మూడోసారి ఈ విజయాన్ని అర్జెంటీనా సాధించడంతో ఆ దేశంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. ప్రధాన నగరాల్లో రోడ్లు 24 గంటలతర్వాత కూడా లక్షలాది మంది క్రీడాభిమానులతో కిటకిటలాడాయి. ఈ విజయానికి కారకుడైన మెస్సీపై ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు చూపిస్తున్న అభిమానం అర్జెంటీనా కీర్తిని మరోసారి దింగంతాలకు వ్యాపింపజేసింది. రెండవ విడతలో ఫ్రాన్స్ పుంజుకున్నప్పటికీ ఫలితం దక్కలేదు. క్రీడల్లో క్రికెట్‌కు ఆదరణ ఇప్పుడు బాగా పెరిగినప్పటికీ, ఫుట్ బాల్‌కి ప్రపంచంలోనే అత్యధిక ప్రాచుర్యం పొందిన క్రీడగా పేరొందింది. పిఫా పోటీలు 1930లో ప్రారంభమై నాయి. నాలుగేళ్ళకోసారి జరుగుతాయి. అయితే ప్రపంచ యుద్ధ కాలంలో ఈ పోటీలు జరగలేదు. ఇంతవరకూ ప్రపంచ కప్ గెలిచిన ఎనిమిది దేశాల్లో ఆరు దేశాలు తమ సొంత గడ్డపై గెలుపొం దడం విశేషం. ప్రపంచ కప్ క్రీడా పోటీలను దూర్‌దర్సన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయడం 1954లో ప్రారంభమైంది.
ప్రపంచ వ్యాప్తంగా ఒలింపిక్ ని మించి ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న ఆట ఫుట్‌బాల్ మాత్రమే. అయితే, ఈ మధ్య క్రికెట్ పోటీలకు అత్యధిక ఆదరణ లభిస్తోంది. పిఫా పోటీలపై వార్తా ప్రసార సాధనాల్లో రన్నింగ్ కామెంటరీతో సాగిన ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు కోట్లాది మంది ఆనందోత్సాహాలతో వీక్షించారు. ఫిపా పోటీల ప్రత్యక్ష ప్రసారాల కోలాహాలాన్ని చూస్తే క్రికెట్ పోటీల సందడి దిగదుడిపేననిపించింది. క్రికెట్ పోటీల ప్రసారాన్ని వీక్షించడానికి ఉద్యోగులు, అధికారులు ఆఫీసులకు సెలవు పెట్టిన సందర్భాలు అనేకం. ఇప్పుడు అన్ని చోట్ల చిన్న టెలివిజన్లు, ఐ ఫోన్ల లో కారులో ప్రయాణం చేస్తూ కూడా వీక్షిస్తున్నారు. ఫిపా పోటీలకు మూడేళ్ళ పాటు ప్రాథమిక పోటీలు నిర్వహించి ఎంపిక చేసిన 32 అత్యుత్తమ జట్ల మధ్య ఈ పోటీలను నెల రోజుల పాటు నిర్వహించారు.కొన్ని బృందాలుగా విభజించి ఈ పోటీల్లో విజేతలైన జట్లు ముందుకు వెళ్ళి ఇతర విజేతలతో తలబడతాయి. 2018 లో ఫిపాపోటీల్లో విజేత అయిన ఫ్రాన్స్‌ఈ సారి అర్జెంటీ నా జట్టు చేతిలో పరాజయం తప్పలేదు ఇందుకు ఫ్రాన్స్ లోపాల కన్నా అర్జెంటీనా క్రీడా స్ఫూర్తేకారణమని చెప్పాలి.
ఇంతవరకూ 21 ప్రపంచ కప్‌పోటీల్లో 8 జట్లే విజేతలుగా నిలవడం గమనార్హం1904లో పిఫా స్థాపిం చబడిన తర్వాత స్విట్జార్లండ్‌లో మొదటిసారి ఒలింపిక్‌కి బయట అంతర్జాతీయ ఫుట్‌బాల్ పోటీలను నిర్వహిం చాలని చూసింది, కానీకుదరలేదు. ఈసారి కూడా అర్జెంటీనా జట్టు సారథి మెస్సీ ఒక్కసారైనా ప్రపంచ కప్ సాధించగలనా అని సందిగ్ధంలో పడ్డాడు.ఎట్టకేలకు అతడి శ్రమ ఫలించింది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో చివరికి మెస్సీ జట్టు ఫ్రాన్స్ ఓడించి జట్టుని కప్‌ని సొంతం చేసుకుంది. అర్జెంటీనా జట్టు మొదటి నుంచి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చింది. రెండవ విడత ముగిసే సమయంలో 80వ నిమిషంలో పెనాల్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది.ఈ విజయానికి జట్టులోని సభ్యులందరి ప్రతిభ కనిపిస్తూనే ఉంది. ముఖ్యంగా గోల్‌కీపర్ ఎమిలియానో మార్టినేజ్ ముందు చూపు వల్ల అర్జెంటీనా జట్టుకు విజయం దక్కిం ది. అర్జెంటీనా తొలిసారిగా 1978లో ఫిపా కప్ ను కైవసం చేసుకుంది. 1986లో రెండవ సారి ఈ కప్‌ని అందుకుం ది. ఇప్పుడు మూడోసారి ప్రపంచ కప్‌ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. మూడున్నర దశాబ్దాల తర్వాత అర్జెంటీనా ప్రపంచ కప్ కల నెరవేరింది. గెలిచిన వాడు మావాడు అన్న నానుడి అర్జెంటీనా ఫుట్‌బాల్ విజేత మెస్సీ విషయంలో జరిగింది.
అసోంకి చెందిన ఒక ఎంపీ మెస్సీ అసోంలో పుట్టాడంటూ ట్విట్టర్‌లో ఒక వార్త పోస్టు చేయగానే దేశ వ్యాప్తంగా ఫుట్ బాల్ అభిమానులు ఎగిరి గంతేశారు. అయితే, తర్వాత ఆ వార్త నిజం కాదని తేలిం ది. క్రికెట్ క్రీడా కారుల పట్ల ఆరాధనా భావాన్ని పెంచుకు న్న యువకులు ఇప్పుడు ఫుట్‌బాల్ క్రీడాకారుల పట్ల కూడా ఆరాధనా భావాన్ని పెంచుకుంటున్నారు. ఇప్పు డు క్రీడాభిమానులకు చెందిన వార్తలన్నీ మెస్సీ చుట్టూ తిరుగుతున్నాయి. అతడు రిటైరవుతారన్న వార్త కూడ అలాంటిదే.అయితే, తాను ఇప్పట్లో రిటైర్‌కావడం లేదని అతడు ప్రకటించాడు.అత్యధిక ఆటలు ఆడిన ఆటగాడిగా అతడికి గుర్తింపు లభించింది. ఎక్కువ సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.మెస్సీ వయస్సు 35 ఏళ్ళు. పెద్ద వయసులో ప్రపంచ కప్‌లో ఐదు కంటే ఎక్కువ గోల్స్ చేసిన ఆటగాడు మెస్సీనే. ఎంతో కష్టపడి తన మనో రథాన్ని సాధించుకున్న మెస్సీ వచ్చే పోటీల వరకూ పుట్ బాల్ క్రీడాకారుల నోళ్ళలో నానుతూనే ఉంటాడు.