Tuesday, November 19, 2024

స్టాలిన్ స‌త్తాకు ప‌రీక్ష‌….

త‌మిళనాడు అసెంబ్లికి జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పొత్తుతో పోటీ చేస్తున్న డీఎంకే అధినేత స్టాలిన్‌పై రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తండ్రి డాక్టర్‌ కరు ణానిధి నుంచి వారసత్వంగా పొందిన పార్టీ అధ్యక్ష పదవిని నిలబెట్టుకోవడమే కాకుండా, సమర్ధవంతంగా ఎన్నికల కురు క్షేత్రంలో స్టాలిన్‌ విజయం సాధించగలరని అంతా ఆశిస్తున్నారు. కరుణానిధి మూడేళ్ళ క్రితం కన్ను మూసే వరకూ స్టాలిన్‌ తండ్రి చాటునే ఉంటూ పార్టీ వ్యవహారాలను నడిపించేవారు. కరుణానిధి వయో వృద్ధులైనప్పటికీ, ఆయన నేతృత్వంలోనే పార్టీని నడి పించారు. ఆయన కన్నుమూసేక స్టాలిన్‌ పార్టీ పగ్గాలు చేపట్టి పార్టీలో మొత్తం సమూలమైన మార్పులు తీసుకుని వచ్చారు. ఈ క్రమంలో ఆయన రూపంలో అంటే హెయిర్‌ స్టయిల్‌లో మార్పు వచ్చింది. డీఎంకే పార్టీకి కార్యకర్తలే ప్రాణం. పార్టీని అట్టడుగు స్థాయి నుంచి నిర్మించడంలో కరుణానిధి నుంచి స్టాలిన్‌ ఎన్నో మెలకువలు నేర్చుకున్నారు. అయితే, కరుణా నిధి ఉపన్యాస చతురుడు. తమిళ వాంగ్మయంపై ఆయనకు సాధికారత ఉంది. ఆయన ఎంత హేతు వాది అయినప్పటికీ తమిళ సంస్కృతి మూలాల గురించి సమగ్రసమాచారాన్ని తన ప్రసంగాల్లో విని పించేవారు. కంబరామాయణం, ఇతర తమిళ ఇతి హాసాల్లోని పంక్తులను అనర్గళంగా సభల్లో చదివి శ్రోతలను అబ్బుర పర్చేవారు. అందుకే, తమిళనాడు కు ఆయన ఐదుసార్లు ముఖ్యమంత్రిగా, దశాబ్దాల పాటు శాసనసభ్యునిగా విలువైనసేవలను అందించా రు. కరుణానిధి ద్రవిడ ఉద్యమ నిర్మాతల్లో ఒకరుగా పేరొందారు. డీఎంకే వ్యవస్థాపకుడు అన్నా దురైకి సన్నిహితునిగా రాజకీయాల్లో రాటుతేలారు. కరుణా నిధి రాజకీయవారసత్వం కోసం ఆయన పెద్దకుమా రుడు ఎంకె అళగిరి పోటీ పడినప్పటికీ , స్టాలిన్‌కి వారసత్వం అప్పగించేందుకు కరుణానిధి మొదటి నుంచి మొగ్గు చూపుతూ వచ్చారు. 43 ఏళ్ళ వయసు లోనే చెన్నై మేయర్‌గా సేవలందించారు. యువతరా న్ని బాగా ఆకర్షించారు. యువజన విభాగం కార్య దర్శిగా, యంగ్‌ కమాండర్‌గా ఆయనను పిలిచేవా రు. పార్టీ రాజకీయాల్లో స్టాలిన్‌కి 50ఏళ్ళ అనుభవం ఉంది. ఆయనకు వారసత్వం వల్లకాకుండా, యువ నాయకునిగా పార్టీని పటిష్టం చేయడంలో ఎంతో ప్రతిభను కనబర్చడం వల్ల పార్టీనాయకులు, కార్యక ర్తలకు దగ్గరయ్యారు. నల్లరంగు జుట్టుతో, సైకిల్‌ తొక్కుకుంటూ వేగంగా వెళ్ళే స్టాలిన్‌ యువకుల్లో యువకునిగా ఇప్పటికీ కలిసిపోతుంటారు. మధ్యలో అభిమానులు, కార్యకర్తల కోరికపై సెల్ఫీలు దిగుతూ ఉంటారు. ఆయన 68 ఏళ్ళ వయసులోనూ యువకు లకు ఉత్తేజం కలిగించేవిధంగా చాలా క్రియాశీలంగా, చురుకుగా పని చేస్తుంటారు. ఏప్రిల్‌లో జరిగే ఎన్నిక ల్లో ఆయన నేతృత్వంపై డీఎంకే నాయకులు, శ్రేణుులు ఎంతో నమ్మకంతో బరిలోకి దిగుతున్నారు. కరుణాని ధికి స్టాలిన్‌ అసలైన వారసుడనీ, రాజకీయాల్లో చాణక్యుడని అంతా ప్రశంసిస్తూ ఉంటారు. కరుణాని ధి ఆరోగ్యం సహకరించకపోవడంతో 2017లోనే స్టాలిన్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బాధ్యతలను స్వీక రించారు. 2018లో కరుణానిధి అస్తమించే వరకూ పార్టీ పటిష్టానికి స్టాలిన్‌ ఎంతో కృషి చేశారు. ఆ తర్వా త అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికై బాధ్యతలను స్వీకరించారు.
పీకేతో దోస్తీ వల్ల లాభం: ఎన్నికల ప్రచార వ్యూహకర్త అయిన ప్రశాంత్‌ కిషోర్‌తో స్టాలిన్‌ దోస్తీ కారణంగా ఆయన సూచనల మేరకు పార్టీ వ్యూహాలను అమలు జేస్తున్నారనీ, దీని వల్ల పార్టీకి మేలు జరగవచ్చని పార్టీ నేతలు అంటున్నారు. 2016లో అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత కన్నుమూసిన తర్వాత ఆ పార్టీ నాయకత్వం కోసం సీనియర్‌ నాయకుడు పన్నీర్‌ సెల్వం ధ్వజమెత్తడంతో ఆ పార్టీలో పరిణామాలను స్టాలిన్‌ జాగ్రత్తగా గమనిస్తూ వ్యూహాత్మకంగా అడుగు లు వేశారు. అన్నా డీఎంకే లో జయ స్థానం కోసం ఆమె ఇష్టసఖి వికె శశికళ తీవ్రంగాప్రయత్నించారు. అయితే, ఆమె ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలుకి వెళ్ళారు. దాంతో అన్నా డీఎంకేలో కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. పన్నీర్‌ సెల్వం నాయకత్వాన్ని శశికళ వర్గంవ్యతిరేకించింది. దాంతో ప్రస్తుత ముఖ్యమంత్రి పళని స్వామి అతి నేర్పుగా పావులు కదిపి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్నా రు. పార్టీ చీలిపోకుండా, సీనియర్‌ నాయకుడు పన్నీర్‌ సెల్వంతో రాజీ కుదుర్చుకున్నారు. అధికారంలో భాగస్వామిని చేశారు. అన్నాడీఎంకే పార్టీలో బలహీ నతలను ఆసరాగా చేసుకుని పళనిస్వామి ప్రభుత్వా న్ని స్టాలిన్‌ పడగొట్టవచ్చన్న వార్తలు వచ్చాయి. కానీ, ఆయన తొందరపడకుండా సొంత పార్టీని కాపాడు కున్నారు. అన్నా డీఎంకే ప్రభుత్వాన్ని పడగొట్టేందు కు స్టాలిన్‌ ప్రయత్నించలేదని డీఎంకే నాయకులు స్పష్టం చేశారు. పళనిస్వామి నాల్గేళ్ళ పాటు ముఖ్య మంత్రిగా కొనసాగడానికి స్టాలిన్‌ దోహదం చేశారన్న వాదన ఉంది. అయితే, దానిని కూడా డీఎంకే వర్గాలు తోసిపుచ్చాయి. అడ్డదారుల్లోఅధికారంలోకి రావడం కన్నా నేరుగా ప్రజలనుంచే అధికారం పొందాలనే ఉద్దేశ్యంతోనే స్టాలిన్‌ మిన్నకున్నారని వారు పేర్కొ న్నారు. పార్టీలో తన పట్టు కొనసాగడం కోసం నియ మావళిలో మార్పులు చేశారు.డీఎంకే జనరల్‌ కౌన్సి ల్‌ ఆమోదం పొందేట్టు చేశారు. సొంతంగానే అధికా రంలోకి రావాలన్నది స్టాలిన్‌ నిశ్చితాభిప్రాయం. పార్టీపై తిరుగులేని పట్టును కరుణానిధి హయాం లోనే స్టాలిన్‌ సంపాదించారు. ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయానికీ కరుణానిధి ఆమోదం ఉందని పార్టీ నాయకులు తెలిపారు. కరుణానిధి హయాంలోనే పార్టీ నుంచి బహిష్కృతుడైన ఆయన పెద్ద కుమారు డు ఎంకె అళగిరి తండ్రి మరణానంతరం స్టాలిన్‌ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేశారు. కానీ, ఆయన వైపు పార్టీ నాయకులెవరూ వెళ్ళలేదు. అళగిరి విమర్శలకూ, ఆరోపణలకూ సమాధానమి వ్వవద్దని పార్టీ శ్రేణులను స్టాలిన్‌ ఆదేశించారు. అళగి రి అలా కొన్ని రోజుల పాటు విమర్శలు చేసి మిన్నకుం డి పోయారు. ఆ తర్వాత స్టాలిన్‌ తన కుమారుడు ఉదయ నిధిని వారసునిగా ఎంపిక చేసే క్రమంలో ఆయనకు కొన్ని బాధ్యతలను స్టాలిన్‌ అప్పగించారు. కరుణానిధి చాలా కాలం ప్రాతినిధ్యంవహించిన ట్రిపుల్‌కేన్‌ నియోజకవర్గానికి పార్టీ అభ్యర్ధిగా ఉదయ నిధిని ప్రకటించారు. పార్టీఅభ్యర్దుల ఎంపికలో ఆయన కూడా ప్రధాన పాత్రవహించారు. స్టాలిన్‌ అల్లుడు శబరీసన్‌కు కూడా పార్టీవ్యవహారాల్లో ప్రాధా న్యం ఉంది. అయినప్పటికీ ఆయన తగ్గి ఉంటు న్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తోపొత్తు విషయంలో స్టాలిన్‌ కీలకమైన మార్పులుచేసారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 41 అసెంబ్లి స్థానాలు కేటాయించగా, ఎని మిదింటిని మాత్రమే ఆపార్టీ గెల్చుకుంది. ఈసారి దీనిని దృష్టిలో ఉంచుకుని మిత్ర పక్షాలకు సీట్ల కేటాయింపులో స్టాలిన్‌ జాగ్రత్తలు తీసుకున్నారని పార్టీ సీనియర్‌ నాయకుడు ఒకరు చెప్పారు. అన్నా డీఎంకే కూటమిలో భాగస్వామిగా బీజేపీ పోటీ చేయ డం డీఎంకేకు కలిసొస్తుందని ఆశిస్తున్నారు. సీట్ల పంపకంలో ఈసారి స్టాలిన్‌ తీసుకున్న జాగ్రత్తల వల్ల డీఎంకేకు ప్రయోజనం ఉంటుందని పార్టీ నాయకు లు పేర్కొన్నారు. స్టాలిన్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ అటు కాంగ్రెస్‌ నాయకత్వానికీ, ఇటు రాష్ట్రం లోని ఇతర మిత్ర పక్షాలకూ ఎటువంటి అసంతృప్తి కలగకుండా మసులుకుంటున్నారు. దీని వల్ల ఉత్తమ ఫలితాలు రావచ్చని పార్టీ నాయకులు పేర్కొంటున్నా రు. తమిళనాడు రాజకీయాల్లో వ్యక్తుల ఆరాధన చాలా ఎక్కువ. దీనిని దృష్టిలో ఉంచుకునే స్టాలిన్‌ ఇమేజ్‌ పెంచేందుకు గడిచిన కొంతకాలంగా ప్రశాంత్‌ కిషోర్‌ సూచనలను అమలుజేస్తూ పార్టీ ఇప్పటికే వ్యూహాత్మకంగా మంచి పురోగతి సాధించిందని పార్టీ నాయకులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement