Monday, November 18, 2024

ప్రకృతి నేర్పుతున్న గుణపాఠాలు

హిమాలయాలు మన దేశానికి శత్రు దుర్భే ద్యంగా వున్న పెట్టని కోటలు. హిమాల యాల సానువులే ఒద్దికగా నిక్షిప్తమై వున్న ఉత్తరాఖండ్‌ రాష్ట్రము స హజ ప్రకృతి అందాలకు, స హజ సంపదకు నిలయం, పుణ్య క్షేత్రాలకు, తీర్థ యాత్రలకు, ఆధ్యా త్మికతకు నెలవు. ఇలాంటి రాష్ట్రాన్ని ప్రకృతి తన ప్రకోపంతో ప్రళయాలను సృష్టిస్తుంది. ఉగ్ర రూపంతో గత కొన్ని సంవత్సరాలుగా కొండ చెరియ లు విరుచుకుపడటంతో అతలాకుతలం అవుతోంది. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగి పడటం, భూకంపాలు, అడవుల ద హనం ఇప్పుడు హిమానీ నదాలు కరిగిపోవడం ఇవన్నీ రాష్ట్రాన్ని చిగురుటాకు లా వణికిస్తున్నాయి. ఉత్తరకాశి, చమోలీ భూకంపా లు, మాల్బలో కొండచరియలు విరగడం, 2013లో #హమాలయ వచ్చిన వరదలు మొదలైన సంఘటన లు ప్రాణాలను తీసి, ఆస్తిినష్టం, పర్యావరణ విధ్వం సం కలిగించాయి. ఇటీవల చమోలీ జిల్లా జోషి మఠ్‌ సమీపంలో నందా దేవి హిమాని నదంలోని మంచు చరియలు విరిగి ధౌలీగంగా నదిలో పడటంతో వరద ఎక్కువై రుషిగంగా జల విద్యుత్‌ క్షేత్రం పూర్తిగా కొట్టు కు పోగా, ఎన్‌టి పి సి ఆధ్వర్యంలోని 480 మెగా వాట్స్‌ విద్యుత్‌ కేంద్రానికి భారీ నష్టం వాటిల్లింది. శీతాకాలంలో ఇలా మంచుచరియాలు విరిగిపడటం మునుపెన్నడూ జరగలేదు. ఘనీభవించిన మంచు లో శీతలం గతంలో మైనస్‌ 6 నుండి మైనస్‌ 20 డిగ్రీ ఉంటే ఇప్పుడు మైనస్‌ 2 డిగ్రీలకు పడిపోవడానికి భూతాపమే కారణమని అందుకే ఇలాంటి దుర్ఘటన జరిగిందని పర్యావరణ శాత్రవేత్తలు అంటున్నారు. అలక్‌ నందాపైన జలవిద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణంతో నది లోయ వ్యవస్థ ధ్వంసమైపోతుంది అని కాగ్‌ నివేదిక పదేళ్ల క్రితమే హెచ్చరించింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఉన్నతాధికారకమిటీ సముద్ర మట్టా నికి 2000 మీటర్‌ల ఎత్తున జల విద్యుత్‌ పాజెక్టుల రద్దు చెయ్యాలని సిపార్సు చేసింది. సొరంగాల కోసం కొండలను తవ్వడం, విచ్చలవిడిగా వృక్షాలను నరక డం, నదీ ప్రవాహాల్ని దారి మళ్లించి సాగిస్తున్న ప్రకృ తి విధ్వంసం వల్ల జరిగే పర్యవసానాలు ఎంత తీవ్రం గా వుంటాయో తెలిసి వస్తుంది. పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన ప్రాంతాల నుంచి విద్యుత్‌ ప్రాజెక్ట్‌లను ఇతర చోట్లకు తరలించాలని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. రిషి గంగ జల విద్యుత్‌ ప్రాజెక్ట్‌ లో భాగంగా పేలుడు పదార్థాలు వాడి కొండల్ని తవ్వుతున్నారు .ఈ విషయమై స్థానికుల పిర్యాదును ఎవరు పట్టించుకోలేదు. పర్యావరణపరంగా సున్నిత మైన #హమాలయాలు ప్రపంచంలోనే అతిపెద్ద పర్వ తాలకు నిలయాలు. ఈ ప్రాంతాన్ని మూడో ధృవంగా పరిగణిస్తారు. దాదా పు ఆసియాలోని అతిపెద్ద పది నదులకు జలధార లను అందిస్తున్నాయి. త్రాగునీరు, సాగునీరు, విద్యుత్‌ అవసరాలను ఇవి తీరుస్తున్నా యి. హిమానీ నదాలు, మంచుపలకలు నీటిని నిలువ చేసే ట్యాంక్‌ ల్లాంటివి. వాతావరణ మార్పులతో ఈ కరుగుదల జరుగుతుంది. ఇవి కరగటం వలన తాగునీటి ఇబ్బంది ఏర్పడుతుంది. వాతావరణ మార్పులు, మానవ చర్యలు, భూతాపం వంటి కార ణాల వలన అక్కడ అనేక మార్పులు చోటుచేసుకుం టున్నాయి. ఇరవయ్యో శతాబ్దం ప్రారంభం నుండి ఈ ప్రాంతంలో దాదాపు 2డిగ్రీ ఫారెన్‌ #హట్‌ మేర ఉష్ణోగ్రతలు పెరిగాయని నిపుణుల అధ్యయనాలలో తేలింది. హిమాలయ ప్రాంతంలో విపత్తులను పసి గట్టి ప్రజలను అప్రమత్తం చేసే ##హచ్చరిక వ్యవస్థలను త్వరితగతంగా సిద్ధం చేయాలి. అలాగే జాతిపిత మహాత్మాగాంధీ అన్నట్టు ”పర్యావరణం అందులో లభించే వనరులు మానవ అవసరాలకే కానీ అత్యాశ కు కాదు ”అనే సూక్తి ని విద్యార్థులకు, యువకులకు, అధికారులకు తెలియచెప్పి, చైతన్యం కల్పించి ప్రజ లలో పర్యావరణ స్ప్సహ ని తట్టిలేపాల్సిన అవసరం, సమయం ఆసన్నమైంది. లేదంటే భవిష్యత్తులో మరిన్ని ఉత్పాతాలు సంభవించే ప్రమాదంఉంది.

-ఆర్ బి రెడ్డి

Advertisement

తాజా వార్తలు

Advertisement