భాషా వైవిధ్యం దేశానికి ఎంతో మేలు చేస్తుందనీ, వివాదం వ్యక్తులమధ్య ,ప్రాంతాల మధ్య అంతరాలను సృష్టిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుక్రవారంనాడు బీజేపీ సభ్యులతో వర్చువల్‌గా మాట్లాడుతూ స్పష్టం చేశారు. ఏ ప్రాంతం వారికైనా మాతృభాష తల్లి లాంటిది. ప్రతిభాషలో భారతీయ సంస్కృతి ప్రతి బింబాన్ని చూడాలని ఆయన ఉద్బోధించారు. ఏ భాష వారైనా రామాయణ , భాగవత, మహాభారతాలను బాల్యం నుంచి అధ్యయనం చేస్తారు. మనకు నన్న యాది కవిత్రయం ఉన్నట్టే,ఇతర భాషల్లోనూ కవి త్రయంఉన్నారు.అయితే,లోతుగా అధ్యయనం చేస్తే భాషల్లోని మకరందాన్ని ఆస్వాదించవచ్చు. అప్పుడు ఇక అభిమాన,దురభిమానాలకు తావుండదన్న యూ ఆర్ అనంత మూర్తి మాటల్లో ఎంతో వాస్తవం ఉంది. అలాగే, నన్నయ,నారాయణ భట్టు సంపూర్ణమైన అవగాహన కలిగి ఉండి తమ భాషలను సుసంపన్నం చేశారు. అలాగే,ఏ భాష అయినా మనిషికి మాతృభాష ప్రాణంతో సమానం. భాషా వివాదం అరవైవ శతాబ్దం దితీయార్ధంలో ఎక్కువగా ఉండేది .ఇప్పుడు లేదు. అది కూడా తమిళసీమలోనే ఎక్కువగా ఉండేది, కొన్ని దశాబ్దాల పాటు భాషా సమస్య తమిళ రాజకీయాలను ప్రభావితం చేసింది.ఇతర ప్రాంతాల్లో భాషాభిమానం ఉన్న ఇంత తీవ్రంగా లేదు.కులాలు,మతాల పేరిట రాజకీయం నడుస్తున్నట్టే ,భాషాభిమానం పేరిట తమిళ నాట రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రధానమంత్రి ప్రత్యేకించి తమిళనాడునుద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదు. ఈ మధ్య బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, శాండిల్‌వుడ్ నటుడు క్లిచ్చా సుదీప్‌ల మధ్య జరిగిన వాదోపవాదాలను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారు.వాస్తవానికి అన్ని భాషల్లోనూ పాన్ ఇండియా సినిమాలు వస్తున్నరోజులు ఇవి.
మార్కెట్‌ను పెంచుకోవడానికి ఆ పదాన్ని ఉపయోగిస్తున్నారు. దేశాభిమానం నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పుకోకోయ్, పూని ఏదైనాగట్టి మేల్ తలపెట్టవోయ్ అన్నారు మహాకవి గురజాడ అప్పారావు.అదే మాదిరిగా భాషాభిమానాన్ని గురించి జబ్బలు చరుచుకునే వారంతా తమ భాషల ఔన్నత్యానికి ఏం చేశారో ఆత్మ విమర్శ చేసుకోవాలి. విశనటుడు అని పిలిపించుకునే కమలన్ హసన్ కూడా ఈ మధ్య చేసిన ఒక ప్రకటనలో భాషా భిమానాన్ని చాటుకున్నారు. మాతృభాషపై అభిమానాన్ని చాటుకోవడంలో తప్పులేదు. ఆంధ్రభోజుడు కృష్ణదేవరాయులు అంతటి వాడు దేశ భాష లందు తెలుగు గొప్ప అన్నాడు. గోస్వామి తులసీదాస్ రాసిన రామాయాణాన్నీ, హనుమాన్ చాలీసాను అన్ని భాషల వారూ కళ్ళకు అద్దుకుని చదువు తారు. పారాయణ చేస్తారు.ఇంతకీ ఇప్పుడు భాషాభిమానాన్ని ప్రదర్శించే సమయం ఎవరికీ లేదు.సినిమాలు అయినా, రాజకీయాలైనా భాషను ప్రతి ఒక్కరూ తమకు ఉప యోగపడినంత వరకూ వాడుకుంటున్నారు.రీమేక్‌ల పేరిట ప్రాంతీయ భాషల్లో విజయవంతం అయిన సినిమాలను తమ భాషలలోకి కొద్ది పాటి మార్పులు చేర్పు లతో మళ్ళీ తీస్తున్నారు.పూర్వం డబ్బింగ్ సినిమాలు వచ్చేవి. ఇప్పుడు అదే కథను తమకు అనుకూలంగామల్చుకుని సినిమాలు సాధించి విజయాలను సొంతం చేసుకుంటున్నారు. అందువల్ల భాషా సమస్య ఇప్పు డుపెద్దగా లేదు.అయితే,అజయ్ దేవగణ్, సుదీప్‌లు ఏ నేపధ్యంలో ఈ ప్రకటనలు చేశారో కానీ,ఇప్పుడు భాషా సమస్య.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..