Friday, November 22, 2024

ఉపాధిపై కుంటిసాకులు

యూపీఏ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఉపాధి హామీ పథకానికి గడచిన ఎనిమిది సంవ త్సరాలుగా ప్రస్తుత ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. పైగా గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగిత తగ్గిందంటూ వితండవాదన చేస్తోంది. నిజానికి ఈ పథకం పనులకు గిరాకీ తగ్గి 34 నెలల కనిష్ఠానికి చేరింది. పనులకు గిరాకీ తగ్గడం వల్ల నిరుద్యోగం తగ్గినట్టేనని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఈ వాదనలో లాజిక్‌ ఉన్న మాట నిజమే కానీ, గ్రామీణ ప్రాంతాలలో ఉద్యోగార్థులకు చేతినిండా పని దొరకుతోందా? అలా దొరికితే గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకులు నగరాలు, పట్టణాలకు ఎందుకు తర లివస్తున్నారు. గతంలోకంటే పట్టణాలు, నగరాలకు గ్రామాల నుంచి వచ్చిన, ఇప్పటికీ వస్తున్న జనాభా పెరు గుతోంది. వీరంతా గ్రామాలలో పనులు దొరకకపోవ డంవల్లనే పట్టణాలు, నగరాలకు తరలివస్తున్నారు. గ్రామాల్లో హుందాగా, గౌరవంగా జీవించే యువత, ముఖ్యంగా ఉద్యోగార్థులు నగరాలు, పట్టణాలలో అమా నవీయ వృత్తులకు సైతం సిద్ధపడుతున్నారు. ఉపాథి హామీ పనులకు గిరాకీ తగ్గిందన్న ప్రభుత్వ వాదనలో వాస్తవం లేదు. గత ఏప్రిల్‌లో 3 కోట్ల 23 లక్షల మంది ఈ పనుల కోసం దరఖాస్తు చేసుకోగా, జూన్‌లో వారి సంఖ్య 4 కోట్ల 32 లక్షలకు చేరింది. అంతకుముందు రెండు సం వత్సరాలు కరోనా దెబ్బవల్ల ఉపాథి హామీకి గండిపడిన మాట వాస్తవమే. కరోనా తగ్గిన తర్వాత గ్రామాలలో వ్యవసాయ, చేనేత వస్తు కళా రంగాలలో పనులు పుంజు కుంటున్నాయి. ఎంఎస్‌ఎంఈ రంగంలో పనులు పెరుగుతూండడమే ఇందుకు ఉదాహరణ.

గ్రామీణ ఉపాథికి డిమాండ్‌ తగ్గిందనుకుంటే అందుకు కారణం వెంటనే బిల్లులు చెల్లించకపోవడమే. నైపుణ్యం అవసరం లేని పనులలో పనిచేసేందుకు ముందుకు వచ్చేవారికి ఒక ఆర్థిక సంవత్సరంలో వంద రోజులు పాటు పని కల్పించాలి. కానీ 2021-22 సంవత్సరంలో 60.70 రోజులు మాత్రమే పనులు కల్పించారు. నిధుల కేటా యింపును బట్టే పనుల కకేటాయింపు ఉంటుంది. అంటే నిధుల కేటాయింపు తగ్గడం వల్లనే ఇలా జరుగు తోంద న్నమాట. ఈ విషయాన్ని మరుగుపర్చి ఉపాధి కోరేవారి డిమాండ్‌ తగ్గిపోయిందంటే నమ్మడానికి ప్రజలు అంత అమాయకులా? పెద్ద పారిశ్రామికవేత్తలు చెల్లించాల్సిన బ్యాంకు రుణాల బకాయిలను వందల కోట్లలో మాఫీ చేసిన, ఇప్పటికీ చేస్తున్న ప్రభుత్వం ఉపాధి పనుల నిధులలో కోత విధించడం ముమ్మాటికీ తప్పే. పైగా ఉపాథి పనులకు గిరాకీ తగ్గిందనడం ఓ కుంటిసాకు మాత్రమే. ఉపాథి హామీ పనులకు 15 రోజుల లోపు నిధు లు విడుదల చేయాలి. కానీ అలా జరగడం లేదు. నిధుల విడుదల అనేది నిరంతర ప్రక్రియ. దానికోసం రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులు రోజుల తరబడి ఢిల్లిdలో తిష్టవేసి లాబీయింగ్‌ చేయాల్సి వస్తోంది. అలా చేసినా పూర్తిస్థాయిలో నిధులు విడుదల కావడం లేదు.

వాస్తవం ఇది కాగా, ఉపాధి పనులకు డిమాండ్‌ లేదనడం ఎంతమాత్రం సహేతుకం కాదు. నిధుల కేటాయింపులో బీజేపీయేతర రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ ఆరోపణలకు ప్రధానమంత్రిని బాధ్యుణ్ణి చేయడం సమంజసం కాదు. సంబంధిత శాఖల అధికారుల ఉదాసీనత కారణం. దీనిని వెంటనే సరిదిద్దవలసిన అవసరం ఉంది. పైగా ఉపాధిహామీ పథకాన్నికి మెరుగు లు దిద్దుతామని కేంద్రం చెబుతున్నది. 10 ఇతివృత్తాల (పరిశుభ్రత, తోటల పెంపకం, మరుగుదొడ్లు వంటివి..) ఆధారంగా గ్రామ అవస్థాపనను మెరుగుపరచడానికి కృషిచేస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్‌ ఇటీవలే వెల్లడించారు. ఇప్పు డు చేపట్టబోయే మార్పులు నిధుల మళ్లింపు రుగ్మతను నివారిస్తుందని ఆయన చెప్పడం విశేషం. అయితే, ఒక పంచాయతీలో గరిష్ఠంగా 20 వార్డులకే ఈ పథకాన్ని వర్తింపజేస్తున్న నిబంధనల పట్ల తెలంగాణ, కేరళ వంటి రాష్ట్రాలు తీవ్రఅసంతృప్తితో ఉన్నాయి. 20 కంటే ఎక్కువ వార్డులు ఉన్న పంచాయతీల్లో చాలా మంది ఈ పథకా నికి దూరమవుతున్నారు.

దీనిపై కేంద్రం సరైన జవాబు ఇవ్వలేకపోతున్నది. కేరళలలోని 940 పంచాయతీలలో 140 పంచాయతీలలో 20 కంటే ఎక్కువ వార్డు లున్నా యి. అదే విధంగా తెలంగాణలోని 769 పంచాయ తీలలో 12 పంచాయతీ ల్లో 20 కంటే ఎక్కువ వార్డులు న్నాయి. ఇలాంటి పంచాయతీలు దేశంలో చాలా చోట్ల ఉన్నాయి. దాదాపు ఇలా 2శాతం పంచాయతీలు ఉండొచ్చని అంచనా. దాదాపు ఎనిమిదేళ్లుగా అమల వుతున్న ఒక బృహత్తర పథకాన్ని కొనసాగించే విష యంలో లోటుపాట్లను సరిదిద్ది, మరింత మెరుగులు దిద్దాలి. నిరుపేద గ్రామీణులకు నేరుగా లబ్దికలిగే ఇలాంటి పథకాలపై కేంద్రం నిర్లిప్తతను వీడి మరింత మెరుగ్గా అమలయ్యేలా చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement