Sunday, November 24, 2024

కిమ్‌ దుందుడుకు చేష్టలు!

ఉక్రెయిన్‌పై దండయాత్ర నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అణ్వస్త్రాలను ప్రయోగిస్తారంటూ ఇటీవల వచ్చిన వార్తలు యావత్‌ మానవాళిని కలవరానికి గురిచేశాయి. అయితే, తాను అటువంటి యత్నాలు సాగించడం లేదంటూ పుతిన్‌ వివరణ ఇచ్చారు. పుతిన్‌ కన్నా ఎక్కువ దూకుడు స్వభావం కలిగిన ఉత్తర కొరియా అధినేత కిమ్‌ ఉన్‌ జోగ్‌ నిజంగానే అణ్వస్త్రాలతో సమానమైన క్షిపణులను ఒకేసారి పదింటిని పరీక్షల పేరిట ప్రయోగించారు. దీంతో పక్కనే ఉన్న దక్షిణ కొరియా ఉలిక్కి పడింది. ఈ క్షిపణుల్లో కొన్ని దక్షిణ కొరియా సముద్ర జలాల్లో పడ్డాయి. కాగా తమ దేశం మీదుగా క్షిపణులను ప్రయోగించడంపై జపాన్‌కు చిర్రెత్తించింది. తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అయితే, అమెరికాతో కలిసి దక్షిణ కొరియా విజిలెంట్‌ స్టామ్‌ పేరిట యుద్ధ విన్యాసాలు ప్రారంభించడమే ఉత్తర కొరియా దూకుడుకు కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఉత్తర కొరియా అధినేత కిమ్‌ సహజంగా అమెరికా వ్యతిరేక వైఖరిని అనుసరిస్తున్నారు. దానికి తోడు అమెరికాతో, దక్షిణ కొరియా కలిసి విన్యాసాలు చేయడాన్ని సరిపెట్టుకోలేకపోతున్నారు. దక్షిణ కొరియా, అమెరికాతో సంయుక్తంగా విన్యాసాలు చేయడం చాలా కాలంగా ఉన్నదే. అయితే, ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో మారిన ప్రపంచ పరిణామాల నేపథ్యంలో ఉత్తర కొరియా తన బలాన్ని ప్రదర్శించడానికి మాత్రమే క్షిపణ ప్రయోగాలతో సరిపెడుతుందా, ఇంకా దూకుడు ను ప్రదర్శిస్తుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కిమ్‌ ధోరణి అటువంటిది.

అయితే, దక్షిణ కొరియాకు దగ్గరగా సముద్రజలాల్లోకి పడేరీతిలో ఉత్తర కొరియా క్షిపణులను ప్రయోగించడం ఇదే మొదటి సారని దక్షిణ కొరియా త్రివిధ దళాల సంయుక్త కమిటీ చైర్మన్‌ వ్యాఖ్యానించారు. ఉత్తర కొరియా ప్రస్తుతానికి సాహసం చేయక పోవచ్చుననీ, అయితే, అమెరికా వైఖరి పట్ల మండిపడుతున్న ఉత్తర కొరియాఎటువంటి దుస్సాహసానికైనా ఒడిగట్టే అవకాశం ఉందని అనుమానిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఉత్తర కొరియా ఇంతగా అనుమానించడానికి కారణం ఉంది. అమెరికాతో కలిసి దక్షిణ కొరియా పది రోజుల పాటు విన్యాసాలను నిర్వహించింది. దక్షిణ కొరియా నిర్వహించిన ఈ విన్యాసాల్లో అమెరికన్‌ సైనికులూ పాల్గొన్నారు. ఏ దురుద్దేశ్యమూ లేకపోతే అమెరికన్‌ సైనికులు ఈ ప్రాంతానికి రావల్సిన అవసరం ఏమిటని ఉత్తర కొరియా ప్రశ్నిస్తోంది. అమెరికా పోకడలను గురించి తెలుసున్న వారికి ఆ అనుమానం కలగడం సహజమే. తాజాగా ఉక్రెయిన్‌కీ, అంతకుముందు సిరియాలోని తిరుగుబాటుదారులకూ అమెరికా సాయం చేసిన సంగతిని వారు గుర్తు చేస్తున్నారు. ఉత్తర కొరియాకు ఇతర ప్రాంతాలపై దాడులు చేసే ఉద్దేశ్యం లేదనీ, తమ ప్రాదేశిక సరిహద్దులనూ, భౌగోళిక హద్దులను కాపాడు కోవడమే తమ ప్రధాన లక్ష్యమని ఉత్తర కొరియా అధినేత స్పష్టం చేస్తున్నారు. అయితే, ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఆయన సమర్థిస్తున్నారు. అది ఒకప్పుడు సోవి యట్‌ యూనియన్‌లో అంతర్భాగం కనుక, ఆ ప్రాంతాన్ని తమ దేశంలో కలుపుకోవాలన్న పుతిన్‌ నిర్ణయాన్ని తప్పు పట్టలేమని కిమ్‌ ఇటీవల ఓ సందర్భంలో స్పష్టం చేశారు.

కోవిడ్‌ కారణంగా అమెరికా, దక్షిణ కొరియా ఈ విన్యాసాలను కొంతకాలం పాటు నిలిపివేశాయి. అంతేకాకుండా ఉత్తర కొరియా తన దూకుడు ధోరణిని మార్చుకుంటుందేమోనని ఆశించాయి. అయితే, కిమ్‌ ప్రకటనలు, ఇంటర్వ్యూలలో చెబుతున్న విషయాలను పరిశీలిస్తే, ఆయనలో అణుమాత్రం మార్పు రాలేదనే విషయం స్పష్టం అవుతోంది. అంతర్జాతీయ పరిణామాలతో తమ ఆయుధ సంపత్తిని లోకానికి తెలియజేయడం కోసం కిమ్‌ సిద్ధమవుతున్నట్టు, దక్షిణ కొరియాపై అణు దాడికి సన్నాహాలు చేస్తున్నాడని మీడియా ప్రకటించింది. ఈ పరిణామాల నేపధ్యంలో ఈ ప్రాంతంలోని దేశాల భద్రత గురించి చర్చించేందుకు ఐక్యరాజ్య సమితి భద్ర తా మండలి సమావేశాన్ని తక్షణం ఏర్పాటు చేయాలని జపాన్‌ ప్రధాని కిషిదా పిలుపు ఇచ్చారు.అయితే, ఉత్తర కొరియాపై వేటు పడకుండా రెండు దేశాలు అడ్డు పడు తున్నాయి. తాము అణ్వస్త్రాలను ప్రయోగించకపోయి నా, ఉక్రెయిన్‌ యుద్ధం తదనంతరం ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల్లో ఆత్మరక్షణ కోసం అణ్వస్త్రాలను ప్రయోగిం చేందుకు వీలుగా ఉత్తర కొరియా చట్టాన్ని సవరించుకుం ది. ఆ విధంగా తమ దేశానికి అణ్వస్త్ర ప్రతిపత్తిని ఇచ్చిం ది. ఇటీవల టైకాన్‌ అనే ప్రాంతం నుంచి ఉత్తర కొరియా బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించింది.దీని వల్ల ఆదుకుంటు న్న దేశాలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలని దక్షిణ కొరియా డిమాండ్‌ చేసింది. ఉత్తర కొరియా ప్రయోగించే క్షిపణు లు పొరుగుదేశాలకే కాకుండా ఇతర దేశాలకు హాని చేస్తాయనీ, వీటి వల్ల అందరికీ హాని జరుగుతుందని దక్షి ణ కొరియా హెచ్చరిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement