అఖిల కాంగ్రెస్ అధ్యక్షునిగా పార్టీ సీనియర్ నాయకు డు మల్లికార్జున్ ఖర్గే బుధవారం నాడు ప్రమాణ స్వీకారం చేయడంతో 137 సంవత్సరాల పార్టీలో కొత్త అధ్యాయ ప్రారంభమైంది. ఒక సామాన్య కార్మికుని గా జీవనాన్ని ప్రారంభించి పార్టీలో అంచలంచెలుగా ఎదిగి న ఖర్గే తనకు లభించిన ఈ గౌరవానికి మాటలకు అంద ని ఆనందంతో పొంగిపోయారు. కాంగ్రెస్ పార్టీలో ఎటు వంటి ఆర్భాటం లేకుండా, వినమ్రంగా ఉంటూ తన పని తాను చేసుకునిపోయేవారికి గుర్తింపు ఉంటుందనడాని కి తన జీవితమే ఉదాహరణ అని అంటూ ఖర్గే భావోద్వే గానికి గురి అయ్యారు. సమాజంలో అట్టడుగు వర్గాలకు మాటల్లో కాక, చేతల్లో ప్రాధాన్యం ఇవ్వడంలో కాంగ్రెస్ ముందుంటుందని, అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన తన కు అవకాశం కల్పించడం ద్వారా పార్టీ రుజువు చేసిందని అనడంలో ఔచిత్యం ఉంది. అక్టోబర్ 19వ తేదీన బ్యాలెట్ పద్ధతి ద్వారా అత్యధిక శాతం ఓట్లతో పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైన ఖర్గే అజాత శత్రువు.ఈ మాట ఆయనతో పోటీ చేసిన శశి థరూర్ స్వయంగా అన్నారు. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ అధ్యక్ష పదవిని స్వీకరిం చడం చాలా పెద్ద బాధ్యత. పార్టీకి కొత్త రూపు తీసుకుని రావడానికి వర్కింగ్ కమిటీ స్థానే పాత కొత్తల మేలు కలయికగా స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయడంతో తన పనికి శ్రీకారం చుట్టారు.
దశాబ్దాలుగా లౌకిక ప్రజాస్వా మ్య వ్యవస్థను కాంగ్రెస్ కాపాడుకుంటూ వచ్చిందనీ, అటువంటి వ్యవస్థకు ఇప్పుడు ప్రమాదం ఏర్పడిన తరుణంలో కాంగ్రెస్ తిరిగి ప్రజలందరినీ సమీకరించి ఆ వ్యవస్థను కాపాడుకోవల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పడం ద్వారా తన కర్తవ్యమేమిటో చెప్పకనే చెప్పారు. దాదాపు రెండు దశాబ్దాలుగా పార్టీకి సారథ్యం వహిస్తూ ఎన్నో విజయాలను చేకూర్చి పెట్టిన మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సలహాలను స్వీకరిసా ్తననడం ద్వారా తన విధేయతను మరోసారి చాటున్నారు. ఖర్గే ప్రసం గాన్ని ఏఐసీసీ సభ్యులంతా ఎంతో శ్రద్ధతో ఆలకించారు. కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పు కోసం సోనియాకు లేఖ రాసిన జి-24 మందిలో వారికి కూడా స్టీరింగ్ కమిటీలో స్థానం కల్పించారు. పార్టీ పదవుల్లో 50 శాతం ఏభై ఏళ్ళ లోపు వారికి ఇవ్వాలనీ, ఖాళీలను పూర్తి చేయాలనీ, పార్టీ ని మరింత చైతన్యవంతం చేయడానికి అవసరమైన విభాగాలను కదిలించాలన్న ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ని తు.చ. తప్ప కుండా అమలు చేస్తానన్న ఖర్గే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజకీయ ప్రత్యర్థులపైకి, సీబీఐ, ఈడీలను ఉసిగొల్పుతూ రాజకీయాల్లో కొత్త ధోరణికి తెరలేపిందనీ, ఇలాంటి ధోరణులకు వ్యతిరేకం గా పోరాడేందుకు పార్టీ నాయకులు, శ్రేణులను సమీక రించాల్సిన అవసరాన్ని గుర్తించారు.
అధికారంలో ఉన్న నాయకులు తరచూ చేస్తున్న కాంగ్రెస్ ముక్త భారత్ నినాదాన్ని తిప్పి కొట్టేందుకు పార్టీ పోరాడి తీరుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్యయుతంగానే పార్టీ యంత్రాంగాన్నీ, సారథిని ఎన్నుకుంటుందనే విషయం ఇతర పార్టీలు తెలుసుకోవాలనీ, వాస్తవాలను పక్కన పెట్టి కాంగ్రెస్‌పై ద్వేషపూరితమైన, అసత్యాలతో కూడిన ప్రచారం చేయడం తగదని ఖర్గే హెచ్చరించారు. తమ పార్టీ అధ్యక్ష పదవికి రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నిక జరిపించడాన్ని గురించి ప్రస్తావిస్తూ ఇతర పార్టీలు కూడా దీనిని అనుసరించగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ముందున్న సవాళ్ళను ఎదుర్కోవడా నికి సిద్ధంగా ఉన్న విషయాన్ని ధీమా వ్యక్తం చేశారు. ఖర్గే ప్రసంగం పార్టీ కార్యకర్తలు, ఏఐసీసీ సభ్యులు శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని కలిగించిందంటూ సోనియాగాంధీ అభినందించారు. ఎంతో అనుభవం, పార్టీ పట్ల అంకిత భావం కలిగిన నాయకుడు అధ్యక్షునిగా బాధ్యతలు స్వీక రించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని ఆమె ప్రశం సించారు. ఖర్గేతో పోటీ చేసి ఓడిపోయిన శశిథరూర్ పార్టీ ని నడిపించడంలో ఖర్గేకి సంపూర్ణ సహకారాన్ని అందిస్తా నని ప్రకటించడం విశేషం.
త్వరలో అసెంబ్లి ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో పార్టీ యంత్రాంగాలను సంసిద్ధం చేయడం, నూతనోత్సాహాన్ని నింపడం ప్రస్తుతం కొత్త స్టీరింగ్ కమిటీ ముందున్న లక్ష్యాలు. పార్టీ ప్లీనరీలో ఖర్గే నియామకాన్ని ధ్రువీకరించిన తర్వాత కొత్త వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేయవచ్చు. అధికార పార్టీ దాడులను ఎదుర్కోవడంలో ఆరితేరిన ఖర్గే వంటి అనుభవజ్ఞుడు, సీనియర్ నాయకుడు పార్టీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరిం చడం అందరిలో ఒక విధమైన విశ్వాసం, నమ్మకం ఏర్పడినట్టు కనిపించింది. పార్టీ ముందుకు సాగడానికి ఇది చాలా ముఖ్యం. సోనియాగాంధీ ఖర్గే సామర్థ్యం, అనుభవం పార్టీకి ఉపయోగ పడతాయన్న విశ్వాసాన్ని వ్యక్తృం చేశారు. పెద్ద భారాన్ని కిందికి దింపుకున్నానం టూ ఊపిరి పీల్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి మళ్లిd పూర్వ వైభవం రాగలదన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. అందరిలోనూ అదే భావన కనిపించింది.