Friday, November 15, 2024

ఎడిటోరియ‌ల్ – విదేశాల‌లో ఖ‌లిస్తాన్ క‌ల‌క‌లం…

ఖలిస్తాన్‌ తీవ్రవాదులు గతంలో కెనడాకే పరిమితం. ఇప్పుడు అమెరికా,బ్రిటన్‌,ఆస్ట్రేలియా తదితర దేశాల్లో భారత్‌ వ్యతిరేక ప్రదర్శనలను నిర్వహిస్తూ త్రివర్ణ పతాకాలను అవమానపరుపరుస్తున్నారు. అమెరికా లోని శాన్‌ఫ్రాన్సిస్కోలో కొద్ది రోజుల క్రితం ఆందోళన జరిపిన ఖలిస్తాన్‌ మద్దతుదారులు శనివారం నాడు వాషిం గ్టన్‌లోని భారత దౌత్య కార్యాలయం వద్ద హింసను ప్రేరేపించే రీతిలో ప్రసంగించారు. దౌత్య కార్యాల యంలోకి దూసుకుని వెళ్ళేందుకు ప్రయత్నిం చారు. ఎంబసీ కిటికీల అద్దాలను పగుల గొట్టారు. దౌత్యాధికారి తరన్‌ జిత్‌ సంధ ును అనరాని మాటలు అన్నారు. ఆ సమయంలో ఆయన ఆఫీసులో లేరు.ఈ కార్యక్రమాన్ని కవర్‌ చేస్తున్న వార్తా సంస్థల విలేఖరులపై దాడులు చేశారు. భారత దేశానికి వ్యతిరేకంగా నినా దాలు చేశా రు.ఖలిస్తాన్‌ తీవ్రవాదులు 80 వ దశకంలో ఏ మాదిరిగా అయితే, భారత్‌ని లక్ష్యంగా చేసుకుని నినా దాలు చేశారో ఇప్పుడు కూడా అదే మాదిరి నినాదాలు చేసు ్తన్నారు.



ఖలిస్తాన్‌ అనేది ఊహాజనితమేన నీ, అది సాకా రమయ్యే అవకాశాలే లేవని సిక్కుల్లో సీనియర్‌ నాయ కులు స్పష్టం చేస్తున్నప్పటికీ,యువతరాన్ని రెచ్చగొట్టేం దుకు కొత్తగా అమృతపాల్‌ సింగ్‌ వంటి నాయకులు తయారయ్యారు.అమృతపాల్‌ సింగ్‌ పంజాబ్‌లో ఇటీవల ఆందోళనలకు నేతృత్వం వహిస్తూ తన మద్దతు దారులను రెచ్చగొడుతున్నారు. తాను భింద్రన్‌ వాలా సిద్ధాంతాలకు ప్రభావితుడనైనానని అతడే స్వయంగా చెప్పుకుంటున్నాడు. పెద్దగా చదువు కోకపోయినా ఖలి స్తాన్‌ నినాదంతో సిక్కులను ఆ కర్షించి మళ్ళీ అలనాటి ఉద్య మాన్ని పోలిన ఆందోళన కోసం యువతను అతడు రెచ్చ గొడుతున్నాడు.మాదక ద్రవ్యా ల అలవాటును మాన్పిం చడానికి అతడు ఒక డీ-అడిక్షన్‌ కేంద్రాన్నీ,గురుద్వారానీ కేంద్రంగా చేసుకుని తన కార్యక లాపాలను సాగిసు ్తన్నాడు.తన ఉద్యమం శాంతి యుతం గా సాగుతుందని ప్రకటిస్తూనే మారణా యుధాలను సేక రించి గురుద్వారా లో దాచిపెట్టాడు.

అలనాడు భింద్రన్‌ వాలా కూడా ప్రమా దకరమైన మార ణాయుధాలను అమృతసర్‌ స్వర్ణాల యంలో గుట్టలుగా పేర్చిన సంగతి వెనకటి తరానికి చెందినవారికి తెలుసు. ఖలిస్తాన్‌ ఉద్యమానికి తిరిగి ఊపిరి పోయడమే తన లక్ష్యమని అమృతపాల్‌ సింగ్‌ బహిరంగంగానే చెబుతు న్నారు. పంజాబ్‌కి చెందిన అతడు దుబాయ్‌ వెళ్ళి అక్క డ కొంతకాలం పాటు ట్రక్కు డ్రైవర్‌గా పని చేశాడు . అక్కడ సిక్కుల ప్రాపకం సంపా దించి ఐఎస్‌ఐ తీవ్ర వాదులతో సంబంధాలను పెంచుకున్నాడు.తిరిగి భారత్‌ వచ్చి అత డు ఖలిస్తాన్‌ అభిమా నులను సమీకరించి ఆందోళన ల ను చేపట్టాడు. గతఫిబ్రవరిలో అమృతసర్‌లోని అన్‌ జా లా పోలీసు స్టేషన్‌ వద్ద పెద్ద సాయుధ ప్రదర్శనను నిర్వ హిం చిన అతడు పోలీసుల కన్నుగప్పి పారిపోయాడ ు.

అతడి కోసం అప్పటి నుంచి పోలీసులు గాలిస్తున్నా, వేషాలు మారుస్తూ,వాహనాలను మారుస్తూ తిరుగు తున్నాడు.్తడు అంటించిన అగ్గి విదేశాల్లోని పలు నగరా ల్లో అంటుకుంది.ఆస్ట్ర్రేలియాలోని ప్రార్థనా మంది రాలను ఖలిస్తాన్‌ వాదులు తగులబె డుతు న్నారు. ఆస్ట్రేలి యా ప్రభుత్వానికి మన ప్రభుత్వం ఫిర్యాదు చేసినా ప్రయోజనం కనిపించలేదు.ఆస్ట్ర్రేలియా ప్రధానికి మన ప్రధాని మోడీ ఫిర్యాదు చేసినా ఎటువంటి ఫలితం కనిపించలేదు.ఇప్పుడు కొత్తగాఅమెరికన్‌ నగరా ల్లో ఖలిస్తాన్‌ తీవ్రవాదులు ఆందోళనలు సాగిసు ్తన్నారు. కెనడాలోని టొరంటోలో ఒక ప్రార్ధనా మందిరంలో ఖలిస్తాన్‌ తీవ్రవాదులు సమావేశమైనట్టు తెలియగానే, అక్కడి పోలీసులను భారత దౌత్య కార్యాలయం అప్ర మత్తం చేసింది.అయితే, స్థానికుల సాయంతో వారు పోలీసుల కన్నుగప్పి పారిపోయారు. ఖలిస్తాన్‌ ఆందొ ళనకారులకు స్థానికుల నుంచి ఆర్థిక సాయం లభిస్తోంది.

కెనడాలో బాగా చదువుకున్న వారు,ఉన్నతస్థానాల్లో ఉన్న వారు ఖలిస్తాన్‌ తీవ్రవాదులకు అండగా నిలుసు ్తన్నట్టు సమాచారం . సేవ్‌ సిక్‌ అనే సంస్థను స్థాపించి వారంతా ఆందోళనలు సాగిస్తున్నారు.భారత్‌లో సిక్కు లపై దాడులు జరుగుతున్నాయన్న అసత్య ప్రచారం సాగిస్తున్నారు.ఈ విషయాన్ని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ సింగ్‌ మాన్‌ కూడా ఖండించారు.,తమ రాష్ట్రం లో సిక్కులు క్షేమంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. ఖలిస్తాన్‌ తీవ్రవాదులకు పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ వర్గం వారు, హుక్కానీ తీవ్రవాద వర్గం వారు సాయం అందిస్తు న్నారు. నిజానికి ఖలిస్తాన్‌ ఆందోళన కారులకు స్థానికం గా బలం లేదు. విదేశాల్లో వ్యాపారాలు చేసుకునేవారు, ఉద్యోగాలు చేసుకునే వారి నుంచే వారికి మద్దతు లభి స్తోంది.ఈవిషయాన్ని మన ప్రభుత్వం కెనడా, అమెరి కా,ఆస్ట్రేలియా, తదితర దేశాల దౌత్యకార్యాలయాల ద్వారా ఆయా ప్రభుత్వాలకు తెలియజేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement