కాశ్మీర్‌లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనేట్టు చేయడానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ తలపెట్టిన కార్యక్రమాలకు ఉగ్రవాదులు అడుగడుగునా అడ్డు పడుతున్నారు.కాశ్మీర్ నుంచి ఉగ్రవాదులను తరిమేశా మంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేస్తున్న ప్రకటన లన్నీ ఆశావహంగానే మిగిలిపో తున్నాయి. అంటే అలా జరిగితే బాగుండునన్న భావన కలిగించ డానికి మాత్రమే పరిమితం అవుతున్నాయి. తాజాగా, బద్గామ్ జిల్లాలో ప్రభుత్వ కార్యాలయంలోకి ఇద్దరు ఉగ్రవాదు లు ప్రవేశించి రాహుల్ పండిట్ అనే ఉద్యోగిని అతి సమీపం నుంచి కాల్చి చంపిన సంఘటన కాశ్మీర్ ప్రజలనే కాకుండా,అక్కడ శాంతి వెల్లివిరి యాలని ఆకాంక్షిస్తున్నవారిని తీవ్రంగా కలవరప ర్చింది.కాశ్మీర్ లో మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు జరిపిం చేందుకు నాందిగా అసెంబ్లి నియోజకవర్గాల పునర్వ్య వస్థీకరణ కార్యక్ర మాన్ని పూర్తి చేసే ప్రక్రియను కేంద్రం చేపట్టిం ది.ప్రభుత్వం నియమించిన కమిషన్ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు తగిన సిఫార్సులు చేసింది.కాశ్మీర్‌కి 47 అసెంబ్లి స్థానాలు,జమ్ముకి 43 స్థానాలను ఐదు పార్లమెంటరీ స్థానాలను ఈ కమిషన్ సిఫార్సు చేసింది.
అయితే, ఈ సిఫార్సులను పాకిస్తాన్ తిరస్కరిం చింది. భారత్‌లో అంతర్భా గమైన ఒక రాష్ట్రంలో అసెంబ్లిd నియోజకవర్గాల పునర్వ్యవస్థీక రణపై పొరుగు దేశం అభ్యంతరం వ్యక్తం చేయడం ముమ్మాటికీ సహించ రాని చర్యే.పైగా,ఇస్లామాబాద్‌లోని దౌత్య అధికారిని పిలిపిం చి ఈ సిఫార్సులను తాము తిరస్కరిస్తున్నామని పాక్ విదేశాంగ శాఖ అధికారి చెప్పడం మన ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే. పాకిస్తాన్‌లో పరిస్థితులు చక్కదిద్దుకోలేని అక్కడి ప్రభుత్వం మన వ్యవహారాల్లో తలదూర్చడాన్ని బట్టి కాశ్మీర్‌పై జోక్యం చేసుకోనిదే అక్కడ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మనుగడ సాగించలేదనే విషయం స్పష్టం అవుతోంది. అంతేకాదు, అక్కడి సైనికాధికారులు ఉగ్రవాదులను ఉసికొల్పి మన దేశంలోకి పంపుతున్నారన్నది కేవలం అనుమానం కాదనీ,వాస్తవమేనని మరోసారి రుజువైం ది. తాను ఆక్రమించుకున్న కాశ్మీర్‌లో ఎన్నికలు జరిపి స్తూ ,ప్రభుత్వాలను మారుస్తున్న పాక్ ప్రభుత్వం మన కాశ్మీర్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అభ్యంతర కరమే. కాశ్మీర్ విభజన జరిగిన తర్వాత చొరబాట్లు తగ్గాయన్న అభిప్రాయం కూడాసరికాదని ఇలాంటి ఘటనలతో రుజువు అవుతోంది. రాష్ట్రంలో 168 మంది ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను సాగిస్తున్నట్టు సమాచారం అందడంతో ఉగ్రవాదుల వేటను మన భద్రతాదళాలు ఉధృతం చేశాయి.
ఈ ఏడాది ఇప్పటి వరకూ 75 మంది ఉగ్రవాదులు భద్రతాదళాల ఎదురుకాల్పుల్లో మరణించారు.కాశ్మీర్ విభజన తర్వాత పరిస్థితిలో కొంత మార్పు వచ్చినట్టు కనిపించినా, నియోజకవర్గాల పునర్య్వస్థీకరణను వ్యతిరేకిస్తున్న పూర్వపు పాలక పార్టీల ప్రోద్బలంతో మళ్ళీ ఉగ్రవాదులు పుంజుకుంటు న్నారేమోనని పిస్తోంది.కాశ్మీర్ పండిట్ల పై ఇటీవల విడుదలైన కాశ్మీరీ ఫైల్స్ చిత్రంలో 1990 నాటి పరిస్థితులు, సంఘటనలఆధారం చేసుకుని ఆ చిత్రాన్ని రూపొందించా రనీ,ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పూర్వపు పాలక పార్టీలు వ్యాఖ్యానించాయి. తాజాగా జరిగిన సంఘటనపై ఈ పార్టీ ఇంకా స్పందించలేదు.నేషనల్ కాన్ఫరెన్స్,పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ)లు ఇప్పటికీ వేర్పాటు వాదులకుమద్దతును కొనసాగిస్తున్నా యి. వేర్పాటువాదులంద రికీ ఇప్పటికీ పాక్‌తో సంబంధా లున్నాయి. సరిహద్దు రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దడం లో కేంద్రానికి,ముఖ్యంగా ప్రధానికి సహకరించడం అందరి బాధ్యత .ఈ విషయంలో ఎటువంటి రాజకీయాలు పనికి రావు.పాకిస్తాన్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. పాక్‌లోని వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయా యి.అయి నప్పటికీ మన దేశంలో చిచ్చుపెట్టేందుకు పొరుగుదేశం ప్రయత్నిస్తోం ది.
పాక్ ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు.అక్కడ పాలనా వ్యవహా రాలన్నింటినీ చూస్తున్న సైన్యం మనదేశంపై పగబట్టి జిహాదీలను మన దేశంలోకి పంపుతోంది.దీనిపై మన దేశందౌత్య మార్గాల ద్వారా ఘాటైన రీతిలో సమాధానమివ్వాలి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవి నుంచి దిగిపోయే ముందు మన సైన్యాన్ని ప్రశంసించారు.అంటే అక్కడి సైన్యం జోక్యం ఎక్కువైందనే విషయం చెప్పకనే చెప్పారు.పాక్ సైన్యం మన సైన్యం చేతిలో ఎన్నో సార్లు చావుదెబ్బ లుతింది.అయినా బుద్ధి రాలేదు.కాశ్మీర్‌లో తాజాగా చోటు చేసుకుంటున్న సంఘటనలకు పాక్ సైన్యం ప్రోద్బలం ఉందనేది తిరుగులేని నిజం. రాష్ట్రానికి పెద్దదిక్కుగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ,అన్నిపార్టీలనూ ఏకతాటిపైకి తెచ్చి కాశ్మీరీ ప్రజల ప్రాణాలను కాపాడగలిగినప్పుడే ఆయన నిజాయితీని జనం గుర్తిస్తారు.