పద్దెనిమిది సంవత్సరాల తర్వాత హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు అనుకున్నదాని కన్నా ఘనంగా జరిగాయి. వర్షాలతో ఆటంకాలు ఎదుర వుతాయేమోనన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ కార్యక్రమాలు సజావుగా ముగిశాయి. ప్రధానమంత్రి బహిరంగ సభకు దూర ప్రాంతాల నుంచి అశేషంగా జనం హాజరు కావడంతో పార్టీ రాష్ట్ర నాయకుల శ్రమ ఫలించింది. బహిరంగ సభలో జనాన్ని చూసి ప్రధాన మంత్రి ఆనందం వ్యక్తంచేశారు. అంతేనా… ఉబ్బితబ్బి బ్బయ్యారు. ఇందుకు పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌ని వెన్నుతట్టి అభినందించడమే నిదర్శ నం. పార్టీజాతీయ కార్యవర్గ సమావేశాలంటే పార్టీ సమావేశాల్లో ముఖ్యమైన అంశాలపై చర్చ, తీర్మానాలు ఉంటాయి. మొదటి నుంచి ఇది పరిపాటే. కాకినాడలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ విభజన తీర్మానం చేశారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలనే అంశంపై అప్పట్లో చేసిన తీర్మానంతో తెలంగాణ ఆవిర్భా వానికి నాందీ ప్రస్తావన జరిగింది. అంతకు ముందే తెలంగాణ కోసం ఉద్యమం జరిగినప్పటికీ, బీజేపీ తీర్మానాన్ని అన్ని సభల్లో తెలంగాణ వాదులే కాకుండా, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పదేపదే ప్రస్తావించేవారు. ఈసారి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణలోనే కాకుండా బెంగాల్, ఒడిషా, దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీ ప్రకటించింది. ఇందుకు తగిన రీతిలో క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యక ర్తలు, నాయకులు విస్తృతంగా ప్రచారం చేయాలని దిశానిర్దేశం చేసింది. ముఖ్యంగా తెలంగాణలో త్వరలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని కేంద్ర మంత్రులే కాకుండా, ప్రధానమంత్రి కూడా బహిరంగ సభలో స్పష్టంచేసి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. ఉత్తరప్రదేశ్ మాదిరి గా డబుల్ ఇంజన్ సర్కార్ కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారంటూ ప్రధాని ప్రజలను ఉత్సాహ పరిచే ప్రయత్నం చేశారు. తెలంగాణకు గడిచిన ఎనిమిది సంవత్సరాలుగా కేంద్రం అందించిన సహకా రాన్నీ, ఆర్థిక సాయాన్ని ప్రధానమంత్రి పూసగుచ్చినట్టు వివరించారు. ఐదు వేల కిలో మీటర్ల జాతీయ రహదారు ల విస్తరణ జరిగిందనీ, ఇన్నర్ రింగ్ రోడ్డుకు సాయం అందించనున్నామనీ, ఇంకా తెలంగాణకు అంతర్జాతీ య స్థాయిలో గుర్తింపు తెచ్చే సంస్థలు, కార్యాలయాలను తీసుకుని రానున్నామని తెలిపారు. ప్రధానమంత్రి ప్రసంగంలో తెలంగాణ అభివృద్ధి అంశాన్నే ప్రధానంగా ప్రస్తావించారు. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ గురించి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధానంగా చర్చించారు.
అన్ని రాష్ట్రాలలోనూ కాషాయి జెండా రెపరెపలాడాలన్న ఏకైక లక్ష్యంతో అందరూ సమష్టిగా కృషి చేయాలని కార్యకర్తలూ, నాయకులకు జాతీయ కార్యవర్గం పిలుపు ఇచ్చింది. మహారాష్ట్రలో శివసేన తిరుగుబాటు వర్గం, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో కమలనాథుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. ఇదే ఉత్సాహంతో తెలంగాణలోనూ, ఇతరదక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తేవడానికి కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని కేంద్రమంత్రులు పిలుపు ఇచ్చారు. ఈ సమావేశాల కోసం ప్రధానమంత్రి హైదరా బాద్‌లో మూడు రోజులు బస చేయడం అనూహ్యమైన విషయమే. ప్రధానమంత్రి సచివాలయంతో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత ముఖ్యమంత్రుల పే షీలు హైదరాబాద్ కేంద్రంగా పని చేశాయి. ఇం తమంది వివిఐపీలు, ప్రముఖులు తరలి వచ్చినా, హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలేవీ లేకుండా నగర పోలీసు విభాగం చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. ప్రధానమంత్రి వెళ్ళే మార్గాల్లో ట్రయిల్ రన్ చేసి పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.అలాగే, కార్యవర్గ సమావేశాలు జరిగిన హోటల్ నుంచి బహిరంగ సభ జరిగిన పెరేడ్ గ్రౌండ్స్‌కి ప్రధానమంత్రి హెలికాప్టర్‌లోవచ్చారు.ఆయన హెలికా ప్టర్ ప్రయాణం దృశ్యాలను బహిరంగకు హాజరైన సభికులు తిలకిస్తూ ఆనందోత్సాహాలను వ్యక్తం చేశారు. మోడీ బహిరంగ సభ ప్రసంగంలోనూ, భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ సభలోనూ ఆదివాసీల సమస్య లను గురించి ప్రధానంగా ప్రస్తావించారు. నర్మగర్భంగా తమ ప్రభుత్వం ఆదివాసీ మహిళను అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి ఎంపిక చేసిన విషయాన్ని గుర్తు చేశారు.ఆమెను గెలిపించాలన్నదే ఆయన ఆకాంక్షగా వ్యక్తం అయింది ఎక్కడ చూసినా బీజేపీ పతాకాలు, ముఖ్య కూడళ్ళలో పార్టీ జెండాలు, ద్విచక్రవాహనాలపై పార్టీ కార్యకర్తలు పార్టీ జెండాలతోచక్కర్లు రెండు రోజుల పాటు జంటనగరాల్లో ఎక్కడ చూసినా కాషాయి వర్ణమే కనిపించింది. ఈ సమావేశాలు విజయవంతం అయ్యాయనడానికి కార్యకర్తల్లో పెల్లుబికిన ఉత్సాహమే నిదర్శనం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.