అమెరికాలో ద్రవ్యోల్బణమా? అని ఆశ్చర్య పోనవస రం లేదు. అగ్రరాజ్యమైనా అక్కడి ఆర్థిక పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అంతర్జాతీయంగా సంభవించే పరిణామాల ప్రభావం అగ్రరాజ్యంపైనా పడింది. కరోనా మహమ్మారి అగ్రరాజ్యమైన అమెరికాతో సహా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను కుంగదీసింది. అమెరికా సంపన్నదేశం కనుక,అక్కడ ద్రవ్యోల్బణం ఉండదని అంతా భావిస్తారు. ప్రతి దేశమూ తమ కరెన్సీ విలువను అమెరికా కరెన్సీ డాలర్‌ని బట్టి పరిగణనలోకి తీసుకుంటుంది. ద్రవ్యోల్బణం అంట సూక్ష్మంగా వస్తువు విలువ పెరగడం. పదేళ్ళ క్రితం 50 రూపాయిలకు కొన్న వస్తువును ఇప్పుడు వంద రూపాయిలకు కొనాల్సి రావడం. అన్ని దేశాల్లోనూ ఇది ఉన్నదే. అయితే, వర్దమాన, పేద దేశాల్లో వస్తువుల ధరలు బాగా పెరిగిపోవడం వల్ల అక్కడ ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నట్టు భావిస్తూఉంటాం. అమెరికాలో నాలుగు దశాబ్దాల గరిష్టానికి ద్రవ్యోల్బణం పెరిగింది. టోకు ధరల సూచీ కన్నా, విని యోగదారుల సూచీ పెరుగుదలనే ప్రామాణికంగా తీసు కుంటారు. అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది.
కరోనా విషయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్లక్ష్యం చేయడం వల్లనే అక్కడ కరోనా కేసులు,మరణాల సంఖ్య పెరిగిందన్న డెమోక్రాట్లఆరోపణ నిరాధారం కాదు. అయితే, ట్రంప్ స్థానే అధికారాన్ని చేపట్టిన జో బిడెన్ సైతం సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకోలేక పోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ ఆ పదవికి ఎన్నికైనప్పుడు అమెరికన్లే కాకుండా భారతీయులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ , ఆమె సంక్షోభాలను పరిష్కరించడంలో తన సామర్ధ్యాన్ని నిరూపించలేకపోతున్నారు.అమెరికాలో కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ఆమె చురుకుగా వ్యవహ రించలేదన్న విమర్శలు వచ్చాయి. కరోనా తర్వాత ఉక్రెయిన్‌పై రష్యా దాడి అన్ని దేశాలతో పాటే అమెరికా ఆర్థిక వ్యవస్థను కుంగదీసింది. దానిని మళ్ళీ పట్టాలెక్కిం చడానికి నిర్దిష్టమైన ప్రణాళిక, కార్యక్రమం ఏదీ ఇంత వరకూ చేపట్టలేదు. డాలర్ విలువ హెచ్చుతగ్గుల ప్రభా వం అన్ని దేశాలపైనా ఉంటుంది. ముఖ్యంగా మన దేశం లో రూపాయి విలువను డాలర్‌తో సరిపోల్చి లెక్క గడుతుంటారు. అమెరికాలో కూడా నిరుద్యోగం విలయ తాండవం చేస్తోంది. అక్కడ ఐటి కంపెనీలు, పరిశోధనా సంస్థల్లో పని చేసే వారికి తప్ప సామాన్యులకు ఉపాధి అంతంత మాత్రమే. సగటు మధ్యతరగతికి లభించాల్సి న సౌకర్యాల విషయంలో మన దేశమే ఎంతో మేలనిపి స్తుంది. అమెరికా వెళ్ళి డాలర్లు సంపాదించుకోవచ్చనీ, డబ్బును వెనకేసుకోవచ్చుననేది గత కాలపు అంశంగానే మిగిలి పోతున్నది. ఇప్పుడు మన దేశంలోనే ఉద్యోగావ కాశాలు లభిస్తున్నాయి. అమెరికాలో ఆటో పరిశ్రమకు ఎక్కువ నిధులు కేటాయించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎల్లెన్ మస్క్ ఈ మధ్య వివాదా స్పద వ్యాఖ్యల ద్వారా రోజూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఆయన ఒప్పందాల ప్రకటనలు అమెరికాకు చేటు తెస్తు న్నాయి. ఇలాంటి పారిశ్రామికవేత్తల వల్ల కూడా అమెరికా దెబ్బతింటున్నది. ఐటి కంపెనీలు కూడా చాలా మటుకు మన దేశాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకునేందు కు సన్నాహాలు చేస్తున్నాయి. అమెజాన్ అతి పెద్ద వ్యాపార కేంద్రాన్ని భారత్‌లో ప్రారంభించేందుకు యోచన చేస్తోం ది. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో అమెరికా, చైనాలు లాభ పడదామనుకున్నాయి కానీ, రెండూ చెరోవిధంగా దెబ్బతిన్నాయి. చైనా రష్యాకు, అమెరికా ఉక్రెయిన్‌కి మద్దతు ఇచ్చాయి. ఉక్రెయిన్‌కి అమెరికా ఆయుధాలు సరఫరా చేసింది. దీని వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడింది.అలాగే,అఎn్గానిస్తాన్‌లో సంకీర్ణ సేనల ను దశాబ్దాల పాటు కొనసాగించడం అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపింది. వాణిజ్య రంగం లో చైనా దూసుకుని పోవడం చూసి అమెరికా దిగులు చెందుతోంది.ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాపై వివిధ దేశాలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో అంతర్జాతీ య వాణిజ్య రంగంలో భారత్ ప్రముఖ పాత్ర వహించా లని తాము ఆశిస్తున్నట్టు అమెరికా వాణిజ్య ప్రతినిధి కేథరిన్ తాయ్ అన్నారు. భారత్‌తో వాణిజ్య ఒప్పందాల కు వివిధ దేశాలు ప్రాధాన్యం ఇస్తున్నాయనీ, వీటిని అమెరికా ప్రోత్సహిస్తోందని ఆమె చెప్పారు. అమెరికా లో సంపదను వృద్ధి చేయడంలో ఎన్నారైల పాత్రను బిడెన్ ఇటీవల ప్రశంసించారు. అమెరికాలో విద్యాభ్యా సానికీ, పరిశోధనలకు వెళ్ళేవారిపై ఆంక్షలు తొలగించా రు. భారతీయ మేథావుల శక్తి సామర్థ్యాలను గరిష్టంగా వినియోగించుకోవాలని అక్కడి ప్రభుత్వం ఆలోచిస్తోం ది. అమెరికాకు ఇప్పుడు ఆర్థిక,వాణిజ్య రంగాల్లో భారత్ నమ్మదగిన దేశంగా పరిగణింపబడుతోంది.