Wednesday, November 20, 2024

అఫ్గాన్‌లో ఆకలి కేకలు…

అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు అధికారాన్ని చేపట్టిన తర్వా త రెండవ శీతాకాలం నడుస్తోంది.అఫ్గన్‌ ప్రజల అన్న పానీయాలు లేక అలమటిస్తున్నారు. అఎn్గాన్ల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. విదేశాల నుంచి రావల్సిన నిధులు ఆగిపోయాయి. పిల్లల్నిఎలా ఊరడించాలో తెలియక వారికి మత్తు మందులు ఇచ్చి పడుకో పెట్టేస్తున్నారు. ప్రజలెన్ని కష్టాలు పడుతున్నా తాలిబన్‌ పాలకులు ముఖం చూపడం లేదు. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు అల్లాడుతున్నారు. దేశంలో అతి పెద్ద మూడవ నగరమైన హెరాట్‌లో బాంబుదాడులనూ, చలిని తట్టుకోవడానికి మట్టి ఇళ్ళకు అధిక సంఖ్యలో జనం చేరుతున్నారు. పిల్లలకు పట్టెడన్నం పెట్టలేని స్థితిలో ఆఎఫ్గాన్‌ పౌరులు ఉన్నారు. ఆకలిని చంపుకోవడానికి మాత్రలను వాడుతున్నారు. పిల్లలకు కూడా అవేఇస్తున్నారు. దాని వల్ల వారి ఆరోగ్యం దెబ్బతింటోంది. చిన్న పాటి రొట్టె ముక్క కూడా పెట్టలేనిదీనాతి దీనమైన పరిస్థితిలో ఉన్నారు. అల్ఫ్రా జలోమ్‌ గుళికలను వాడుతున్నారు. అవి చాలా ప్రమాదకరమైనవని వైద్యులు ఇప్పటికే హెచ్చరించారు. ఇలాంటి గుళికలను వాడటం వల్ల కాలేయం దెబ్బతింటుందని వైద్యలు హెచ్చరిస్తున్నారు.

అఫ్గనిస్తాన్‌లో ఇలాంటి పరిస్థితి ఇంతకుముందెన్నడూ లేదనీ, తాలిబన్లు అధికారంలోకి రాకముందు ఒక విధంగా, ఇప్పుడు మరో విధంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. యువకులను పాకిస్తాన్‌ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాద సంస్థల్లోకి తల్లితండ్రులే పంపేస్తున్నారు. అఎn్గాన్‌లో ఆహార పదార్దాలు, మందులను సరఫరా చేసే స్వచ్ఛంద సంస్థలను తాలిబన్లు రానివ్వడం లేదని ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే భారత్‌ అఫ్గాన్‌ ప్రజల కోసం కోట్లాది రూపాయిల గోధుమలనూ, మందులనూ పంపింది. భారత్‌, తదితర దేశాల నుంచి వస్తున్న సహాయ సామగ్ర ట్రక్కులను తాలిబన్లు అడ్డుకుంటున్నారు. విదేశాల నుంచి వచ్చిన సహాయ సామగ్రి అసలైన లబ్ధిదారులకు చేరడం లేదు. అఫ్గాన్‌ దళాలు పంచుకుంటున్నాయి. కొన్నింటిని మంచులో నిల్వ ఉంచేస్తున్నారు. దాని వల్ల అవి ఎందుకూ పనికి రాకుండా పోతున్నాయి. తాలిబన్ల వైఖరి కారణంగా అంతర్జాతీయ సహాయ సంస్థలేవీ ముందుకు రావడం లేదు. పిల్లల ఆకలి బాధలను చూడలేక. తిండి కోసం ఏ పనైనా చేసుకుందామంటే అసలు పనులు దొరకడం లేదు.

- Advertisement -

ఈ పరిస్థితిలో కొంత మంది డబ్బు కోసం కిడ్నీలు, కాలేయాలు అమ్ముకుంటున్నారు. మరి కొందరు ఆడపిల్లలను ఇతరులకు అమ్మేస్తున్నారు. ఇళ్ళల్లో ఉన్నా వారికి భద్రత లేదు. అందువల్ల ఎక్కడైనా సుఖంగా ఉండటం తమకు ప్రధానమని వారిని విక్రయిస్తున్నారు. తాలిబన్‌ సైనికులు ఆడవారిపై ఆంక్షలు విధిస్తున్నారు. ఇళ్ళ నుంచి బయటికి రావడానికి వీల్లేదని హుకుం జారీ చేస్తున్నారు. పాకిస్తాన్‌కు కొంత మంది జారుకుని అక్కడ ఉగ్రవాద సంస్థల్లో చేరుతున్నారు. అక్కడ వారికి రక్షణ లేదు. అఫ్గాన్‌లో తాలిబన్‌ సైనికులే దళారులుగా వ్యవహరిస్తున్నారు. కిడ్నీలు, కాలేయాలు అమ్ముకునే వారికి ఆస్పత్రులలో పూర్తి సొమ్ము దక్కనివ్వకుండా దళారులు కమిషన్‌ తీసుకుంటున్నారు. కిడ్నీ దాతలకు రావల్సిన సొమ్మును పూర్తిగాఒకే సారి ఇవ్వకుండా దఫదఫాలుగా ఇస్తున్నారు. దీంతో వారికి సకాలంలో వైద్యం అందక, తిండికి డబ్బులేక కొంత మంది ప్రాణాలు విడిచిన సంఘటనలు కూడా ఉన్నాయి. కిడ్నీలకు ఆస్పత్రుల్లో ఇచ్చే సొమ్ము కన్నా బాగా తక్కువగా ఇస్తున్నారు. అలాగే, కిడ్నీలు సేకరించే ఆస్పత్రుల్లో మందులు, వైద్యచికిత్సలు అందిస్తామని నమ్మబలికే మధ్యవర్తులు ఆ తర్వాత చిరునామా లేకుండా తప్పించుకుంటున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో చిన్నారి పాపలను విధిలేక అమ్ముకోవల్సి వస్తోందని నిజాముద్దీన్‌ అనే పౌరుడు చెప్పారు. తాలిబన్లు అధికారాన్ని చేపట్టక ముందు ఎన్నో హామీలు ఇచ్చారనీ, స్వపరిపాలనలో ఎన్నో లాభాలున్నాయనీ, సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీలు గుప్పించారు. కాని అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. సరిహద్దు గాంధీ ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌ వంటి గాంధేయవాదులకు పుట్టినిల్లయిన అఫ్గాన్‌లో ప్రస్తుత పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ప్రభుత్వ కార్యాలయాలనేవి నామకంగా పని చేస్తున్నాయి. ప్రజలు తమ గోడు వెళ్ళబోసుకుందామని వెళ్తే వారి మొరవినేవారెవరూ ఉండరు. అఫ్గాన్‌లో పౌష్టికాహార లోపంతో 55 శాతం మంది బాధ పడుతున్నారు. వారికి సరైన తిండి దొరకడం లేదు.అంతర్జాతీయంగా వివివిధ దేశాలు విధించిన ఆంక్షల వల్ల తమకు విదేశీ సాయం అందడం లేదని హెరాట్‌ ప్రావిన్స్‌ అధికార ప్రతినిధి చెప్పారు.కాని, అది నిజం కాదు, తాలిబన్లలో వర్గ విభేదాలు కూడా ఉన్నాయి. అవే ప్రజలకు సాయం అందకుండా చేస్తున్నా యని పలువురు పేర్కొంటున్నారు. మరో వంక అంతర్జా తీయ సంస్థలు అఫ్గాన్‌లో పరిస్థితి గురించి పట్టించుకో వడం లేదు. నరకమంటే ఏమిటో తెలియదు కానీ, అఫ్గాన్‌ ప్రజలు ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement