Thursday, November 21, 2024

కమ్ముతున్న అణు యుద్ధ భయాలు

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ప్రారంభించి ఎనిమిది మాసాలు దాటింది. ఉక్రెయిన్‌పై రష్యా ప్రయోగించిన సామదానబేధ దండోపాయాలన్నీ విఫలమయ్యాయి. ఈ ఎనిమది మాసాల్లో రష్యా అరవై వేల మంది సైని కులను కోల్పోయింది. వీరిలో మేజర్‌ ర్యాంకు వారు కూడా ఉన్నారు. ఈ యుద్ధంలో రష్యా ఎన్నో పోగొట్టు కుంది. అయితే,. ఉక్రెయిన్‌తో పోలిస్తే రష్యాకు సంభవించిన ఆస్తి, ప్రాణ నష్టాలు తక్కువే. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నగరం సహా పలు ప్రాంతాలు మరుభూములుగా మారాయి. ఉక్రెయిన్‌లో విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థను దెబ్బతీయడమే లక్ష్యంగా రష్యా దాడులు జరుపుతోంది. ఇంత జరిగినా రష్యాకు పశ్చాత్తాపం ఇసుమంతైనా కలగలేదు. పైగా ఇప్పుడు అణు యుద్ధా నికి సన్నాహాలు ప్రారంభించింది. రష్యా జరుపుతున్న విన్యాసాలు ఏ క్షణమైనా అణుయుద్ధం తప్పదనే సం కేతాలు పంపుతున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఈ విన్యాసాలను స్వయంగా పర్యవేక్షించారు. ఒకప్పుడు అమెరి కాను రష్యా యుద్ధోన్మాది అని అనేది. ఇప్పుడు రష్యా అంతకు వెయ్యిరెట్లు ఉన్నాదంతో ఊగిపోతోంది. గడి చిన కొద్ది రోజులుగా రష్యా తీరు యావత్‌ ప్రపంచానికీ ఆందోళన కలిగిస్తోంది. ఇతర దేశాలు అణుయుద్ధ బెదిరింపులకు దిగితే ప్రతిస్పందించడానికి బాధ్యత వహించే దళాలకు రష్యా ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. అణు యుద్ధంవస్తే కేవలం రష్యా, ఉక్రెయిన్‌లకే కాదు, యావత్‌ ప్రపంచ దేశాలకు ముప్పు అని తెలిసున్నా, రష్యా అధ్య క్షుడు పుతిన్‌ చాలా మూర్ఖంగా, దుర్మార్గంగా అడుగులు వేస్తున్నారు.

ఉక్రెయిన్‌ని లొంగతీసుకోవ డానికి ఎన్ని హెచ్చరికలు చేసినా ఫnలితం లేకపోవడంతో అణు బాంబు ప్రయోగం అనివార్యమనే నిశ్చయానికి పుతిన్‌ వచ్చినట్టు భావించాల్సి వస్తోంది. ఇంతకాలం జరిపిన దాడుల వల్ల ప్రయోజనం శూన్యమని తెలుసుకోవడానికి ఆయనకు చాలా సమయం పట్టింది. సైనిక విన్యాసాలను కంట్రోల్‌ రూమ్‌ నుంచి పుతిన్‌ స్వయంగా పర్యవేక్షించారు. రేడియో ధార్మిక శక్తిని సృష్టించగల డర్టీ బాంబును ప్రయోగించాలని ఉక్రెయిన్‌ సిద్ధపడుతున్న విషయం తనకు ముందే తెలుసునని పుతిన్‌ అంటూండగా, రష్యాయే డర్టీబాంబులను ప్రయోగించి, ఆ నెపాన్ని తమపైకి నెట్టివేసే కుట్రకు పాల్పడుతోంది ఉక్రెయిన్‌ ప్రత్యారోపణ చేసింది. ఉక్రెయిన్‌పై హెచ్చరికలు ఫలించ కపోవడంతో అణ్వాయుధాలను లేదా రసాయినిక ఆయుధాలు ప్రయోగించక తప్పదని నిర్ణయానికి వచ్చిన పుతిన్‌ మౌలిక సదుపాయాలను కాపాడు కునేందుకు భద్రత పెంచాలని ఆదేశాలనిచ్చినట్టు తెలుస్తోంది. అణుయుద్ధం కేవలం బెదిరింపులకే తప్ప అందుకు ఏ ఒక్క దేశమూ సాహసించదని ఇంతకాలం అనుకున్నారు. అణుయుద్ధం బెదిరింపులకు ఉత్తర కొరి యా అధినేత కిమ్‌ ఉన్‌ జోంగ్‌ మాత్రమే పాల్పడేవాడు. ఇప్పుడు అంతకన్నా కఠినమైన నిర్ణయాన్ని పుతిన్‌ తీసుకున్నట్టు తెలుస్తోంది. భారీ అణు దాడిని అనుక రించేందుకు అవసరమైన కసరత్తులను పూర్తి చేసినట్టు రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగ్‌ పుతిన్‌కి సమాచారం అందించారు.

- Advertisement -

నార్వే తీరానికి పది కిలోమీటర్ల దూరంలో రష్యన్‌ జలాంతర్గామి ద్వారా ఐసిబీఎం (ఖండాంతర బాలిస్టిక్‌క్షిపణి) సినేవా ప్రయోగం జరిగింది. ఉక్రెయిన్‌పై విజయం తమదేనంటూ ప్రకటిస్తూ వచ్చిన రష్యా ఇప్పుడు ఆత్మరక్షణలో పడటం వల్లనే ఈ కసరత్తులు, విన్యా సాలు చేస్తోందని యుద్ధ నిపుణులు పేర్కొంటున్నారు. పుతిన్‌ వేస్తున్న అడుగుల ప్రభావం ఎంత వరకూ ఉంటుందనే అంశంపై పోలండ్‌ తదితర దేశాలు అంచనా వేస్తున్నాయి. యూరప్‌లోని అతి పెద్ద అణు విద్యుత్‌ కేంద్రం ధ్వంసానికి రష్యన్‌ దళాలు రహస్యంగా పని చేస్తున్నాయి. వాటి యత్నాలు ఫలిస్తే యావత్‌ యూరప్‌ గాడాంధకారం అలుముకుంటుంది.
రష్యా ఆలో చనలు, సన్నాహాలు అన్ని దేశాలను కల వరపరుస్తున్నాయి. ఇంత కుముందు రష్యాని పరిపాలించిన పాల కులెవరూ చేయని అత్యంత దుర్మార్గమైన ఆలోచ నలను పుతిన్‌ చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అణుయుద్ధం వస్తే ఎవరూ మిగలరు. రష్యా లక్ష్యాలు, రష్యా శత్రువులు పరిమితమైనవే కావచ్చు. కానీ, పుతిన్‌ తొందరపాటు చర్యలకు పాల్పడితే యావత్‌ ప్రపంచం భస్మీపటలం అయిపోవడం ఖాయమని శాంతి కాముకులు హెచ్చరిస్తున్నారు. రష్యా అణు ప్రయోగం చేస్తే అమెరికా అంతకు అంత బదులు తీర్చుకునే ప్రయ త్నం చేయవచ్చు. అగ్ర రాజ్యమూ, ఒకప్పటి అగ్ర రాజ్యమూ పరస్పరం యుద్ధా నికి తలపడితే చిన్న , బడుగు దేశాలు నామ రూపాలు లేకుండా పోతాయి. వసుధై క కుటుంబ విశ్వశాంతి కోసం పుతిన్‌ తన ఆలోచనలకు స్వస్తి చెప్పి ఉక్రెయిన్‌తో తన వివాదాలను శాంతియుత మార్గాల ద్వారా పరి ష్కరించుకోవాలి. ఇరుదేశాలకూ మన ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన అమూల్యమైన సలహా ఇదే.

Advertisement

తాజా వార్తలు

Advertisement