Friday, November 22, 2024

మత్తు వదిలించాల్సిందే!

మత్తులో పడితే చిత్తవుతామని తెలిసినా దానికి బాని సలవుతున్నారు యువతీయువకులు.మత్తు వల్ల ఆర్థిక ఇబ్బందులు, శారీరక రుగ్మతలు తథ్యమని పెద్దలు ఎంత మొత్తుకుంటున్నా, సహవాసాల ప్రభావమో,ఆధునిక నాగరికత ప్రభావమో కానీ, మాదక ద్రవ్యాలకు బానిసల వుతున్న యువతరం తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతోంది. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో మత్తు పానీయాలకూ,మాదక ద్రవ్యాలకూ హైదరాబాద్‌కీ, పొరుగున ఉన్న బీదర్‌కీ పరుగులు తీసేవారు. ఇప్పుడు ఆ అవసరం లేకుండా ఎక్కడ పడితే అక్కడ మాదక ద్రవ్యాలు పుష్కలంగా దొరుకుతున్నాయి. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మాదక ద్రవ్యాలంటే గతంలో హెరాయిన్‌, కొకైన్‌ వంటివి మాత్రమే కాదు. గంజాయి కూడా మత్తెక్కిస్తోంది. అసలు మత్తుకు గంజాయే పుట్టినిల్లు.

గంజాయిని ఏజెన్సీ ప్రాంతంలో పండిస్తారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి హైదరాబాద్‌ చేరుకుని ముంబై, పుణ, రాజస్థాన్‌ వంటి ఉత్తరాది రాష్ట్రాలకు రవాణా అయ్యేది. సరకు రవాణతో పాటే గంజాయి రవాణా యథేచ్ఛగా సాగుతోంది. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూ రు, ముంబై వంటి మహానగరాలకు పరిమితమైన గంజాయి వ్యాపారం కోస్తా ఆంధ్రలో తిష్ట వేయడం ఆందోళన కలిగిస్తోంది. రాజకీయ నాయకుల ప్రమేయం లేనిదే గంజాయి సాగు, రవాణా ఇంత ఉధృతంగా జరగ దన్న మాట నిజమే. ఇది ఆరోపణ కాదు. ప్రభుత్వానికీ, ముఖ్యంగా ఎక్సైజ్‌ శాఖకు అన్ని వివరాలూ తెలుసు. కానీ, ఏమీ చేయలేని స్థితిలో యంత్రాంగం ఉంది.

ఈ యంత్రాంగంలో కొంత మంది అధికారులు, ఉద్యోగు లు దీపం ఉండగా ఇల్లు దిద్దుకునే రీతిలో అవినీతికి పాల్ప డి కోటీశ్వరులవుతున్నారు. గంజాయి రవాణాకు విశాఖ కేంద్రంగా ఇటీవల కాలంలో బాగా పేరుమోసింది. గంజాయి సాగులో మహిళలు, గిరిజనులు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగు విస్తీర్ణం ఏటేటా పెరుగుతోంది. ఈ విషయం తెలిసినా అధికారులు అప్పుడప్పుడు దాడుల పేరిట హడావుడి చేయడం తప్ప కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో కొరియర్‌ సంస్థలు, ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు సంస్థల ప్రమే యం కూడా ఉన్నట్టు సమాచారం. కోట్ల రూపాయిల విలువ చేసే టన్నుల కొద్ది గంజాయిని పోలీసులు దగ్ధం చేశారు. మాదక ద్రవ్యాల వ్యాపారం వందల కోట్ల పైనే ఉంటోంది. సులభంగా డబ్బు సంపాదించాలనుకునే వారు ఈ వ్యాపారంలోకి దిగుతారు.

విదేశాల నుంచి దిగుమతి అయ్యే మాదక ద్రవ్యాలకు గతంలో ముంబా యి అగ్రస్థానంలో ఉండేది. ఏభై ఏళ్ళ క్రితం దమ్‌ అరె దమ్‌ అనే పాట మాదక ద్రవ్యాల బానిసలపై చిత్రీకరణ జరిగింది. ఆ పాట ఇప్పటికీ ఎంతో ప్రాచుర్యాన్ని కలిగి ఉంది. మద్యపానం , మాదక ద్రవ్యాల సేవనం గతంలో అక్కడక్కడ గుట్టు చప్పుడు కాకుండా జరిగేవి. ఇప్పుడు పబ్లిగ్గా రోడ్ల మీదే జరుగుతున్నాయి. దేవాలయాల పక్క నే మాదక ద్రవ్యాల సిగెరెట్లను తాగే యువతీ యువకుల సం ఖ్య పెరిగిపోతోంది. హైదరాబాద్‌లో పబ్‌ల సంస్కృతి బాగా పెరిగింది. పబ్‌లలో మత్తు పానీయాలతో పాటు మాదక ద్రవ్యాలను కస్టమర్లకు అందజేస్తారన్న ఆరోపణ లు తరచూ వినిపిస్తూ ఉంటాయి. పోలీసులు ఈ పబ్‌లపై దాడి చేసినప్పుడు సెలబ్రెటీలు కూడా పట్టుబడిన ఉదం తాలు ఉన్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే గత ఏడాది రెండు లక్షల కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు ప్రభుత్వం విడుదల చేసిన సమాచారం తెలుపుతోంది. కేంద్ర డైరక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజె న్స్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశ వ్యాప్తంగా 7 లక్షల కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకో గా, అందులో 26 శాతం ఆంధ్రప్రదేశ్‌లోనే స్వాధీనం చేసుకున్నట్టు ప్రభుత్వ నివేదిక తెలియజేస్తోంది.

- Advertisement -

అరెస్టు అయిన వారు బెయిల్‌ సంపాదించుకుని బయటికి వచ్చే స్తున్నారు. నిషేధిత మాదక ద్రవ్యాల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 7.5 లక్షల మంది మృత్యువాత పడుతున్నా రు. మనదేశంలో ఈ విధమైన మరణాల సంఖ్య 22వేలు గా తేలింది. ఇది ఐదేళ్ల కిందటి లెక్క. ఇప్పుడు ఈ సంఖ్య కనీసంగా రెట్టింపు అయివుంటుంది. అంతర్జా తీయంగా డ్రగ్స్‌ లావాదేవీల విలువ రమారమి లక్ష కోట్లకు పైగానే ఉంటుందని అంచనాలున్నాయి. దేశీయంగా ఒపియా యిడ్‌ బాధితులు 2.3కోట్ల మంది ఉన్నారు. 14ఏళ్లలో దీని వినియోగం ఐదింతలైంది. ఎయిమ్స్‌ నివేదిక ప్రకారం దేశంలో కన్నాబీస్‌ వినియోగదారుల సంఖ్య 3.1కోట్లకు చేరింది. వీరిలో 1.3కోట్ల మంది గంజాయి, చరాస్‌ తీసుకుంటుండగా, మిగతావాళ్లు భంగ్‌ మత్తులో తేలుతున్నారు. రాష్ట్రాల వారీగా చూస్తే కన్నాబీస్‌ విని యోగదారులలో యూపీ మొదటి స్థానంలో ఉంది. ప్రజల్లో కూడా గంజాయి విషయంలో చూసీచూడని ధోరణి పెరగడం వల్ల గంజాయి వ్యాపారం మూడు పువ్వులు, ఆరుకాయలుగా సాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement