Wednesday, November 6, 2024

Editorial : ఆహార, విహారాలు… రాజ్యాంగ స్వేచ్ఛ!

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతిపక్షాల ఎన్నికల ప్రణాళికలపై వ్యాఖ్యానిస్తూ వారి మైండ్‌ సెట్‌ ముస్లింలీగ్‌ మైండ్‌ సెట్‌కిదగ్గరగా ఉందంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసిన రోజున ఆయన ఆ పార్టీ మ్యానిఫెస్టోపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నాయ కుడు రాహుల్‌ గాంధీ తీవ్ర స్థాయిలో స్పందించారు. మటన్‌, మొగల్‌, ముస్లిం అనే పదాలను మోడీ వినియోగించారు.అంటే దేశంలో ఉన్న మైనారిటీ వర్గాలను తమ వైపునకు తిప్పుకోవడానికి కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని ఆయన చురకలంటించారు.

దీనిపై రాహుల్‌ స్పందిస్తూ తమ పార్టీ మొదటి నుంచి సెక్యులర్‌ విధానాన్నే అనుసరిస్తోందనీ, ఓట్ల కోసం మైనారిటీలను బుజ్జగించడం లేదని అన్నారు. తమ పార్టీ ఆవిర్భావం నాటి నుంచి పార్టీ అధ్యక్షులుగా ఎంతో మంది ముస్లింలు వ్యవహరించారని కూడా రాహుల్‌ స్పష్టం చేశారు. ముస్లింలు, మైనారిటీలను ఆకర్షించేందుకు తమ పార్టీ ఈరోజు కొత్తగా వాగ్దానాలను చేయలేదనీ, అలా చేయాల్సిన అవసరం తమపార్టీకి లేదని ఆయన అన్నారు. ఆ మాట నిజమే కాంగ్రెస్‌ మొదటి నుంచి సెక్యులర్‌ భావా లను కలిగి ఉంది. అన్ని కులాలు, మతాలు, జాతుల వారు ఆ పార్టీలో ఉన్నారు. అసలు కాంగ్రెస్‌ని నెలకొ ల్పిందే బ్రిటిష్‌ జాతీయుడు. అదే విషయాన్ని రాహుల్‌ గుర్తు చేశారు. కానీ, మాడీ ప్రతిపక్షాలను విమర్శించేం దుకు వారి ఆహారపు అలవాట్లను ఎత్తిచూపటం ప్రస్తుత వివాదానికి కారణమైంది..

కాంగ్రెస్‌కి సన్నిహిత మిత్ర పక్షమైన రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌జెడి) అధ్యక్షుడు తేజస్వి యాదవ్‌ చేపలను తింటూ ఉన్న వీడియోపై మోడీ వ్యాఖ్యానిస్తూ, నవరాత్రి పర్వదినాల్లో మాంసం ఎవరూ తినరు.నియమాల ను పాటిస్తారు. అలవాట్లు సంప్రదాయాల విషయంలో ప్రతిపక్షాలు ముస్లింలు, మైనారిటీలకు దగ్గరగా ఉన్నాయని మోడీ విమ ర్శిం చారు. దీనిపై ఆ పార్టీ నాయకులు ఎదురు దాడి చేశారు. ఎవరి ఆహారపు అలవాట్లు వారివనీ, తరతరాలుగా వస్తున్న ఆహారపు అలవాట్లను మాను కోవడం అంత సులభం కాదని వారు స్పష్టం చేశారు. మోడీ నవరాత్రి ఉత్సవాల సమయంలో శాకాహారాన్నే స్వీకరిస్తారు. అందువల్ల అదే విషయాన్ని ఆయన ప్రస్తావించి ఉండవచ్చు. అంతమాత్రాన ఎదుటి వారి ఆహార అలవాట్లను పురస్కరించుకుని వారిని హిందూ వ్యతిరేకులుగానూ, భారత్‌ వ్యతిరేకులు గానూ ముద్ర వేయడం తగదు. ఎన్నికల్లో లౌకికవాదులకూ, మత వాదులకూ మధ్య చిచ్చు రేపేందుకే ఇలాంటి వ్యాఖ్యలు పనికివస్తాయి.

- Advertisement -

బీజేపీ ఒక్కొక్క సారి ఒక్కొక్క అంశాన్ని తీసుకుని ప్రతిపక్షాలను దుమ్మెత్తి పోస్తూ ఉంటుంది. తరతరాలుగా మాంసాహారులుగా కొనసాగుతున్న వారు మన దేశంలో ఉన్నారు. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ కూట మికి మాత్రం మాంసాహారులంటే దేశ వ్యతిరేకులనే భావనఉంది. మొగలాయీల కాలంలోనే దేశంలో ప్రజల ఆహార అలవాట్లు మారాయని వారి నిశ్చితాభి ప్రాయం. హిందువులు… పండుగలు, పర్వదినాల్లో మాంసాహారానికి దూరంగా ఉంటూ నియమాలు పాటించేవారనీ, విదేశీ దండయాత్రల కాలంలోనే మెజారిటీ వర్గం ప్రజల ఆహార అలవాట్లు మారాయన్నది బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుల అభిప్రాయం కావచ్చు. మైనారిటీల మైండ్‌ సెట్‌ను హిందువులు అలవర్చుకు న్నారని వారి ఆరోపణ. మొగలాయీల కాలంలో మన దేశంలో ఆహార,విహార విధానాల్లో మార్పులు వచ్చిన మాట నిజమే. అయితే, అందరూ అందుకు అలవాటు పడలేదు.అక్బర్‌ ఆస్థానంలో తోమర్‌మల్‌ అనే మంత్రి ఉండేవాడు.కాశీలో విశ్వేశ్వరాలయాన్ని కట్టించింది ఆయనే. అలాగే, బీర్‌బల్‌ కథల గురించి మనం ఎన్నో విన్నాం. సంత్‌ కబీర్‌ దాస్‌ రాముణ్ణి కీర్తిస్తూ ఎన్నో కీర్తనలు రాశాడు.

రామభక్తిని గురించి ప్రచారం చేశాడు. అం దువల్ల మొగలాయీల కాలంలో హిందువులంతా పరివర్తన చెందారని అనుకోవడం పొరపాటు. అయితే, కొందరు మొగలాయీ పాలకుల హయాం లో హిందువు లపై బలవంతపు మతమార్పిడి ఒత్తిడులు జరిగినట్టు చరిత్ర చెబుతోంది. అలాంటి వారి సంఖ్య స్వల్పమే. హిందువులు,ముస్లింలు ఆరోజుల్లో సహ జీవనం సాగించినట్టు కూడాచరిత్ర చెబు తోంది.దేశ విభజనకు ముస్లింలీగ్‌ నాయ కుడు మహ్మద్‌ ఆలీ జిన్నా కారకుడని ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటాం. ఆయన ఒత్తిడి వల్లనే పాకిస్తాన్‌ ఏర్పడింది. పాక్‌ ప్రజలు జిన్నాను జాతిపితగా ఆరాధిస్తూ ఉంటారు. అది నిజమే. కానీ, దేశ విభజన త ర్వాత భారత్‌లో స్థిరపడిన వారిలో ముస్లింలూ ఉ న్నారు. ఈ దేశ రాజ్యాంగానికి కట్టుబడి వారంతా భార తీయులుగా కొనసాగుతున్నారు. కనుక వివిధ పార్టీల్లో ముస్లింల ప్రాతినిధ్యాన్నీ, ముస్లిం నాయకుల నాయ కత్వాన్ని తప్పు పట్టలేం. కాంగ్రెస్‌ మ్యా నిఫెస్టోలో మౌలానా ఆజాద్‌ స్కాలర్‌ షిప్‌లను కొనసాగిస్తామని మాత్రమే వాగ్దానం చేయడం జరిగింది. కాంగ్రెస్‌ని సెక్యు లర్‌ పార్టీగా బీజేపీయేతర పార్టీల్లో చాలా పార్టీలు ఇప్పటికీ అంగీక రిస్తున్నాయి. అందువల్ల తినే తిండినీ, ఆహార్యాన్నిబట్టి వారంతా ముస్లిం లీగ్‌కి దగ్గ రగా ఉన్నారనడం సమం జసం కాదు. ఆహార, విహా రాల్లో దేశ ప్రజలకు మన రాజ్యాం గం స్వేచ్ఛ ఇచ్చిన సంగతి మరువరాదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement