Wednesday, November 6, 2024

Editorial : అగ్నిప్రమాదాలు… మానవ తప్పిదాలు!

ఢిల్లిలో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించి ఏడుగురు నవజాత శిశువులు మరణించారు.మరో 12 మందిని అగ్ని మాపక దళం వారు రక్షించారు. వేసవి కారణంగా ఏసీ లు, ఇతర కరంట్‌ సంబంధిత సౌకర్యాల వల్ల విద్యుత్‌ వాడకం ఎక్కువై షార్టు సర్క్యూట్‌ వల్ల ప్రమాదం జరిగిందని చెబుతు న్నారు.

- Advertisement -

ఒక్క ఢిల్లిలోనే కాక, దేశంలోని ప్రధాన నగరా లన్నింటిలోనూ ఇదే పరిస్థితి. దేశ వ్యాప్తంగా 37 నగరా ల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు మించి ఉందనీ,కొన్ని చోట్ల 50 డిగ్రీలకు చేరుకుందని అధికారులు చెబుతున్నారు. గృహాల్లో కరంట్‌ వాడకం పెరగడాన్ని అదేదో తప్ప యినట్టు పరి గణిస్తూ ఉం టారు. ఉక్కపోత కారణంగా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు వేసుకోనిదే జీవించడం కష్ట మని ప్రజలు వాపో తున్నారు. అయితే, ఆస్పత్రులు,పెద్ద పారిశ్రామిక సంస్థ ల్లో జనరేటర్లు ఉన్నా, లోడ్‌ షెడ్డింగ్‌ తప్పడం లేదం టు న్నారు. దాదాపుగా ఇదే రోజున గుజ రాత్‌ రాజ్‌కోట్‌ జిల్లాలో గేమింగ్‌ జోన్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది పిల్లలతో సహా 27 మంది మరణించారు.

షార్టు సర్క్యూట్‌ వల్ల ఈ ప్రమాదం జరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇది పూర్తిగా మానవ తప్పిదమేననీ, నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకుని ఉండి ఉంటే ఈ ప్రమాదం సంభవించి ఉండే ది కాదని స్థానికులు పేర్కొంటున్నారు. రాజ్‌కోట్‌ ప్రమాదం లో అధికారుల తీరుపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించే భవన ప్రారంభానికి హాజరై నట్టు ఆధారాలు ఉన్నా యనీ, ఫైర్‌సేఫ్టీ నిబంధనలు లేకుండా గేమింగ్‌ కార్యక్ర మానికి అనుమతి ఎలా ఇచ్చా రని అధికారులను హైకోర్టు తీ వ్రంగా మందలించింది. ఈ రెండు ప్రమా దాల్లో మా నవ తప్పిదం స్పష్టంగా క నిపిస్తోంది. చాలావరకు మానవ తప్పి దాల వల్లనే అగ్ని ప్రమాదాలు సంభ విస్తుంటాయన్నది జగద్విదితం.

ఆస్పత్రుల్లో ప్రమా ణాలు పాటించకపోవడం వల్లనే ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రతి ఆస్పత్రిలో అగ్ని మాపక యంత్రాలు ఉండాలి. ఆస్పత్రులే కాదు, పెద్ద ఫ్యాక్టరీలు, కర్మా గారాల్లో అగ్నిమాపక యూనిట్లు ఉండాలి, వాటికి లైసెన్స్‌లు జారీ చేసేటప్పుడు ఇవన్నీ తనిఖీ చేసి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్లు ఇవ్వాలి. కోల్‌కతాలో ఆ మధ్య ఇదే మాది రిగా షార్టు సర్క్యూట్‌ వల్ల ఘోరమైన ప్రమాదం సంభ వించింది. అగ్ని ప్రమాదాల్లో అధిక భాగం మాన వ తప్పిదాలేనని స్పష్టంగా తేలుతోంది. ముని సిపల్‌ ,కార్పొరేషన్‌ కార్యాల యాల్లో అవినీతి కారణంగానే నిర్వాహకులు సులభంగా నో అబ్జెక్షన్‌ సర్టిఫి కెట్లను సంపాదించగలు గుతున్నా రన్నది. బహిరంగ రహస్యం. అన్ని చోట్లా ఇదే కారణం గా ఫైర్‌ సేఫ్టీ చర్యలను గాలికి వదిలేసి విశృం ఖలంగా అనుమతులు ఇస్తున్నారన్నది బహిరంగ రహస్యం. కరోనా సమయంలో విజయవాడలోని ఒక ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించి రోగులు పలు వురు మర ణించారు.

ఫ్యాక్టరీల్లో, పరిశ్రమల్లో సంభ వించే ప్రమా దాలు వేరు.ఆస్పత్రుల్లో జరిగే ప్రమా దాలు వేరు. ఆస్ప త్రుల్లో సిబ్బంది ఎక్కువ మంది ఉంటారు. పర్యవేక్షణ ఎక్కువ ఉంటుంది. అయినా ప్రమాదాలు సంభవి స్తున్నా యంటే మానవ నిర్లక్ష్యమే కారణమని స్పష్టం అవుతోంది. ఆస్పత్రుల్లో వైద్యు లనూ, ఇతర సిబ్బందిని సస్పెండ్‌ చేసినంత మాత్రాన పోయిన పిల్లల ప్రాణాలు తిరిగి వస్తాయా? ఈ సస్పె న్షన్ల‌న్నీ తాత్కా లికమే. పిల్లల భద్రత విషయంలో తల్లితండ్రులకే కాదు, సమాజంలో అందరికీ బాధ్యత ఉంది.పిల్లలను స్కూలు నుంచి తీసుకుని వచ్చే వ్యాన్‌లు ప్రమాదాలకు గురవు తున్న సంఘటనలు ఎన్నో ఉంటున్నాయి.
అన్నింటికన్నా అగ్నిప్రమాదాలు తీవ్రమైనవి. వీటిని నివారించేందుకు ఎక్కడికక్కడ చర్యలు తీసుకోవాలి. ఢిల్లిలో జరిగిన ప్రమాదంలో అగ్నిమాపక సిబ్బందే కాకుండా,స్థానికులు సాయం అందించడం వల్ల అగ్ని కీలల్లో చిక్కుకున్న పిల్లలు బయటపడ్డారు. అగ్నిప్రమా దాల నివారణకు ఆస్పత్రులపై తరచు తనిఖీలను నిర్వహించాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement