ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ప్రారంభించి ఆరు నెలలు దాటింది. ఇప్పటికీ ఉక్రెయిన్ సైనికులు, పౌరులు ఏమా త్రం చేవ తగ్గకుండా రష్యాను తీవ్రంగా ప్రతిఘ టిస్తు న్నారు. ఉక్రెయిన్ స్వాతంత్య్ర దినోత్సవం దేశాధ్యక్షుడు జెలెనిస్కీ దేశ ప్రజలకికచ్చిన సందేశంలో ఉక్రెయిన్ స్ఫూర్తికి అద్దం పట్టింది. సోవియట్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడి 31 సంవత్సరాలు దాటిన ఈ సమయంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొ న్నాం, వీటిని ఎదుర్కోవడంలో ఉక్రెయిన్ ప్రజల ధైర్యసాహసాలను యావత్ ప్రపంచం గుర్తించింది… ఇప్పుడు న్న అంతర్జాతీయ పరిస్థితులలో ఉక్రెయిన్‌కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.రష్యా దాడులను మరింత ముమ్మరం చేసినా లొంగే ప్రసక్తి లేదు…. ఏమాత్రం రాజీ పడం… ఇందుకు ప్రజలం తా సహకరించాలి అని విజ్ఞప్తి చేశారు.
జెలెనిస్కీ టెలివిజన్ ప్రసంగానికి యావత్ ఉక్రెయిన్ ప్రజలు బొటనవేలును చూపుతూ తమ మద్దతును తెలిపారు. ఏ దేశాధినేతకైనా ఇంతకన్నా కావల్సింది ఏముంది.సైనికంగా, ఆయుధపరంగా ఎంతో బలమైన రష్యాను ఎదిరించడం ఎంత సాహసమో ఉక్రెయిన్ సేనలు రుజువు చేశాయి. అంతేకాదు, దేశానికి పెనుముప్పు ఎదురైనప్పుడు యావత్ జాతి ఏకతాటిపై నిలిచి ఎదుర్కోవాలన్న దేశభక్తిని ఉక్రెయిన్ ప్రపంచానికి చాటింది. అమెరికా ఉక్రెయిన్‌పౌరులకు మరింత సాయాన్ని అందించేందుకు వాగ్దానం చేసింది. ఉక్రెయిన్ సేనలు, పౌరులు యావత్ ప్రపంచాన్నీ ఉత్తేజితం చేశారనీ, ఉక్రెయిన్‌కి తాజాగా మూడు బిలియన్ డాలర్ల మిలటరీ,ఆయుధ సంపత్తి సాయాన్ని అందజేస్తామని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రకటించారు. ఈ యుద్ధంలో ఇంతవరకూ వేలాది మంది ఉక్రెయిన్ సైనికు లు, పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
రష్యన్ సైనికుల దాడుల్లో దేశ రాజధాని కీవ్‌సహా ప్రధాన పట్టణాలు, నగరాల్లో ఆకాశ హర్మ్యాలు నేలమట్టమయ్యాయి. ఉక్రెయిన్ తిరిగి కోలుకోవడానికి పాతిక ముప్పయి సంవ త్సరాలు పట్టవచ్చని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేశారు. ఉక్రెయిన్‌కి యావత్ ప్రపంచ దేశాలు మద్దతుగా నిలిచాయి. మన దేశం తటస్థ వైఖరిని అనుసరిస్తోంది. రష్యాకు చైనా మద్దతు ఇస్తోంది. ఈ యుద్ధంలో విజేతలు ఎవరూ లేరు. అయితే, అమెరికా ముందు తమ సైనిక పాటవాన్నీ, రక్షణ వ్యవస్థ ప్రదుర్భావాన్ని రుజువు చేశా మని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటిం చారు.ఈ యుద్ధం కేవలం రష్యా, ఉక్రెయిన్‌లకు మాత్రమే పరిమితమై నప్పటికీ దీని ప్రభావం ప్రపంచ దేశాలన్నింటిపై పడింది. ముఖ్యంగా, ఇంధన రంగంలో రష్యాపై ఆధారపడిన దేశాలు విలవిల లాడు తున్నాయి.
దీనిని అదునగా తీసుకుని చమురు కంపెనీలు ఇంధ నం ధరలను మరింతగా పెంచాయి. రష్యాపై అమెరికా సహా దాని మిత్రదేశాలు తీవ్రమైన ఆంక్షలు విధించాయి. ఈ యుద్ధం వల్ల రష్యా కూడా తీవ్రంగా నష్టపోయింది. వేల మంది సైనికుల నూ, సైన్యంలో మేజర్ పోస్టుల్లో ఉన్న పలువురు ప్రముఖులను కోల్పోయింది. ఇంత సుదీర్ఘ యుద్ధాన్ని జరపడం వల్ల రష్యా సాధించింది ఏమీ లేదు.రష్యా దాడుల ప్రభావంతోఉక్రెయిన్ పౌరుల్లోనూ, సైనికుల్లోనూ మరింత పట్టుదలను పెంచింది. రష్యా ఆక్రమించుకున్న తమ భూభాగాలను విముక్తం చేసేందుకు పోరాడతామని శపథం చేశారు. జలెనిస్కీ ఇచ్చిన పిలుపునకు ప్రజలు ఇంత వేగంగా సమర్ధిస్తారని ఎవరూ అనుకోలేదు. రాజధాని నగరం కీవ్‌లో స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా భారీ పరేడ్, ప్రదర్శనలు జరిగాయి.
అయితే, ఇతర కార్యక్రమా లను ఈ ఏడాది రష్యన్ సేనల బాంబు భయంతో ముక్తసరిగా నిర్వహించారు. కీవ్ వీధుల్లో, వ్యాపార సంస్థలపైనా జాతీయ జెండాలను ఎగురవేశారు. ఇందుకోసం జాతీయ జెండాలను తయారు చేసే కార్యక్రమాన్ని నెలరోజుల క్రితమే మహిళలు ప్రారంభించారు. గతంలో వారు పరిశ్రమలు, హోటళ్ల యూనిఫారమ్‌లను తయా రు చేసేవారు. రష్యాపై ఎదురుదాడి కోసం తమ సేనలను పంపిన న్యూజిలాండ్ తదితర దేశాలు ఉక్రెయిన్ యుద్ధం త్వరలోనే ముగుస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాయి. రష్యా వద్ద ట్యాంకులు, ఇతర ఆయు ధాలు ఉండవచ్చు కానీ, మా సైనికుల మనో బలం ముం దు అవి ఎందుకూ కొరగావు అని ఉక్రెయిన్ సైనికాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
ఉక్రెయిన్- రష్యాల యుద్ధాన్ని ఇకనైనా నిలిపి వేయాలనీ, దీనివల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని పోప్ ఫ్రాన్సిస్ వ్యాఖ్యా నించారు. ఉక్రెయిన్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భం గా దేశ ప్రజలకు ఆయన సందేశం ఇస్తూ ఈ యుద్ధంలో ఉక్రెయిన్ సైనికులు, ప్రజలు చూపిన జాతీయభావ స్ఫూర్తి యావత్ ప్రపంచ దేశాలకూ ఆదర్శప్రాయమని అన్నారు.ఉక్రెయిన్‌కి పోప్ ఫ్రాన్సిస్‌నుంచి సామాన్యుల వరకూ అందరి మద్దతు నానాటికీ పెరుగుతోంది.