ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించి ఎనిమిది మాసాలు కావస్తోంది. ఎంతో మంది బాలలు,మహిళలు స హా ఉక్రెయిన్ పౌరులు ఎంతో మంది మరణించారు. ఇంకా మర ణిస్తూనే ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు రష్యాను వ్యతిరేకిస్తున్నాయి. క్రమంగా రష్యా ఒంటరి అవుతోంది.ఇంతమంది ప్రాణాలు విడుస్తున్నా రష్యా రక్తదాహం ఇంకా తీరకపోవడమే ఇందుకు కారణం కావచ్చు. రష్యా సాధించిందేమిటో, సాధించ దల్చిందేమిటో తెలియదు.మానవ జాతి చరిత్రలో ఇంత మారణ హోమాన్ని ఎన్నడూ కనీవినీ ఎరుగమని అనేక యుద్ధాలను ప్రత్యక్షంగా చూసిన వారు చెబుతున్నారు. ఉక్రెయిన్ ఇంధన వ్యవస్థను దెబ్బతీయడమే లక్ష్యంగా రష్యాదాడులు జరుపుతోంది.అలాగే,ఉక్రెయిన్ల ఉసురు తీయడానికి రష్యా ఎంత మాత్రం సందేహించడం లేదని ఆ దేశ అధ్యక్షుడు జెలెనిస్కీ వాపోయారు. రష్యాను ఇంతవరకూ సమర్ధిస్తూ వచ్చిన వారు సైతం ఇప్పుడు తాజాగా రష్యన్ దళాలు జరుపుతున్న దాడులను చూసి తీవ్రంగా విమర్శిస్తున్నారు.
ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధాన్ని ప్రారంభించడమే ఒక తప్పిదమైతే, యుద్ధం ముగింపు దశకు వచ్చిందనుకుంటున్న సమయంలో మరింత రెచ్చి పోయి రష్యన్ దళాలు క్షిపణుల వర్షాన్ని కురిపించడాన్ని ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఖండిస్తున్నాయి. ఇంతవరకూ అమెరికా, దాని మిత్ర దేశాలు మాత్రమే రష్యా దూకుడును ఖండించాయి.కాగా, ఇంతవరకూ రష్యా సొంత ఆయుధాలనూ,క్షిపణులను మాత్రమే ప్రయోగిస్తూ వచ్చింది.ఇప్పుడు ఇరాన్ డ్రోన్లను ఉప యాగిస్తోందని జెలెనిస్కీ ఆరోపించారు. రష్యా- క్రిమియాలను కలిపే కెర్చ్ వంతెనను గత శనివారం పేల్చేయడానికి ఉక్రెయిన్ ప్రయత్నిం చినందుకు ప్రతీ కారంగా ఈ దాడులు జరుపుతున్నట్టు రష్యాచెబు తున్నప్పటికీ,అంత తీవ్ర స్థాయిలో దాడులు జరపడాన్ని బట్టి జెలెనిస్కీ అన్నట్టు ప్రపంచ చిత్ర పటంలో ఉక్రెయిన్ లేకుండా చేయాలన్న లక్ష్యంతోనే రష్యా ఈ దాడులకు పాల్పడుతోందేమోనన్న అనుమానం ఇప్పుడు అందరికీ కలుగుతోంది.
అలాగే,ఈ వంతెనపై పేలిన ట్రక్కు రష్యాకు చెందిన వ్యక్తిదేనని వీడియో ఫుటేజ్ వల్ల తెలుస్తోంది. రష్యాయే దీనిని సృష్టించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఏదో ఒక కారణం చూపించి తాజా దాడులకు రష్యా పాల్ప డుతోందన్న అభిప్రాయం బలపడుతోంది. రష్యాను నిరో ధించాల్సిందిగా అమెరికా సహా, పారిశ్రామికంగా సంప న్న దేశాలను జెలెనిస్కీ అభ్యర్ధించారు.రష్యా ను నిరో ధించకపోతే తమ దేశమే కాదు,ఈప్రాంతంలో దేశాలన్నీ తుడుచుకునిపెట్టుకుని పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.కెర్చ్ వంతెనను పేల్చివేయడానికి ఉక్రె యిన్ దళాలు ప్రయత్నించాయన్నది రష్యా సృష్టించిన కట్టుకథ అని ఆయన ఆరోపించారు.రష్యాకి మద్దతు ఇస్తున్న దేశాల్లో ముఖ్యమైనది అయిన బెలారస్ సరిహద్దుల్లో అంతర్జాతీయ పరిశీలకుల బృందాన్ని నియమించాలని జి-7 దేశాలను జెలెనిస్కీ కోరారు.తమ దేశానికి ఆధునిక ఆయుధాలు,క్షిపణులను సరఫరా చేయాల్సిందిగా కోరారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్‌ని కొద్ది రోజుల క్రితం అజర్బైజాన్లో కలుసుకున్నప్పుడు యుద్ధం సమస్యకు పరిష్కారం కాదని మన ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు.అలాగే,యుద్ధాన్ని విరమిం చాలని జెలెనిస్కీకి కూడా ఫోన్లో హితవొసెగారు. అయిన ప్పటికీఈ రెండు దేశాలు పట్టుదలకుపోయి మరింతగా ఆయుధాలను ప్రయోగించుకోవడం, ఆస్తి, ప్రాణ విధ్వం సం జరగడం దుర్మార్గం. ఇలా ఉండగా, రష్యాకు వ్యతి రేకంగా మన దేశం మరింత కఠిన వైఖరిని అనుసరి స్తోంది.ఐక్యరాజ్య సమితిలో తాజాగా జరిగిన ఓటింగ్‌లో రష్యాకు వ్యతిరేకంగా మన దేశం ఓటు వేసింది. ఉక్రెయిన్‌లోని జఫోర్జియా,ఖేర్సన్ సహా నాలుగు ప్రాం తాలను తమ దేశంలో రష్యా కలుపు కోవ డాన్ని ఖండిస్తూ ఆల్బేనియా ప్రవేశపెట్టిన తీర్మా నానికి అనుకూలంగా 187 దేశాలు ఓటు వేశాయి.
వాటిలో మన దేశం కూడా ఉంది.రష్యాకు అనుకూలంగా 13 దేశాలు మాత్రమే ఓటు వేశాయి.39 దేశాలు ఓటింగ్‌కి దూరంగా ఉన్నాయి. వీటిలో చైనా, రష్యాలు ఉండటం గమ నార్హం.రష్యా ఎంత దూకుడు ప్రదర్శిస్తున్నా చైనా మద్దతు ఇస్తోందన డానికి ఇదే నిదర్శనం.గత నెలలో ఈ నాలుగు ప్రాంతా లను రష్యా విలీనం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ సమితి లో ప్రవేdపెట్టబడిన తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో మన దేశం పాల్గొనలేదు.రష్యా చర్యలను వ్యతిరేకిస్తూ భారత్ ఇంతవరకూ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఉక్రెయిన్‌పై రష్యాతాజా దాడి కారణంగా భారత్ అల్బే నియా తీర్మానికి అనుకూలంగా ఓటు వేసి ఉండవచ్చు.