Tuesday, November 26, 2024

అస్తిత్వ రాజకీయ క్రీడ!

బీహార్‌లో మంగళవారం నాడు శరవేగంగా రాజకీ య పరిణామాలు చోటుచేసుకున్నాయి. మహారాష్ట్రలో మాదిరిగా మరో షిండేని మోడీ- షా ద్వయం ప్రోత్సహి స్తున్నదేమోనన్న అనుమానంతో ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ వడిగా పావులు కదుపుతున్నారు.బీజేపీతో కటీఫ్‌ చేసుకున్నారు, బీహార్‌ రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాలో ఆయనే ఇప్పుడు సీనియర్‌.బీహార్‌ని జంగి ల్‌ రాజ్‌గా చేసిన ఘనత ఆర్‌జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ని గద్దె దింపి ప్రజాస్వామ్య బీహార్‌ని పాదుకొల్పు తానని వాగ్దానం చేసిన నీతీశ్‌ కుమార్‌ ఏ కూటమిలోనూ ఇమడలేకపోతున్నారు. ఆయన కాంగ్రెస్‌ వ్యతిరేక భావ జాలంలో రాజకీయాల్లో పెరిగారు. అదే సందర్భంలో లోక్‌నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ్‌ శిష్యునిగా అవి నీతి వ్యతిరేక పోరాటంలో పాల్గొనడం ద్వారా రాజకీ యాల్లో పైకి వచ్చారు.

అంతేకాకుండా మతతత్వ రాజకీ యాలను వ్యతిరేకించే నాయకునిగా ఆయన జయ ప్రకా ష్‌ నారాయణ్‌ వారసత్వాన్ని కొనసాగించాలనుకుంటు న్నారు. ఈ మూడింటికి పొత్తు పొసగకపోవడం వల్ల ఆయన కూటములను మార్చే నాయకునిగా ముద్రపడ్డా రు. నిజానికి పదవుల కోసం పార్టీలూ, కూటములు మార డం ఆయన నైజం కాదు. ఏ కూటమిలో ఉన్నా ఆయన సెక్యులర్‌ భావాలను వీడలేదు.సందర్భం వచ్చినప్పుడు తన నిరసనను గొంతెత్తి తెలియజేస్తున్నారు.మొదట కాంగ్రెస్‌తో జతకట్టడానికి సెక్యులర్‌ భావాల విషయంలో సారూప్యాన్ని కలిగి ఉండటమే. అయితే, కాంగ్రెస్‌ అవినీతిని సహించలేక బయటికి వచ్చారు. అలాగే, జయ ప్రకాష్‌ నారాయణ్‌ ప్రారంభించిన సంపూర్ణ విప్లవం ఉద్యమంలో కలిసి పని చేసిన అనుభవం ఉన్న దృష్ట్యా రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్‌జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌తో జతకట్టారు. అయితే, పాలనలో లాలూ ఆయన కుటుంబ సభ్యుల ప్రాబల్యం పెరగడంతో ఆర్‌జేడీతో కటీఫ్‌ చేసుకున్నారు.అవినీతికి కాంగ్రెస్‌ కిటికీ లు తెరిస్తే, ఆర్‌జేడీ ప్రధాన ద్వారాలు తెరిచిందని ఆరోజు ల్లో మీడియా చమత్కరించేది.

అంతేకాక, పప్పూ యాద వ్‌ వంటి ముఠా నాయకులను లాలూ ప్రోత్సహించారు. దాంతో ప్రభుత్వం ప్రతిష్ఠ గంగలో కలిసింది. ఈ కారణం గా లాలూ నుంచి వేరు పడ్డారు. అయినా లాలూ సెక్యుల ర్‌ వాదాన్ని ముందుకు తేవడంతో ఆ పార్టీతో మళ్ళీ పొత్తు కుదుర్చుకున్నారు. అది ఎంతో కాలంనిలవలేదు. మాజీ ప్రధాని వాజ్‌పేయితో సాన్నిహిత్యం కారణంగా ,ఆయన నేతృత్వంలోని మంత్రివర్గంలో రైల్వే శాఖను నిర్వ హించారు. రామసేవకుల సామూహిక దహనానికి కారణమైన సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ బోగీల దగ్ధం సంఘటన అనంతరం జరిగిన హింసాకాండనుమొదట ఖండించి న ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌. గుజరాత్‌ అల్లర్లపై నరేం ద్రమోడీని ప్రధానమంత్రి వాజ్‌పేయి బహిరంగంగానే మందలించారు. పాలకుడన్నవాడు రాజధర్మాన్ని పాటించాలంటూ హెచ్చరించారు. దాంతో మోడీ, నితీశ్‌ ల మధ్య దూరం పెరిగింది. బీహార్‌లో కోసీ నది వరద బాధితులకు గుజరాత్‌ తరఫున ఐదుకోట్ల రూపాయిల సాయాన్ని మోడీ ప్ర కటించగా, వద్దని నితీశ్‌ తిరస్కరిం చారు.

ఇద్దరూ ఒబీసీ (ఇతర వెనుకబడిన తరగతులకు) చెందినవారే. అయితే, ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డిఏలో మోడీ ఆద్వానీ పక్షాన,నితీశ్‌ వాజ్‌పేయి పక్షాన నిలిచారు. అదే సమయంలో అవిభక్త బీహార్‌కి చెందిన యశ్వంత్‌ సిన్హాతో నితీశ్‌ సన్నిహితంగా ఉండేవారు. మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత యశ్వంత్‌ సిన్హాని దూరంగా పెట్టడం నితీశ్‌కి నచ్చలేదు.ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ ఎన్‌డిఏ ప్రభుత్వాన్ని కాపాడేందుకు నితీశ్‌ కుమార్‌ ఆ కూటమిలోనే తమ పార్టీని కొనసాగించారు. మహరాష్ట్రలో శివసేన పార్టీని చీల్చేందుకు కేంద్రంలో కమలనాథులు అనుసరించిన వ్యూహాలు, ఎత్తుగడలు నితీశ్‌కి నచ్చలేదు. మహారాష్ట్ర తర్వాత కమలనాధుల తదుపరి టార్గెట్‌ జార్ఖండ్‌ అనే వార్తలు వచ్చాయి.సాధారణ ఎన్నికల లోపు బీహార్‌లో కూడా నాయకత్వ మార్పు కోసం బీజేపీ నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు.

గత అసెంబ్లి ఎన్నికల ముందు జనతాదళ్‌(యు)కు తక్కువ స్థానాలు వచ్చినా నితీశ్‌కే ముఖ్యమంత్రి పదవిని ఇస్తామని ప్రకటించి మాటనిలబెట్టుకుంది. అయితే, ఆ అవకాశాన్ని అదును గా తీసుకుని బీజేపీ నాయకులు పాలనలో అతిగాజోక్యం చేసుకోవడం నితీశ్‌కి నచ్చలేదు. పైగా, ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా నితీ శ్‌కి మంత్రుల శాఖల కేటాయింపులో స్వేచ్ఛ లేకుండాచేశారు. దీంతో అప్పటి నుంచి ఆయన కినుక వహించారు. బీహార్‌లో ముస్లింల జనాభా 15 శాతం ఉంది. పౌరచట్టం సవరణను (సీఏఏ) త్వరలో తెస్తామనీ, కరోనా వల్ల వాయిదా వేశామే కానీ, దానికి స్వస్తి చెప్పలేదంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఇటీ వల పలు సార్లు చేసిన ప్రకటనతో బీజేపీకి దూరంగా జర గాలని నితీశ్‌ కుమార్‌ నిర్ణయించుకుని ఉంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement