అసెంబ్లిలో, పార్లమెంటులో ప్రభుత్వం తాము ప్రతి పాదించిన సవరణలను ఆమోదించకపోతే, తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే ప్రతిపక్షాలు వాకౌట్ చేయడం సహజం. కానీ, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి సోమవారంనాడు అసెంబ్లి నుంచి వాకౌట్ చేసి అంద రినీ ఆశ్చర్య చకితులను చేశారు. తమిళనాడు ముఖ్యమం త్రి ఎంకె స్టాలిన్‌కీ, గవర్నర్ రవికీ చాలా కాలంగా పడటం లేదు. ప్రభుత్వం పంపిన బిల్లులను లేదా ప్రతిపాదనల ను గవర్నర్ తొక్కిపెడుతున్నారన్న అనుమానం స్టాలిన్ కి ఉంది. అయితే, ఇలాంటి అనుమానాలు, స్పర్థలు ఇతర రాష్ట్రాల్లో కూడాఉన్నప్పటికీ వారెవరూ రచ్చకెక్కడం లేదు. తమిళనాడులో విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది. గవర్నర్ రవి కేంద్రం చెప్పినట్టు నడుచుకుంటు న్నాడన్న అనుమానాలను తమిళ నాయకులు పలు సందర్భాల్లో వ్యక్తం పర్చారు. ఆయన పోకడలు వారి అనుమానాలను బలపరుస్తున్నాయి. రాష్ట్ర శాసనసభ సమావేశాలను ప్రారంభిస్తూ గవర్నర్ ప్రభుత్వం రాసి చ్చిన ప్రసంగాన్నే చదవాలి. కేంద్రంలోనూ అంతే, ప్రభు త్వం రాసిచ్చిందే రాష్ట్రపతి చదువుతారు. కానీ, తమిళ నాడు గవర్నర్ తన ప్రసంగంలో కొన్ని పంక్తులనూ, పేరాలనూ వదిలివేశారు. అవి తమిళ సంస్కృతీ సంప్ర దాయాలను ప్రత్యేకంగా ప్రస్తావించేవనీ, వాటిని వదిలి వేయడం తమిళ సంప్రదాయాన్ని అగౌరవ పర్చినట్టేన ని డీఎంకె సభ్యులు అభ్యంతరం చెప్పారు, ముఖ్యంగా, పెరియార్ రామస్వామి, అన్నాదురై, కరుణానిధి వంటి తమిళ ప్రముఖుల పేర్లను వదిలి వేయడం తమిళులను అవమానించినట్టేనని వారు భావించారు. అంతేకాకుం డా కరుణానిధి సూక్తులు కొన్నింటిని కూడా గవర్నర్ రవి వదిలి వేయడాన్ని స్టాలిన్ జీర్ణించుకోలేకపోయారు.
దాంతో ఆయన గవర్నర్ ప్రసంగిస్తున్నప్పుడు పలుమా ర్లు అడ్డు తగిలారు. దానిని అవమానంగా భావించి గవర్నర్ సభ నుంచి వాకౌట్ చేశారు. ఇది ప్రత్యక్ష ప్రసా రం కావడంతో వార్తాప్రసార సాధనాల ద్వారా లోకమం తా వీక్షించింది. తమిళనాడు గవర్నర్ ఈ విషయంలో కొంత అతిగా వ్యవహరించేరేమోన నిపిస్తోంది. బీజేపీ యేతర రాష్ట్రాల్లో గవర్నర్లు, అక్కడి ప్రభుత్వాలతో పొస గడం లేదన్న వార్తలు వస్తున్నప్పటికీ, ఆయా రాష్ట్ర ప్రభు త్వాలు రాసిచ్చిన ప్రసంగాలను చదవడానికి కొంత ఇబ్బంది పడుతున్న ప్పటకీ, వారెవరూ ఇంత బహిరం గంగా ప్రభుత్వంతో లడాయికి దిగలేదు. వారెవరూ సభాముఖంగా ముఖ్యమంత్రులతో ఈ మాదిరి తగాదా పెట్టుకోలేదు. తమిళనాడులో గవర్నర్ చర్య దేశమంత టా చర్చకు తెరలేపింది. ప్రభుత్వం రాసిచ్చిందే చదవ డం ఓ సంప్రదాయం. దానికి భిన్నం గా గవర్నర్ తనకు ఇచ్చిన పదాలను, వాక్యాలనూ వదిలి వేయడం, సెన్సార్ చేయడం సరైన పద్ధతి కాదని ఇప్పటికే పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తమిళులకు తమ భాష, సంస్కృతీ సంప్రదాయాల పట్ల అభిమాన ం ఎక్కువ. వాటి విష యంలో ఎవరితోనైనా తలపడటానికి వారు సిద్ధపడతా రు.
ఉత్తరాది వారు తమ భాషా, సంస్కృతులకు తగిన ప్రాధాన్యం, గౌరవం ఇవ్వడం లేదన్న అపోహ వారిలో ఎక్కువగా ఉంది. తమిళనాట హిందీ వ్యతిరేక ఉద్యమా లకు అదే మూలం. తమిళనాడు గవర్నర్ ఎన్ రవి మాజీ ఐపీఎస్ అధికారి.ఆయన పుట్టింది, పెరిగిదీ, ఉద్యోగ రీత్యా ఎక్కువ కాలం గడిపిందీ ఉత్తరాది రాష్ట్రాల్లో అయినా, ఆయన పేరును బట్టి తమిళుడేనన్న అర్థం ద్యోతకమవుతోంది. ఎన్.రవి ప్రసంగంలో కొన్ని పదాల ను వదలివేయడం పట్ల ముఖ్యమంత్రి స్టాలిన్ లేచి అభ్యంతరం తెలిపారు. దాంతో ఆయన పార్టీ (డిఎంకె), కాంగ్రెస్, వామపక్షాల వారు అభ్యంతరాలను తెలిపారు. దీంతో గవర్నర్ సభ నుంచి వెళ్ళిపోయారు. ఇది ఇటు ప్రభుత్వానికీ, అటు గవర్నర్‌కీ అవమానకరమే.దీంతో సీపీఐ నాయకులు మరింత ముందుకు వెళ్ళి తమ పాత డిమాండ్‌ని లేవనెత్తారు. గవర్నర్లు కేంద్రానికి అను కూలంగా వ్యవహరిస్తున్నారనీ, గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని వారు మరోసారి డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ కూటమి ప్రభుత్వం గవర్నర్లను తోలుబొమ్మలను చేసి ఆడిస్తోందనీ, గవర్నర్ల వ్యవస్థ వల్ల ఎటువంటి ప్రయజనంలేదనీ సీపీఐ నాయకులు చాలా కాలంగా వాదిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఆ డిమాండ్‌ని మరోసారి లేవనెత్తారు. అయితే, అన్నా డీఎంకె సభ్యులు తమతో కలసి రాలేదనీ డీఎంకె నాయకులు ఆరోపించారు. తమిళ నాడులో మాజీ ముఖ్యమంత్రి వాడప్పాడి రామమూర్తి బీజేపీ నాయకులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండ టం వల్లనే వారు గవర్నర్‌కి వ్యతిరేకంగా తాము జరుపు తున్నపోరులో కలిసి రావడం లేదన్నది డీఎంకే, సీపీఐ తదితర పార్టీల ఆరోపణ. ఈ ఆరోపణలూ, ప్రత్యారోపణ లూ ఎప్పుడూ ఉండేవే. కానీ,సభలో గవర్నర్, ముఖ్య మంత్రి వేర్వేరు దారులు పట్టడం ఇదే ప్రథమం. ఇది ఒక చెడు సంప్రదాయంగా పలువురు భావిస్తున్నారు.