Monday, November 25, 2024

Editorial – ఇది యోగి మార్క్ న్యాయం …

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సంచ లనాత్మక అడుగుల్లో తాజాగా మరో అడుగు.. ఆయన మాత్రమే వేయగల అడుగు.. కరడుగట్టిన నేరగాళ్లు.. గ్యాంగ్‌స్టర్‌ల నుంచి స్వాధీనం చేసుకున్న స్థలాల్లో ఇళ్లు కట్టి పేదలకు అప్పగించడం ఆయనకే చెల్లింది. ఇప్పటికే రాష్ట్రంలో అదొక ఆమోదయోగ్యమైన చర్యగా ముద్ర పడింది. గ్యాంగ్‌స్టర్‌ల ఎన్‌కౌంటర్లు, బుల్‌డోజర్‌ విధానా లు మొదట్లో వివాదాస్పదమైనా, ఉత్తర ప్రదేశ్‌లో అవే సహేతుక చర్యలైపోయాయి. జనం చేతు శభాష్‌ అనిపిం చిన ఘనత యోగిది. శాంతిభద్రతల విషయంలో ఆయన ఎన్నడూ రాజీపడలేదు. రౌడీషీటర్లు, గ్యాంగ్‌స్ట ర్ల నుంచి స్వాధీనం చేసుకున్న స్థలాల్లో అన్నివర్గాలకు చెందిన పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వడం ద్వారా విమర్శ లకు చెక్‌ చెప్పినట్టయింది. ఇతర రాష్ట్రాలు సైతం యూపీ వైపు పరికించి చూ పరిస్తితి కల్పించారు. అపర సాధువైన యోగికి ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి ఆయన ఆప్తుడు. ఆ ఆశీస్సుల తోనే యోగి అధికారంలో కొనసాగుతు న్నారు. యోగిని పదవి నుంచి తప్పించాలని ఎవరెన్ని విజ్ఞప్తులు చేసినా మోడీ పట్టించుకోలేదు. ప్రధానమంత్రి అండ ఉండబట్టే సొంత నిర్ణయాలతో యోగీ రాష్ట్రంలో తనదైన పాలన సాగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా యోగీ హయాంలో 11 ఎన్‌కౌంటర్లు జరిగాయి. బందిపోట్లు, గ్యాంగ్‌స్టర్ల, కరుడుకట్టిన నేరస్థులను పట్టుకుని తీసుకుని వచ్చి పోలీసులు ఎన్‌కౌంటర్లు చేస్తున్నారన్న ఆరోపణలు ఆదిలోనే వచ్చాయి. ఇటీవల అతీఖ్‌, అతడి సోదరుడు అష్రాఫ్‌లను పట్టపగలు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.

దీనిపై రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయేమోనని కేంద్రం కూడా అనుమానించింది. అయితే, అందుకు భిన్నంగా అతీఖ్‌ సోదరుల వద్ద స్వాధీనం చేసుకున్న భూముల్లో ఇళ్ళులేని పేదల కోసం ఇళ్ళు కట్టించి ఇచ్చిన ఘనత యోగిది. ఆ స్థలంలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద కట్టించిన ఇళ్ళని శుక్రవారం నాడు యోగి ప్రారంభించి పేదలకు హక్కు పత్రాలను అంద జేశారు. లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. పేదలకే కాదు, హిందువులకు, ఇతర వర్ణాలకు పండుగలు, ముఖ్యమైన కార్యక్రమాలకు అవసరమైన సౌకర్యాలను కల్పించడం ద్వారా యోగి అందరి అభిమానాన్ని చూరగొంటున్నారు. గంగా జలా లను కావిళ్ళతో తెచ్చి తమ గ్రామాల్లో, పట్టణాల్లో ఉండే శివా లయాల్లో అభిషేకం చేసే కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్‌ లో కన్వర్‌లు అనే సామాజిక వర్గంవారు అమలుజేస్తూ ఉంటారు. కన్వర్‌ల యాత్రలపై గతంలో దాడులు జరిగేవి. శాంతి భద్రతల సమస్యలు తలెత్తేవి. అలాగే, ముస్లింలు జోషిమఠ్‌ ప్రాంతంలో నమాజులు చేసుకోవ డం ఓ సంప్రదాయం.

ఈ ఏడాది ఎటువం టి ఘర్షణలు లేకుండా ఈ కార్యక్రమం సాఫీగా సాగిపోయింది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకంకింద అన్ని రాష్ట్రాలకు కేంద్రం నిధులు కేటాయిస్తోంది. ఈ నిధులతో నిర్మించిన ఇళ్ళను ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కేంద్రం పేరెత్తకుండా తమ సొంత పథకాలుగా ప్రకటించి అమలు చేస్తున్నారన్న ఆరోపణలు ఇప్పటికే వచ్చాయి. మోడీకి వీర విధేయుడైన యోగీ ఈ ఫ్లాట్ల ప్రవేశ ద్వారం వద్దనే ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన అని బోర్డు పెట్టించారు. ప్రయాగ్‌రాజ్‌లో లుకేర్‌గంజ్‌ ప్రాంతంలో అతీఖ్‌ సోదరుల నుంచి స్వాధీనం చేసుకున్న స్థలాల్లో 67ఫ్లాట్‌లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. వీటి కోసం 6,030 దరఖాస్తులు రాగా, 1590 ఫ్లాట్‌లను లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపికచేసి పంపిణీ చేశారు. సామాన్యుడి దృష్టిలో చూస్తే ఇదొక సంచలనమే. ఆదర్శమే. చట్టపరంగా దీని ఆమోదయోగ్యతల జోలికి యోగిపోదల్చుకోలేదు. అంతిమంగా సామాన్యుడికి లబ్ది జరిగిందా లేదా అనే యోగి ఎదురు ప్రశ్నిస్తారు. ఆ ఫ్లాట్లలో నీటి, విద్యుత్‌ సరఫరాలు, మురుగునీటి పారుదల సౌకర్యం సక్రమంగా ఉన్నాయో లేదో స్వయం గా పరిశీలించారు. ఈ ఫ్లాట్ల నిర్మాణానికి 2021 డిసెంబర్‌ లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేత శంకుస్థాపన చేయించారు.

- Advertisement -

మోడీ మనసులోని విషయాలను గ్రహిం చి అమలు జరుపుతున్న ముఖ్యమంత్రిగా యోగీ మంచి పేరు సంపాదించారు. గంగా పుష్కరాల నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా స్వయంగా పర్యవేక్షిం చారు. వారణాసిలో కాశీవిశ్వనాథ్‌ కారిడార్‌ నిర్మాణాన్ని చేపట్టి ప్రశంసలు అందుకున్నారు. అలాగే, అయోధ్యలో రామమందిరం నిర్మాణ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో పూర్వపు ముఖ్యమంత్రుల హయాంలో గ్యాంగస్టర్ల పెత్తనం ఎక్కువగా ఉండేది. ఆ ముఠాలు సమాంతర ప్రభుత్వాల ను నడిపేవి. ఇప్పుడు అటువంటివేమీ లేకపోవడం యోగీ తెచ్చిన మార్పుల ఫలితమే. యోగి ఎంత చేసినా ఆయనచర్యలు మాత్రం శీలపరీక్ష ఎదుర్కొంటూ రాజ్యాంగపు తరాజులో ఊగిస లాడుతూనే ఉంటాయి!

Advertisement

తాజా వార్తలు

Advertisement