Friday, November 22, 2024

Editorial – ఆల‌స్య వ‌ర్షాల‌తో చేటు…

వర్షాకాలంలో వానలు కురవాలి. కానీ, రుతుపవ నాలు గతి తప్పి దోబూచులాడుతున్నాయి. గత ఏడాది తో పోలిస్తే దాదాపు రెండు వారాలు ఆలస్యమైనా చురుకుగా లేవు. ఎట్టకేలకు బుధవారం మేఘాల కదలికలు మొదల య్యాయి. అయినా ఇప్పటికే ఆలస్యం కావడం వల్ల దాని ప్రభావ వ్యవసాయరంగంపై ప్రతికూలంగానే ఉం టుంది. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా భారత దేశానికి రుతుపవనాలు ఓ వరం. దేశ వ్యవసాయ రంగంలో దాదాపు 80 శాతం ఈ రుతుపవనాలపైనే ఆధారపడి ఉంది. ఆహార ధాన్యాల ఉత్పత్తి, స్థూల జాతీ యోత్పత్తికి ఈ రుతుపవనాలు అత్యంత కీలకం. ఖరీఫ్‌ సీజన్‌ మొదలైనా వర్షాల జాడ లేకపోవడంతో ఈసారి వ్యవసాయం ఒడిదొడుకులకు లోనుకావచ్చు. ఆందోళన రైతుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఈసారి ఎండలు మండిపోయాయి. ఈ ఎండలేమిటని వయసు మీరిన పెద్దలు ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నారు. ఎండల వల్ల బయట అడుగు పెట్టలేకపోతున్న బాధంతా వారి మాట ల్లోనే కనిపిస్తోంది. జూన్‌ మూడో వారం దాటిపోతున్నా దేశంలోని పలు ప్రాంతాల్లో వడగాడ్పులు ఊదరగొడు తున్నాయి. సాయంత్రం ఆరు దాటినా వేడి గాలులు వీస్తూనే ఉన్నాయి.

దేశవ్యాప్తంగా 140 కోట్ల మందికి ఆహార ధాన్యాలు, ఇతర పంటలను అందిం చేందుకు వర్షాలు తగినంతగా పడితేనే ప్రయోజనకరం, అరకొర వర్షాలు, దాగుడుమూతల వర్షాలు ఏమాత్రం ప్రయో జనకరం కాదు. భారత్‌లో వ్యవసాయం జూదంగా తయారైందన్న పూర్వపు శాస్త్రజ్ఞుల మాటలు అవాస్తవం కాదు. వ్యవసాయ రంగాన్ని నమ్ముకున్న రైతాంగం పరిస్థితి చూస్తే జాలేస్తోంది. పెట్టుబడుల కోసం బ్యాం కులు, వడ్డీ వ్యాపారుల వద్ద పెద్ద మొత్తాల్లో అప్పులు చేసి సేద్యం చేస్తే రైతుకు మిగిలేది నిరాశే. ఇవే పెట్టుబడులు ఇంకో రంగం లో పెడితే కొంతైనా బయటపడే వారమన్న అభిప్రాయం రైతుల్లో కలగడం సహజమే. అకాల వర్షాలు, ఆలస్యపు వర్షాల ప్రభావం ఏడాది పొడవునా రైతులను వేధిస్తాయి. ముఖ్యంగా, అకాల వర్షాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఎంత నష్టపోయారో ఇటీవల కళ్ళారా చూశాం. తడిసిన ధాన్యాన్ని ప్రతిగింజ కొంటా మంటూ ప్రభుత్వాల ప్రకటన కార్యాచరణలో కన్పించ డం తక్కువే. రైతుల గురించి ఆలోచించేవారు కరవ య్యారు.

దేశవ్యాప్తంగా 188 జిల్లాల్లో వర్షపాతం తక్కు వగా నమోదైంది. దేశంలో ఉపాధికి ఎన్నో రంగా లున్న ప్పటికీ , తరతరాలుగా భూమిని నమ్ముకున్న రైతులు ఈసారి కాకపోయినా, మరోసారైనా అప్పుల ఊబినుంచి బయటకపోతామన్న ఆశతో రైతులు వ్యవసాయాన్ని ఒక శ్వాసగా తీసుకుని ముందుకు సాగుతున్నారు. అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వాలు కొనలేదని రైతులు వాపోతున్నారు. తొలకరిలో వర్షాలు పడకపోతే ఇక ఆ ఏడాది అంతా ఇబ్బందులే నన్నది రైతుల సెంటిమెంట్‌. రైతుల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుని వారికి తగిన సలహాలు, సూచనలు ఇవ్వడా నికి వివిధ స్థాయిల్లో ప్రభుత్వంలో యంత్రాంగా లున్నా యి. లాబ్‌ -టు- లాండ్‌ అనే సూత్రాన్ని ఇప్పుడు ఎవరూ పాటించడం లేదు. ఎవరికి తోచిన రీతుల్లోవారు పని చేసుకు నిపోతున్నారు. కానీ, ఫలితం దక్కడం లేదు. తక్కువ రోజుల్లో చేతికి అందివచ్చే పంటలను వేసిన రైతుల అను భవాలు వేరుగా ఉన్నాయి. ఆ వంగడాల వల్ల ఫలితం రాకపోగా భూ సారం తగ్గిపోతోందని వాపోతున్నారు.

వ్యవసాయ విస్తరణా ధికారులు, వ్యవసాయ రంగానికి చెందిన ఇతర అధికారులు తరచూ క్షేత్ర పరిశీలన జరిపి భూముల్లో వచ్చే మార్పులను రైతులకు తెలియజెప్పి తగిన సూచన లు ఇవ్వాలి. రసాయినిక ఎరువుల వాడకం వల్ల భూసా రం తగ్గిపోతోందన్న వాదన కూడా ఉంది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన కొత్తలో భూసార పరీక్షలు తరచూ జరిపించాలని సూచించారు. వ్యవసాయ రంగాన్ని నిరంతరం కనిపెట్టి ఉండే యంత్రాంగం ఉండాలి. కానీ, మన దేశంలో గ్రామాల్లో ఉండాల్సిన ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్లు ఎప్పుడూ పట్టణాల్లోనే ఉంటు న్నారు. అలాగే, రైతుల్లో కూడా చొరవ ఆసక్తి రానురాను తగ్గిపోతోంది. దీనికి కారణం గిట్టుబాటు ధర లభించ కపోవడమే. మద్దతు ధర అంశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం కోసమే ఉపయోగించుకుంటు న్నాయి.నిజానికి ఇటీవల కేంద్రం ప్రకటించిన మద్దతు ధరను మొక్కబడి ధర అని రైతులు బహిరం గంగానే విమర్శించారు. పారిశ్రామిక, కార్పొరేట్‌ రంగాలపై చూపుతున్న శ్రద్ధను వ్యవసాయ రంగంపై చూపడం లేదన్న అపప్రథను తప్పించుకోవడానికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement