Friday, November 22, 2024

ఎడిటోరియ‌ల్ – య‌డ్డీ రిటైర్మెంటేనా…

తెలంగాణాలో అధికారంలోకి రావడంపై తమ పార్టీ దృష్టిని కేంద్రీకరించినట్టు బీజేపీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఇటీవల ప్రకటించారు.ఆ సంగతి తర్వాత,ముందు కర్నాటకలో ఆ పార్టీ అధి కారాన్ని నిలబె ట్టుకుంటే చాలు. కర్నాటక మాజీ ముఖ్య మంత్రి బీఎస్‌ యెడియూరప్ప రాజకీయ రిటైర్మెంట్‌ తీసుకుంటున్నట్టు ప్రకటించడంతో దక్షిణాదిన బీజేపీ బలహీన పడటం ఖాయమన్న విశ్లేషణల్లో నిజమెంతో ఉంది. కర్నాటక బీజేపీలో లుకలుకలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. యెడియూరప్ప లేకపోతే బీజేపీ లేదన్నంతగా ఆయన ఆ పార్టీతో బంధాన్ని పెనవేసు కున్నారు. బీజేపీకి సైద్ధాంతిక స్ఫూర్తిని ఇస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌)లో సాధారణ కార్యకర్తగా జీవితం ప్రారంభించిన యెడియూరప్ప వ యసు ఏడున్నర పదులు దాటడంతో ఇక రిటైరవుతానని ప్రకటించారు.ఇందుకు వేరే కారణాలు ఏవీ కనిపించడం లేదు. ముఖ్యమంత్రి పదవి నుంచి తనను తప్పించడం వల్ల ఆయన అధిష్టానంపై అలిగి ఉన్నారన్న ప్రచారం జరిగింది. ఆయన పార్టీకి ఎంత చేశారో, పార్టీ కూడా ఆయనకు అంతగా అవకాశాలు కల్పించింది.

యోడియూరప్ప నిష్కళంకుడు కాకపోయినా, నిబద్ధత గల పార్టీ నాయకునిగా పేరొందారు.దక్షిణాదిన బీజేపీ కాలూనడానికి ఆయనే కారణం.తమిళనాడు,కేరళలలో బీజేపీ అంటే భగ్గుమనే వారు ఇప్పటికీ ఎంతో మంది ఉన్నారు.ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి ఆదరణ అంతంత మాత్రమే. తెలంగాణాలోనే కొద్దోగొప్పో ఆ పార్టీని ఆదరించేవారున్నారు.అందుకే,తెలంగాణలో అధికా రంలోకి రావడంపై తమ దృష్టిని కేంద్రీకరించామంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. కర్నా టకలో పార్టీని అందలం ఎక్కించడానికి యెడియూరప్ప ఎంతో కష్టపడ్డారు.ఆయన కష్టానికి గుర్తింపుగానే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అధిష్టాన వర్గం నాలుగుసార్లు కల్పించింది. పార్టీ పునాదులుగా ఆయన సంఘ్‌ శాఖలను ఉపయోగించుకున్నారు. సంఘ్‌లో అన్ని పదవులను నిర్వహించిన తర్వాతనే ఆయన బీజేపీలో ప్రవేశించారు. సంఘ్‌లో మాదిరిగానే పార్టీలో అకుంఠిత దీక్షతో పని చేశారు. దానికి తోడు లింగాయత్‌ సామాజికవర్గం అండదండలతో ఆయన ఎదురులేని నాయకునిగా ఎదిగారు.

- Advertisement -

లింగాయత్‌ సామాజిక వర్గం గురువు గారైన శివగంగ మఠం అధిపతి ఆశీస్సులతో ఆయన రాజకీయంగానూ, సామాజికంగానూ ఎదిగారు. మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి సోదరుల ప్రమేయం ఉన్న మైనింగ్‌ కుంభకోణం,తన కుమారుడు రాఘవేంద్రకు ప్రమేయం ఉన్న కుంభకోణాలు ఆయన రాజకీయ జీవితంలో చెరగని మచ్చ వేశాయి. యెడియూరప్ప వివాద రహితుడు. పార్టీకి దక్షిణాదిన పెట్టని కోటగా ఉండేవారు. బీజేపీలో అగ్రనాయకుల నుంచి దిగువ స్థాయి కార్యకర్తల వరకూ అందరితోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. అదే సంద ర్భంలో కాంగ్రెస్‌,జేడీఎస్‌ వంటి ప్రతిపక్షాల నాయకు లతోనూ ఆయన మంచిగానేఉంటూ ముఖ్యమంత్రిగా కొనసాగినంత కాలం ఎటువంటి గొడవలు లేకుండా అందరివాడిగా మెలుగుతూ వచ్చారు.యెడియూరప్ప రిటైర్మెంట్‌వార్త కర్నాటకలోనే కాకుండా దక్షిణాదిన బీజేపీ నాయకులందరిలో పిడుగులా పడింది.ఆయన క్రియా శీలంగా లేకపోయినా, ఆయన సలహాలు, సూ చనలు పార్టీకి ఇక ఉండవేమోనని ఆందరూ ఆందోళన చెందుతున్నారు. బీజేపీ రాష్ట్ర శాఖలో ద్వితీయ శ్రేణి నాయకులు ఎంతో మంది ఉన్నప్పటికీ, ఆయన మాదిరిగా కలుపుగోలుగా వ్యవహరించేవారు తక్కువ. ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మయ్‌ రాజకీయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ,పార్టీపైనా, కార్యకర్తల పైనా ఆయన తన ముద్ర వేయలేకపోయారు.

ముఖ్యమంత్రిగా ఆయన గద్దె నెక్కి ఏడాది మాత్రమే అయినందువల్ల ఆయనకు ఆ అవకాశం రాలేదేమో. అయితే, ఏడాది వ్యవధిలో ఆయన ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారు. ముస్లిం మహిళలు ధరించె హిజాబ్‌ని తప్పనిసరి చేస్తూ ఆయన తెచ్చిన జీవో రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లను సృష్టించింది.అలాగే,రాష్ట్రంలో పలు చోట్ల గాడ్సే విగ్రహాల ఏర్పాటు విషయంలో కూడా ఆయన విమర్శలను ఎదుర్కొన్నారు.పార్టీకి యెడి యూరప్ప వల్ల వచ్చిన మంచి పేరు బసవరాజ్‌ బొమ్మ య్‌ హయాంలో కరిగి పోయింది. యడియూరప్ప శిష్యుణ్ణని చెప్పుకుంటూనే ఆయనకు వ్యతిరేకంగా బొమ్మయ్‌ చాలా నిర్ణయాలు తీసుకు న్నారు.అలాగే, మతపరమైన శక్తులను బొమ్మయ్‌ ప్రోత్సహిస్తున్నా రంటూ ఆరోపణలు వచ్చాయి. బీజేపీలో అమిత్‌ షాకి బాగా స న్నిహితంగా ఉండటం వల్లనే యెడియూరప్ప పదవి నిలబడిందనే ప్రచారం అప్పట్లోజరిగింది.అదే అమిత్‌ షా వల్లనే ఆయన పదవి ఊడిందన్న ప్రచారమూ జరిగింది. కర్నాటకలో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందా అనేది ఊహాజనితమైన ప్రశ్న.యెడియూరప్ప గతంలో సొంత పార్టీని నెలకొల్పారు. ఏమైనా కర్నాటక రాజకీయా ల్లోయెడియూరప్ప బలమైన శక్తిగా ఇప్పటికీ కొనసాగుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement